యోగి ప్ర‌హ్లాద్ జాని - Yogi Prahlad Janiగాంధీన‌గ‌ర్, గుజరాత్ ‌: 70 ఏళ్లుగా అన్న‌పానీయాలు ముట్టుకోని యోగి ప్ర‌హ్లాద్ జాని(90) 26 మే మంగ‌ళ‌వారం 2020 ఉద‌యం తుది శ్వాస విడిచారు.

ప్రహ్లాద్ జానీ 1929 ఆగస్టు 13 న గుజ‌రాత్‌లోని చ‌రడా గ్రామంలో జ‌న్మించారు. ఈ యోగిని అత‌ని భక్తులు ప్రేమ‌గా "చునిర్వాలా మాతాజీ" అని పిలుస్తారు. గుజ‌రాత్‌లో ఇత‌ని పేరు తెలియ‌ని వారు ఉండ‌ర‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. 1940 నుండి ఎటువంటి ఆహారము, నీరు లేకుండా 70 ఏళ్లు జీవించ‌డంతో అత‌నిపై ఎంతోమంది శాస్త్రవేత్త‌లు అధ్య‌య‌నం చేశారు. అందులో మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లామ్ కూడా ఒక‌రు. ఏమీ తిన‌కుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అస‌లు కారణాన్ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయారు. 2010లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఒక గ‌దిలో ఉంచి వీడియో మానిట‌రింగ్ నిర్వ‌హించారు. అనంత‌రం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, త‌దిత‌ర వైద్య ప‌రీక్ష‌లు జరిపారు. ఈ ఫ‌లితాల్లో ఆయ‌న‌కు అసాధార‌ణ రీతిలో ఆక‌లి, దాహాన్ని త‌ట్టుకునే ల‌క్ష‌ణాలున్నాయ‌ని వెల్ల‌డైంది.
  • ➣ 2003 లో స్టెర్లింగ్ హాస్పిటల్స్, అహ్మదాబాద్ లో 30 మంది డాక్టర్స్(Sudhir Shah & Others) ఈ యోగి ని ఒక రూమ్ లో ఉంచి 15 రోజుల పాటు పరీక్షలు జరిపారు.
  • ➣ రోజు ఉదయాన్నే 100ml నీరు మాత్రం పుక్కిలించుకోవటానికి ఇచ్చేవారు. CCTV cameras అమర్చారు. 15 రోజుల తర్వాత అతని ఆరోగ్యం లో ఎటువంటి మార్పు లేదు.
  • ➣ అయితే ధ్యాన‌మే త‌న‌ను బ‌తికిస్తోంద‌ని యోగి గ‌తంలోనే స‌మాధాన‌మిచ్చారు. కాగా ఆయ‌న ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన వారిలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.
  • ➣ ఇట్టి గొప్ప యోగులు పుట్టిన గడ్డ నా భరతభూమి. ఈ గడ్డపై ఇలాంటి యోగిపుంగవులు ఎందరో!నా జాతి నీ పునీతం చేశారు.
  • ➣ కానీ ఇదెలా సాధ్యమో తెలియక మతులు పోగొట్టుకొంటున్నారు. దుర్గామాత ఆరాధన వలన ఈ శక్తి తనకు వచ్చిందని ప్రహ్లాద్ జని గారు చెబుతారు. —

జైప్రహ్లాద్ జానీ! - జై హింద్! - భారత మాతకీ జై.

సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top