శివశయన క్షేత్రం సురుటుపల్లి - Shayaninche Shivudu

శయనించే శివుడు - శివశయన క్షేత్రం సురుటుపల్లి

పరమశివుడి శయన మందిరంగా సురుటుపల్లి క్షేత్రం విరాజిల్లుతోంది. సకల శైవక్షేత్రాలలో లింగాకారం లో దర్శనమిచ్చే పరమశివుడు ఇక్కడ భారీ విగ్రహ రూపంలో పార్వతీదేవి ఒడిలో శయనించి పళ్ళికొండే శ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో శివ శక్తులతో పాటు సకల దేవతా గణాలు, సప్తరుషులు, గజపతి, సుబ్రమణ్యస్వామి విగ్రహాలు ఉన్నాయి.

తిరు పతి – చెన్నై జాతీయ రహదారిలోని నాగలాపురం మం డలం అరుణానది ఒడ్డున సురుటుపల్లి ఉంది. రాష్ట్రంతో పాటు తమిళనాడు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉం టోంది.
 పార్వతీదేవి శివుని కంఠాన్ని గట్టిగా నొక్కిపడుతున్న
 పార్వతీదేవి శివుని కంఠాన్ని గట్టిగా నొక్కిపడుతున్న
స్థలపురాణం:
అమృతాన్ని పొందడా నికి దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధనం చేస్తుండగా హాలాహలం వెలువడింది. దీంతో భీతిల్లిన దేవతలు, రాక్షసులు త్రినేత్రుని శరణు కోరగా శివుడు హాలాన్ని నేరుడు పండు రూపంలో తీసుకొని మింగేందు కు ఉపక్రమిస్తుండగా హాలాహలం వల్ల అపాయం కలు గుతుందని భావించిన పార్వతీదేవి కంఠాన్ని గట్టిగా నొక్కిపట్టడంతో హాలాహలం కంఠం వద్దనే నిలిచిపోయింది. దీంతో కంఠం నీలంగా మారుతుంది. అందువల్లే శివునికి నీల కంఠుడని పేరు వచ్చింది.
ఈశ్వరుడు పార్వతీదేవి ఒడిలో విశ్రమిస్తాడు
ఈశ్వరుడు పార్వతీదేవి ఒడిలో విశ్రమిస్తాడు
అనంతరం పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రకృతి సౌందర్యాలతో అలరాలే ప్రదేశంలో కొద్దిసేపు సేదతీరుతారు. హాలాహలం తాగిన మైకం కారణంగా ఈశ్వరుడు పార్వతీదేవి ఒడిలో విశ్రమిస్తాడు. అలా సేదతీరిన ప్రదేశమే సురుటుపల్లి.

నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న సకల సురగణం ఈశ్వర దర్శనానికి ఇక్కడికి రావ డంతో సురులపల్లి అనే పేరున్న ఈ ప్రాంతానికి కాలక్రమేణ న సురుటుపల్లి అని పేరు వచ్చింది. భూలోకంలో నీకు విగ్రహారాధనే ఉండదన్న భృగుమహర్షి శాప విముక్తి అనంతరం త్రినేత్రుడు పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్లు విగ్రహరూరంలో భక్తులకు దర్శనమిస్తున్నట్లు ప్రతీతి. రావణ సంహార అనంతరం బ్రహ్మ హత్యాపాతక నివారణకు శ్రీరాముడు శ్రీ క్షేత్రంలో లింగప్రతిష్ట చేశాడు. శ్రీరాముడితోపాటు వచ్చిన లవకుశల పాదముద్రలు ఈ ఆలయంలో కనబడతాయి.

వాల్మికి తపస్సుకు మెచ్చి అను గ్రహించిన స్వయంబువు శివలింగం, శ్రీవాల్మీకేశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. పార్వతీదేవి నందీశ్వరునిపై గల దక్షిణా మూర్తిని ఎడమవైపు నుంచి ఆలింగనం చేసుకుంటున్న రోజును కృష్ణపక్ష త్రయోదశి స్థిరవారం(శనివారం) రోజున మహా ప్రదోషంగా శివాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. మహా ప్రదోషకాల పూజా సమయంలో ముక్కోటి దేవలు పళ్ళికొండేశ్వర స్వామి ఆలయానికి వస్తారని స్థలపురాణం పేర్కొంటున్నది.

క్షేత్రానికి చేరుకునే మార్గము:
చిత్తూరు జిల్లాలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలోని ఈ సురుటుపల్లి ఆలయానికి విచ్చేయాలంటే బస్సు రూటు ఉంది. తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా వస్తూ నారాయణవనం వైపుగా వెళుతున్న చెన్నై జాతీయ రహదారిలో వెళితే సుమారు 80 కిలో మీటర్ల దూరంలో నాగలాపురం (మండలం) సమీపంలో గల సురుటుపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. తిరుపతి నుంచి సత్యవేడు డిపో బస్సులు, తిరుమల డిపో చెనై్న బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి.

ప్రదోష పూజలు:
నాగలాపురం మండలం సమీపంలో గల సురు టుపల్లి గ్రామంలో వెలసియున్న శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆల యంలో నెలకు రెండు సార్లు ప్రదో ష పూజలు వస్తుంటాయి. అయితే సంవత్సరంలో 1,2 సార్లు శని వారం వచ్చే శనిత్రయోదశి ప్రదోష పూజలు ఆలయంలో విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం దాంపత్య దక్షిణామూర్తికి అభిషేకం నిర్వహించిన భక్తులకు సకల దోషా లు తొలగి అష్ట ఐశ్వర్యాలు చేకూ రును. ప్రదోష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సంతానంలేని వారికి సంతానం కలుగునని, వివాహం కానివారికి వివాహం జరుగునని, భార్యభర్తల మద్య కలహాల తొలగిపోవునని, భక్తులు కోరుకున్న కోర్కేలు తీరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం.

సురుటపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు
 • ✹ తమిళ భక్తుల విరాళాలలో సుమారు 40 లక్షల వ్యయంతో స్వామి, అమ్మవార్లకు వెండితొడుగులు ఏర్పాటైయాయి. 
 • ✹ ఆలయంలో 20 లక్షలతో ప్రదోష మండపాన్ని నిర్మించారు.
 • ✹ ప్రభుత్వం అందించిన టూరిజంకారిడార్‌ నిధుల్లో రూ.80 లక్షలతో భక్తుల వసతి గృహం ఏర్పాటు.
 • ✹ ఆలయంలో తాగునీటి ట్యాంక్‌, ఆలయ ప్రహరీ పనులు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి.
 • ✹ భక్తులకు ఆహ్లాదకర వాతావరణ నిమిత్తం ఆలయ ఆవరణలో పార్కును ఏర్పాటు చేస్తున్నారు.
 • ✹ భక్తుల నుంచి విరాళాలను సేకరిస్తున్న దాదాపు రూ.60 లక్షలతో ఆలయ పుష్కరిణి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.
మరెన్నో పనులు, సేవలు:
 • ⭄ అమ్మవారికి, స్వామివారికి భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో వజ్రకిరీటం
 • ⭄ 2012 మహాశివరాత్రి నాటికి నూతనంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ
 • ⭄ మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పది రోజలు పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో స్వామి వారిని 12 వాహనాల్లో ఊరేగింపు, ఘనంగా ఉత్సవ ఏర్పాట్లు
 • ⭄ ఇకపై ఆలయంలో గోపూజా కార్యక్రమ నిర్వహణ, అన్నదాన కార్యక్రమాలు
 • ⭄ శనిదోష నివారణ పూజలు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహాస్తి ఆలయంలో నిర్వహించే సర్ఫ దోష పూజల మాదిరి ఆలయంలో పూజలు ఆలయంలో కళ్యాణోత్సవం
 • ⭄ నవగ్రహహోమం, గణపతిహోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం తదితర పూజా కార్యక్రమాలు జరుగును స్వామి వారికి ఊంజల్‌ సేవ, అద్దాల మండపం
దేవ దానవులు క్షీర సాగర మథనం
దేవ దానవులు క్షీర సాగర మథనం
సురుటుపల్లి – ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా లో ఉన్న చిన్న గ్రామం. దేవ దానవులు క్షీర సాగర మథనం చేసే సమయం లో హాహాహలం పుట్టి లోకాలన్నీ దహించుకు పోతున్న భయంకరమైన సమయం లో లోకాలన్నీ వెళ్లి పరమేశ్వరుడిని రక్షణ కోసం వేడుకున్నాయి. లోకాల రక్షణ కోసం ఆ విషాన్ని తాను సేవించడానికి సిద్ధ పడ్డాడు ఆ బంగారు తండ్రి. బిడ్డల రక్షణ కోసం ఎంత విపత్తు ని అయినా ఎదిరించడానికి సిద్ధ పడే ఆ తండ్రి ని జగన్మాత అనుసరించింది. కాలకూట విషం ఎంత భయంకరమైనది అయినా తన మాంగల్యం మీద తనకి ఉన్న నమ్మకం తో భర్త కి తన అంగీకారం తెలిపింది అమ్మవారు.

మనసే అసలు సిసలు మాంగల్యం – ఆమె మనసంతా ఆయనే నిండి ఉండగా – సాక్షాత్తు పసుపు కుంకుమ ల స్వరూపమైన అమ్మ వారికి తన మాంగల్యం మీద అంత నమ్మకం ఉండటం లో ఆశ్చర్యం ఏమీ లేదు.

స్వామి వారు హాలాహలాన్ని పుచ్చుకున్న కొద్ది సేపటి వరకు మైకం కమ్మేసింది. అప్పుడు అమ్మవారు పరుగున వెళ్లి అయ్య వారి తలని తన ఒడి లోకి తీసుకుని విశ్రాంతి గా శయనింప జేసింది. విషం స్వామి గొంతు దాటి కడుపు లోకి వెళ్తే అక్కడ ఉన్న లోకాలు దహించుకు పోతాయని గ్రహించి స్వామి వారి కంఠం దగ్గర చిన్న గా నొక్కి ఆ హాలాహలం అక్కడే ఉండి పోయేలా ఆపింది. స్వామి తేరుకుని అన్ని లోకాలు హాలాహలం నుంచి రక్షించ బడ్డాయని గ్రహించి నటరాజు గా అక్కడ ఆనంద తాండవం చేశారు. ఇంత అపురూపమైన ఘట్టానికి వేదిక సురుటుపల్లి.

తండ్రి శ్రీ రాముని మీద యుద్ధం చేసిన దోషం పోగొట్టు కోవడానికి లవ కుశులు ఇక్కడి పల్లి కొండీ శ్వర స్వామిని సేవించారు. వాల్మీకి మహా కవి రామాయణ రచన ప్రారంభించ బోయే ముందు ఈ స్వామి ని సేవించారు. స్వామి ని, అమ్మవారిని దర్శించుకునేందుకు ఆ నాడు అందరు దేవతలు భూమి మీద అడుగిడిన దివ్య స్థలం సురుటుపల్లి. అమ్మ సర్వ మంగళ ఒడిలో స్వామి శయనించి ఉండే ఏకైక మూల విరాట్టు సురుటుపల్లి లోనే ఉంది.

నిజానికి అమ్మ పార్వతి దగ్గర భక్తుడు చేసే ముదిగారం కన్నా, తండ్రి పరమ శివుడి పాదాల దగ్గర భక్తుడికి దొరికే కనికరం కన్నా ఈ అమృతం అంత ఘనమైనది ఏమీ కాదు. ఈ విషయాన్ని ఆ నాడు అందరు జ్ఞానులు ఎందుకు గమనించలేకపోయారు ? బహుశా ఈ రూపం లో పరమేశ్వర తత్వాన్ని, జగన్మాత మంగళ కరమైన స్వరూపాన్నిలోకానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారేమో !

స్వామి దయకి, అమ్మవారి ఆత్మ విశ్వాసానికి, ఆది దంపతుల అనురాగ పూరిత బంధానికి వేదిక గా నిలిచిన సురుటుపల్లి -సఖ్యత లేని దంపతుల ని, అనుకూలత లేని దాంపత్యాన్ని సరిదిద్ది – దర్శించిన దంపతులకి జన్మ జన్మ ల పాటు నిలిచే అన్యోన్యత ని ప్రసాదించే అపురూప క్షేత్రం. మైకం తో అలసి ఉన్న స్వామి అమ్మ వారి ఒడి లో పడుకుని ఉండగా, అమ్మవారి మంగళ సూత్రపు మంగళ కరమైన గల గలలు స్వామి కి అలసట తీర్చిన ఆ పుణ్య భూమి – భార్య భర్త ల అన్యోన్య అనురాగానికి, ఆదర్శ దాంపత్యానికి నిలువుటద్దం.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top