భారతీయ ఆయుర్వేద జీవన విధానమే సంక్రమణ వ్యాధులకు అడ్డుకట్ట - Bharatiya Jevana Vidhaname Sri Raama Raksha

 ఆయుర్వేద భారతీయ జీవన విధానమే సంక్రమణ వ్యాధులకు అడ్డుకట్ట - Bharatiya Jevana Vidhaname Sri Raama Raksha
ప్పుడప్పుడు వచ్చే జనపదోధ్వంసం అంటారు ఇది అలాంటిదే. జనపదోధ్వంసం అంట చాలామందికి ఒకేసారి ఒకే విధమైన వ్యాధిలక్షణాలు సంక్రమించడం వల్ల వచ్చే విపత్తు దీనివల్ల ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతారు. ప్రాణనష్టం కూడా జరగవచ్చు. ఇవి వంద రెండువందల సంవత్సరాలకు ఒకసారి రకరకాలుగా వస్తుంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్లో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పూర్వం మహర్షులు దీన్ని అధర్మం అన్నారు ప్రపంచంలో అధర్మ కార్యాలు ఎక్కువైతే ఇలాంటివి సంభవిస్తాయి. అధర్మం అంటే వ్యక్తిగతమైంది కాదు. సామాజిక తప్పులుగా పరిగణించాలి. ప్రకృతికి వ్యతిరేకంగా పంచభూతాల దుర్వినియోగానికి పాల్పడడం మంచిది కాదనే సందేశం ఈ వైరస్ మనకు ఇస్తున్న సందేశం.

    ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతమైంది, దీన్ని మన పూర్వికులు మన నిత్యజీవన శైలిగా మార్చారు. ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్ధాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటి వన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. మనిషి తన ఆహార అలవాట్లతో ఆయుష్షును పెంచవచ్చు. హరించనూవచ్చు ఆహార అలవాట్లు, ఆచరణ విధానాలే జీవితకాలాన్ని నిర్ణయించే కొలమానాలువుతున్నాయని ఆయుర్వేదం చెబుతోంది.

   వ్యక్తిగత శుభ్రత, సామాజిక స్వచ్చత ఈ సమయంలో అత్యవసరం. ఏం చేస్తే ఆరోగ్యం చెడుతుందో, ఏం చేస్తే బాగుపడుతుందో తెలిస్తే దానికి తగ్గట్టుగా జాగ్రత్తపడడానికి వీలవుతుంది. ముందు జాగ్రత్తలు లేకపోవడం వల్ల అత్యధికంగా ప్రజలు రోగాల పాలవుతున్నారు.

ఆయుర్వేదం 'ఆచార రసాయనం' గురించి చెబుతోంది. ఇది ప్రవర్తనను శాసిస్తోంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి వ్యక్తిగత దినచర్య, రుతుచర్యను సక్రమపద్ధతిలో నిర్వహించు కోవాలి. ఫలితంగా మనిషి రోగాల బారీనవడరు. దీన్నే స్వన్దవృత్తం శరీరంలో అంటారు. మొదటి నుండి జీవన చర్యను క్రమ వద్దతిలో నిర్వహించు కొంటున్న వారు వ్యాధి తీవ్రతను తట్టుకోగలరు.  శారీరకంగా దుర్భలంగా ఉన్న ఆ వారికి వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలమంది వాట్సాఫ్, ఫేసుబుక్ లకు అలవాటుపడి ఫోన్ల కు అతుక్కుపోతున్నారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించడం మూలంగా మనిషి శారీరకంగా బలహీనులవు తున్నట్లు అధ్యయనలు వెల్లడిస్తున్నాయి. కనుక వీటికి దూరంగా ఉండడం అన్ని విధాల మేలు చేస్తోంది.
మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై ఆయుర్వేద అవగాహనను చూపించే నేపాల్ మరియు సంస్కృత గ్రంథాలతో నిలబడి ఉన్న వ్యక్తి యొక్క "ఆయుర్వేద మనిషి" శరీర నిర్మాణ
మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై ఆయుర్వేద అవగాహనను చూపించే నేపాల్ మరియు సంస్కృత గ్రంథాలతో నిలబడి ఉన్న వ్యక్తి యొక్క "ఆయుర్వేద మనిషి" శరీర నిర్మాణ
ఆచార ఆరోగ్య ముఖ్య సూచనలు:
 • ☀ కరోనా లాంటి వ్యాధులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది భోజనం ఇతర ఆహారపదార్థాలు తీసుకునే ముందు పరిశుభ్రత పాటించాలి. 
 • ☀ సమయానికి నిద్రపోవాలి నగరాల్లో పట్టణాల్లో అర్ధరాత్రి వరకు మేల్కొని ఉదయం త్వరగా లేవకుండా పడుకుంటున్నారు. 
 • ☀ ఈ అలవాట్లు మనిషి జీవనశైలిపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. 
 • ☀ సూర్యోదయం కంటే గంట ముందే మేల్కోవడం అన్ని విధాల మంచిది, అలాగే శరీరానికి సూర్యరశ్మీ తాకాలి, ఆయుర్వేదం తకలి అయితే గానీ భుజించరాదనిటుతోంది. 
 • ☀ సాత్వికంగా పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలి. 
 • ☀ మితంగా స్వీకరించే అహారం ఎంతో హితకారిని అవుతోంది. 
 • ☀ ఆరోగ్యం పొందడానికి ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. 
 • ☀ వ్యాయామాల వలన ఉఛ్వాసనిశ్వాసాలు  మెరుగుపడుతాయి, తద్వారా ఊపిరితిత్తులకు నక్రమంగా ప్రాణవాయువు చేరుతోంది.
 • ☀ ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఒత్తిడి లేకుండా ఉండాలి, కాబట్టి సరైన నిద్ర, వ్యాయామాలు ఆహారపు అలవాట్లు పాటిస్తే అనారోగ్యం దరికి చేరకుండా ఉంటుంది. 
 • ☀ మొలకెత్తిన తృణధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి, వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్ ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి.
 • ☀ మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతోపాటు లవణాలు విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి, పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు.
   మూలకారణం తెలిస్తే వ్యాధి నగం నయమైనట్టే, వ్యాధినిరోధకశక్తి పెంచడంతో కొంత, జీవనశైలి మార్పులతో ఇంకొంత నియంత్రిత చికిత్సతో మరికొంత, ఇలా ఆయుర్వేద చికిత్స ద్వారా ప్రాణాంతక వ్యాధులను సైతం తరిమికొట్టవచ్చు అయితే ఆయుర్వేదంలో శరీరతత్వాన్ని బట్టి ఔషదాలు ఉంటాయి.

నలుగురిలో ఒకేరకమైన వ్యాధి ఉన్నప్పటికీ అందరికి ఒకేరకమైన మందులను సూచించరు. పూర్వకాలంలో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు. వీటి బారిన పడినవారికి వేపాకు, పసుపు సర్వరోగ నివారిణిగా పని చేస్తోంది. ఎందుకంటే ఇవి రోగాన్ని త్వరగా నిర్మూలిస్తాయి. వేపాకుచూర్ణం అందరికి సరిపడకపోవచ్చు. కానీ పసుపును విరివిగా వాడవచ్చు. అట్లాగే తులసి మొక్కలు కూడా ప్రాణవాయువుని అందిస్తాయి. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆవుపేడతో తయారు చేసిన దూపం, సాంభ్రాణి పోగ వలన సూక్ష్మజీవులు నశిస్తాయి. యజ్ఞాలు, యాగాల వల్ల కాలుష్యం నివారణ జరుగుతోంది.

ఆధునిక వైద్యంలో లేని అనేక వ్యాధి నివారణ ఔషదాలు ఆయుర్వేదంలో ఉన్నాయి, అయితే రోగిని పరీక్షించిన తర్వాతే మందులు సూచించాలన్నది ఆయుర్వేద నియమం. నేడు వివరీతమైన జీవనశైలి, ప్రకృతి విద్వంసం కారణంగా అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి ఆధునిక వైద్యులు మందులు సూచించ లేని పరిస్థితి నెలకొని ఉంది. అయితే అదృష్టం కొద్ది భారతీయులు అవలంభించే విధానాలే అందరికి మార్గదర్శనం అవుతున్నాయి.
నిన్నటి వరకు మనవి మూఢనమ్మకాలని కొట్టిపారేశారు కానీ అవే వాన్తవాలని మానవ జీవన విధానానికి మూలకారకాలని గుర్తిస్తున్నారు భవిష్యత్తులో కరోనా మహామ్మారి వలన అనేక మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెరుగుతుంది. తినే ఆహారంలో శాకాహారమే మేలు అని భావిస్తారు. 
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యోగ, సమస్కారం గొప్పతనం చూశారు. రాబోవు రోజుల్లో భారతీయుల అన్ని అంశాలను అవలంభిస్తారు. ఈ పరిణామాలు మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టేందుకు దోహదం చేస్తున్నాయని అనడంలో సందేహమే లేదు.

వ్యాసకర్త : డా. జి కృష్ణ ప్రసాద్ - ప్రముఖ అయుర్వేద వైద్యనిపుణులు
మూలము: జాగృతి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top