కరోనా వైరస్ లాక్ డౌన్ తో పరవశిస్తున్న ప్రకృతి - Carona Virus, Prakruthi

మానవాళిని నిర్భంధిస్తే ప్రకృతి పరవశిస్తుందా? మిగిలిన జీవరాశలకు స్వేచ్ఛ లభిస్తుందా? పవిత్ర నదుల నీళ్లు పరిశుభ్రమవుతాయా? ఇవన్నీ నిజమే కరోనా వైరస్ తెచ్చిపెట్టిన లాక్ డౌన్  కొన్ని కొత్త అనుభవాలను ప్రపంచానికి పంచుతోంది. అందులో ప్రకృతి పరవశిస్తున్న సంగతి కూడా ఒకటి.

భారత్ లో మార్చి 24, 2020న లాక్ డౌన్ఆ రంభమైంది. దాదాపు ప్రపంచ మానవు లందరూ లాక్ డౌన్ ను అనివార్యంగా పాటిస్తున్నారు. ఇందులో వేలాది ఇబ్బందులు ఉన్నాయి. విషాదమూ ఉంది. కానీ దీనితో ప్రత్యక్షంగా కరోనాను కట్టడి చేయడమనే ధ్యేయంతో పాటు, మనకు తెలియకుండానే పరోక్షంగా పర్యావరణాన్ని కూడా రక్షించు కుంటున్నాం.

ఈ మాట కొందరికి వేరే విధంగా అర్థం కావచ్చు. అలాంటి వారికి చెప్పేదొకటే పర్యావరణం నాశనమైతే, ఆ దుస్థితి నాలుగు కరోనా వైరస్లతో సమానం. ఒక్క కరోనా వైరస్ తోనే ఇంత అతలాకుతలం అవుతూ ఉంటే, నాలుగు వైరస్లు వస్తే ఇంకేం మిగులు తుంది? ఈ సమయంలో అనుకోకుండా జరుగుతున్న పర్యావరణ పరిరక్షణను ఆ కోణం నుంచి స్వాగతించాలి. ఇందుకు సంబంధించి కొంత అవలోకించినా విషయం అర్థమవుతుంది.
 • ⧫ ముప్పయ్యేళ్ల క్రితం కాలుష్యం తెర వెనక్కి పోయిన హిమాలయాలు బయటపడ్డాయి. 
 • ⧫ గంగాజలం నిర్మలంగా మారింది.
 • ⧫ గాలి తేలికైంది. 
 • ⧫ మనుషులకు చాలా అరుదుగా కనిపించే పునుగుపిల్లి ఒకటి కేరళ రాష్ట్రంలోని పట్టణంలో
 • ⧫ ఎలాంటి భయం లేకుండా నడిరోడ్డు మీద వెళ్లడం పెద్ద వింత. 
 • ⧫ న్యూయార్క్ నగరంలో పెద్ద పెద్ద బాతులు కుట సమేతంగా వెళ్లడం కూడా అందరినీ ఆశ్చర్య పరిచింది.
 • ⧫ ఇక కొత్త కొత్త పక్షుల పెపిలి దర్శనం, దర్శనం కాక పోయినా వాటి అరుపులు. చెవిన పడడం పలు చోట్ల ప్రజల అనుభవంలోనిదే.
హిమాలయ పర్వత సానువులలో భాగమైన దౌల్ధర్ పర్వతాలు
హిమాలయ పర్వత సానువులలో భాగమైన దౌల్ధర్ పర్వతాలు
పంజాబ్ ప్రజల అనుభవం వారిని విభ్రాంతికి గురి చేసింది. ఆ రాష్ట్రంలోని జలంధర్ పట్టణానికి అవి నూట యాభయ్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటి మీద కాలుష్యపు తెరపడి మూడు దశాబ్దాలు గడిచింది. అప్పటి నుంచి అవి వారికి కనిపించడం లేదు అలాంటిది లాక్ డౌన్ ప్రకటించిన పది రోజుల తరువాత ఓ వేకువన చూసిన జలంధర్ వాసులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. (అవే హిమాలయ పర్వత సానువులలో భాగమైన దౌల్ధర్ పర్వతాలు). లాక్ డౌన్ ప్రకటించిన తరువాత గాలిలో కాలుష్యం శాతం అసాధారణంగా పడిపోయింది. దాని ఫలితంగానే ఆ పర్వతాలను తమ పట్టణం నుంచి వీక్షించగలి గారు జలంధర్ వాసులు.
పునుగుపిల్లి
పునుగుపిల్లి 
ఇప్పుడు ద్విచక్ర వాహనాలు, కార్లు బస్సులు మాత్రమే కాదు, లోహ విహంగాలు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఢిల్లీలో పీఎం 10 (పీఎం- పార్టీక్యులేట్ మీటర్ వాయు కాలుష్యాన్ని కొలవడానికి తీసుకునే పరిమాణం) గాలి కాలుష్యంలో 44 శాతం తగ్గిపోయింది. మన కాలుష్య నియంత్రణ మండలి ఈ విషయం వెల్లడించింది. లాక్ డౌన్  ఆరంభమైన తొలివారంలోనే భారత్ లోని 85 నగరాలలో గాలిలో కాలుష్యం బాగా తగ్గిపోవడం మొదలైంది. కాలుష్యం విషయంలో జలంధర్ ప్రస్తుతం గుడ్ స్థాయిని పొందింది. ప్రపంచంలో 30 ఘోరమైన కాలుష్య బాధిత పట్టణ ప్రాంతాలు ఉంటే, 21 మన దగ్గరే ఉన్నాయి.

మెరుగైన గంగానది:
 • ⧫ గంగానది ఆరోగ్యం కూడా లాక్ డౌన్ కారణంగా మెరుగుపడింది. జీవనది పరమ పవిత్రం అని చెబుతూనే ఆధునిక కాలంలో భారతీయులు ఈ గొప్ప నదిని దారుణంగా కలుషితం చేసేశారు.
 • ⧫ పరిశ్రమల వ్యర్థాలను, కాలుష్యాన్ని మళ్లించి ఈ నదికి అంత దుస్థితి కలిగించారు. ఇప్పుడు మాత్రం స్నానానికి అనువుగా ఆ నదీజలం ప్రక్షాళన అయింది.
 • ⧫ ప్రస్తుతం ఈ నది నీరు స్నానానికి అనుకూలంగా 27 పాయింట్లు మెరుగైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది. 
 • ⧫ ఇంతకు ముందు ఉత్తరాఖండ్ లో మినహా ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించి, మళ్లీ పశ్చిమ బెంగాల్లో సముద్రంలో సంఘమించే వరకు ఉన్న ఈ మొత్తం పరీవాహక ప్రాంతమంతా కలుషితమైందని తేల్చారు. పరిశ్రమల నుంచి కాలుష్యం ఎక్కువగా వచ్చి చేరే కాన్పూర్ పంటి ప్రాంతాలలోనే కనిపిస్తున్నదని మరొక పర్యావరణవేత్త విక్రాంత్ తుంగాడ్ అన్నారు.
 • ⧫ లాక్ డౌన్ కారణంగా గంగతో పాటు ఉపనదులు హిందున్, యమునలలో కూడా నీరు మెరుగు పడింది. రసాయనాలతో వచ్చే కాలుష్యాన్ని కూడా గంగ జీర్ణించుకుంటున్నది కానీ పారిశ్రామిక కాలుష్యాన్ని మాత్రం భరించలేకపోతున్నది.
      నిజమే, లాక్ డౌన్ ఒక వినాశనాన్ని తప్పించడానికి విధించుకున్న స్వచ్చంద నిర్భంధం. కొన్ని విషాదాలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా వేలాది మంది వలస కూలీలు నిరాశ్రయులయ్యారు. కొన్ని లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఉపాధి అవకాశాలు మళ్లీ ఒక కొలిక్కి రావాలంటే కనీనం ఒక సంవత్సరమైనా పడుతుంది. పస్తుతం కర్మాగారాలు మూతపడినాయి. భవన నిర్మాణ పరిశ్రమ స్తంభించింది. రవాణా వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. ఒకశాతం వాహనాలు కూడా రోడ్ల మీద తిరగడం లేదు. ఇది ప్రకృతి కొత్త ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడిన మాట నిజం.

కాబట్టి లాక్ డౌన్ నేర్చిన పాఠాలలో, అనుభవాలలో ఈ గొప్ప పరిణామానికి అగ్రస్థానమే ఉంటుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ గంగాజలాన్ని నిర్మలం చేయలేకపోయాం. కానీ పదిరోజుల లాక్ డౌన్ ఆ పని చేసింది. లాక్ డౌన్ తెచ్చిన బాధలకు విచారపడదాం. అది ప్రకృతి కలిగించిన మోదానికి సంతోష పడదాం.

రచన: జాగృతి వార పత్రిక

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top