వేదాలు - కలనైనా ఊహకందని నిజాలు - vedas and truth

0

వేదాలను వెక్కిరించే వెధవలకు కలనైనా ఊహకందని నిజాలు :

వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి వర్ణం, స్వరం, మాత్ర (ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును. ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

వాక్య పాఠం: దీనినే సంహిత పాఠం అని కూడా అంటారు. అంటే ఒకే క్రమంతో ఉచ్చారణ, స్వరం, మాత్రలను జాగ్రత్తగా మంత్రాన్ని పఠించడం. A-B-C-D-E పద్ధతిలో చెప్పే ఈ విధానం plain data transfer లాంటిది.

పద పాఠం: దీనిలో పదాలుగా విభజించి పదాలు పదాలు గా గుర్తు పెట్టుకోవడం. దీనివల్ల తప్పు జరగడం తక్కువ అవుతుంది. ఒకొక్క పదాన్ని ఒకొక్క సెట్ గా ఉంచుకుని వాక్య, పద పాఠాలు కలిపి చదువుకుంటే తప్పులుంటే తప్పక తెలిసిపోతాయి. SECDED అనే పద్ధతి నేటి ఎర్రర్ కరెక్షన్ లో అతి సాధారణంగా మనం చూస్తూ వుంటాం. ఇది అదే పద్ధతి. ఉదాహరణకు ఒకరి ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలంటే మొత్తం పది digits గుర్తుపెట్టుకోవడం వాక్యపాఠం పద్ధతి. దాన్నే రెండు రెండు digits గా గుర్తు పెట్టుకోవడం వల్ల తప్పు జరిగే అవకాశం తక్కువ. లేదా మూడు మూడు digits గుర్తు పెట్టుకుంటే తప్పు జరిగే అవకాశం మరింత తక్కువ.

ఈ పై రెండు పద్ధతులు ప్రాకృతిక పద్ధతులు. వాటి natural order లో చదువుతాము.
అలా కాక natural order ని చేదించి artificial order లో వెళ్తే ఎర్రర్ కరెక్షన్ కి మరింత అవకాశం వుంటుంది. వీటిలో మూడు ముఖ్యమైన పద్ధతులను చూడండి.

క్రమ పాఠం: A,B; B,C; C,D; D,E – ఇది ఒక పాయింటర్ పద్ధతి ప్రకారం చైన్ కనెక్షన్ లా మొత్తం encrypt + single redundancy మెథడ్. నేటి కాలంలో మనం విరివిగా చూస్తున్న చైన్ బేస్డ్ మెమరీ టెక్నిక్ ఇదే. చూడండి నేడు కొంతమందికి వండర్ మెమరీ అని పేరు చెప్పి ఎంత పెద్ద సీక్వెన్స్ అయినా గుర్తు పెట్టుకునేలా నేర్పుతున్నారు. మధ్యనుండి అడిగినా మరల మొత్తం సీక్వెన్స్ reconstruct చెయ్యవచ్చు. A  B  C D E …చూసారా ఇంజనీరింగ్ చదివిన వారు ఇతి యిట్టె పట్టేస్తారు పాయింటర్ లాజిక్. ఇది మనం నేడు చదువుకుంటున్నాం. కానీ ఈ పద్ధతి మనం వాడుకలో ఎప్పటి నుండి వాడుతున్నామో చూడండి.

జట పాఠం: A –B – B – A – A – B; B –C – C- B – B –C; C – D – D- C- C – D; (A-B) ఒక సెట్ అయితే దాని మిర్రర్ ఇమేజ్ (B – A ) మరల (A – B ). దీన్ని redundancy, అలాగే క్రిప్టోగ్రఫీ కలగలిపిన పద్ధతి. ఇప్పుడు ఈ రకంగా డేటా పంపితే దీనినుండి మూలకమైన (A, B) ఏ రకంగాను డేటా లాస్ కి లోను కాక మొత్తం decrypt చెయ్యగలం. నేటి redundant codes, ఎన్క్రిప్షన్ methods మన జటపాఠం లో ఎలా నిబిడీకృతమై ఉన్నదో ఒకసారి చూడండి.

ఘనపాఠం: A – B – B-A – A-B-C - C-B-A- A-B-C; B-C- C-B- B-C-D – D-C-B – B-C-D; ఇదొక అడ్వాన్స్డ్ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా డేటా మరింత బలంగా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. అలాగే ఇటువంటి పద్ధతిలో డేటా లాస్ అనేది చాలా చాలా తక్కువ.

ఋగ్వేదం మొత్తం ఘనంలా పఠించాలంటే ఏకంగా 450 గంటలు పడుతుందిట. అంత వారు నేర్చుకుని అలా పఠించగలిగే సాధన వారికి కనీసం 25 సంవత్సరాల అభ్యాసం మీద వస్తుంది. ఇటువంటి ఘనమైన చరిత్ర, పద్ధతి మనది. తలచుకుంటేనే మన ఒళ్ళు గుగుర్పాటుకు గురవ్వక మానదు. ఇటువంటి గొప్ప పద్ధతులు పేటెంట్ అయి లేవు. వేదం జ్ఞానం అందరికీ అందాలని చెప్పింది తప్ప .....

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top