నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label సాధువు. Show all posts
Showing posts with label సాధువు. Show all posts

Monday, July 20, 2020

హిందూత్వ సైన్యము "నాగసాధు - అఖాడాలను - Nagasadhu, Akhadalu



హిందూత్వానికి సైన్యముగా "నాగసాధు - అఖాడాలను" ఏర్పాటు చేసిన శాశ్వత హిందూ ధర్మ పరిరక్షకులు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు.

- పలికినవాడు మునిపల్లె జ్యోతిస్వరూప్ పలికించినవాడు పరమేశ్వరుడు.

ప్రపంచములో చాలా మందికి నాగసాధువులు అఖాడాలు అనేవారు ఉంటారనేది తెలిసినా అసలు వాళ్ళు ఎందుకు ఉంటారు. అలా ఎందుకుంటారు, దేనికోసం వాళ్ళు శూలం, కత్తి, గద, వంటి ఆయుధాలు ధరించి ఉంటారనే ప్రాధమిక విషయాలే చాలా మందికి తెలియని విషయమైతే, అసలు వారిని హిందూ ధర్మానికి సైనిక వ్యవస్ధగా జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారనేది 90 శాతం హిందువులకే తెలియని విషయం.
  • అసలు ముందుగా వారెవరు, వారి జీవన విధానం ఏమిటి, ఎందుకు ఉత్తరభారతములోనే ఉంటారు? 
  • ఎందుకు మనుష్యులలోకి రారు, ఎందుకు కుంభమేళాలోనే వస్తారు? 
  • ఎందుకు వారికి సైన్యముకి ఉండే విధముగా ఆయుధాలు ఉంటాయి? 
  • ఇవన్నీచాలా మందికి సమాధానములు తెలియని ప్రశ్నలు. 
ముందుగా అసలు నాగసాధువులు అంటే ఏమిటి అఖాడాలు అంటే ఏమిటో చూద్దాము.
నాగ సాధువులను వివిధ అఖాడాలుగా ఒకే కాషాయ జెండా కిందకు వచ్చే సైన్యముగా ఏర్పరిచినది సాక్షాత్ శివావతారులైన ఆదిశంకరాచార్యుల వారే. నాగ అనగా హిమాలయాలలో కొండలలో నివసించే వారు అని అర్ధము. వారంతా అలా నాగసాధువులుగా ఏర్పడడానికి కఠోరమైన శారీరక శ్రమతో కూడిన సైనిక శిక్షణతో పాటు జ్ఞానమును వైరాగ్యమును కూడా అలవర్చుకున్నవారు. పరిపూర్ణమైన శారీరక మానసిక ధృడత్వం పొందిన వారే నాగ సాధువులు అవగలరు.

నాగసాధువులు పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ శంకరాచార్యుల వారు శివావతారులుగా గ్రహించగలిగి వారిచే ప్రేరణపొంది హిందూత్వ సైన్యముగా ఈ నాగసాధువులంతా హిందూత్వ ధర్మరక్షణకు కట్టుబడినవారు. తమకు తామే పిండప్రదానం చేసేసుకుని జీవన్ముక్తులుగా భావించగలిగే వైరాగ్య సంపన్నులు, శంకరాచార్యుల వారి సూచన మేర ఆయుధములని వినియోగించగలిగే యుద్ధ శిక్షణ కూడా పొందే వారు. రోజుకి ఒకసారి మాత్రమే తింటూ నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉంటూ మంత్రసాధనతో తపస్సు చేసుకుంటారు. వారు ఇంద్రియ నిగ్రహం పొంది కట్టుకునే బట్టలను లెక్క చేయకుండా తలకు జటలనూ మరియు రుద్రాక్ష ధారణ చేయువారు. ఏకాంతముగా ఉత్తరభారత పర్వతాలలో నివసిస్తూనే ఈ దేశానికీ హిందువుల సంరక్షణకి మరియు ధర్మ రక్షణకి ఆది శంకరాచార్యుల వారి ప్రేరణచే పూర్తిగా కట్టుబడి ఉన్నవారు.

ఆదిశంకరాచార్యుల వారు ఈ నాగసాధువులు సైన్యముగా విడివిడిగా ఎవరికీదారే అన్నట్టుగా ఉండకుండా అఖాడా వ్యవస్ధ ఏర్పాటు చేశారు. అఖాడా అంటే యుద్ధ శిక్షణా శిబిరము లేదా సమూహం, ఒక్కొక్క అఖాడాకు ఒక నాయకుడు ఉంటారు, ఆ అఖాడాలలో ప్రతినాగసాధువూ యుద్ధశిక్షణనే కాక వైరాగ్యమును కూడా అలవర్చుకుంటారు.

అఖాడాలంతా ఆది శంకరాచార్యుల వారిచే వారి కాలములోనే నియమించబడిన హిందూత్వ సైన్యం. హిందూత్వ ధర్మరక్షణ అంటే కేవలం ధర్మ భోధతోనే కాదు, హిందూత్వానికి ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఎవరైనా సైన్యముతో శత్రువులుగా వస్తే హిందూ ధర్మమును మన క్షేత్రాలను కాపాడడానికి సైన్యము ఆవశ్యకమని తెలిసి దూరదృష్టితో ఆ కాలంలోనే ఆది శంకరాచార్యుల వారు హిందూత్వానికి సైన్యముగా నాగసాధువులను ఒకటి చేసి వాళ్ళని ఆయుధములను ఉపయోగించే విధముగా యుద్ధ శిక్షణ ప్రక్రియను మార్గదర్శనం చేసి వారిని దశనామి సాంప్రదాయాల అనుసారంగా వివిధ అఖాడాలుగా ఏర్పాటు చేశారు. జనం సంచారంలోకి రాని వీళ్ళని లక్షలుగా వీళ్ళ ఉనికి ప్రపంచానికి తెలియడానికి వీరిని కుంభమేళాలో అందరినీ ఒకచోటికి చేరమని చెప్పి అలాగే శంకర పరంపరలోని ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారి మాటకు కట్టుబడి ఉండమని ఆది శంకరాచార్యుల వారు వారికి మార్గదర్శనం చేశారు.  ఈ విషయాలు అన్నీ కొన్ని పుస్తకాలలో లేక Blogలలో ఉన్నప్పటికీ హిందువుల ఐక్యత రుచించని వారు ఇంకా ఎన్నోవిషయాలు జనాలకు అందుబాటులోకి ఇవ్వరు. మనమే ప్రయత్న పూర్వకముగా తెలుసుకోవాలి, మునిపల్లె జ్యోతి స్వరూప్ అనబడే నేను ఉత్తరామ్నాయ శంకరాచార్య జద్గురువుల శిష్యులని అడిగి తెలుసుకున్న అనేక విషయాలలో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.

శంకరాచార్యుల వారిచే ఏర్పాటు చేయబడిన హిందూత్వ సైన్యమైన నాగసాధు, అఖాడాలు. హిందూత్వ ధర్మ యుద్ధం చేసిన సంధార్భాలు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి. క్రీశ 1664లో  ఔరంగజేబు కాశీ విశ్వనాధ మందిరం పై తన సైన్యముతో దండయాత్ర చేసినప్పుడు నాగసాధువులే వచ్చి అతడి అక్కడి సైన్యాన్నిసమూలంగా సంహరించారు. వారికి భయపడి ఔరంగజేబు కాశీ విశ్వనాధ మందిరం పై దాడిని కొన్ని ఏళ్ల పాటు ఆపేసుకున్నాడు.

ఈ చారిత్రక సత్యము The Illustrated Encyclopedia Of Hinduism అనే పుస్తకంలో పేర్కొనబడి ఉన్నది. తరువాత అక్బర్ కాలంలో కూడా అక్బర్ సైన్యము అమాయకులైన పూజారులను సాధువులనూ చంపడం తెలిసి అప్పటి ఉత్తరామ్నాయ శంకరాచార్య జగద్గురువుల సూచన మేర అద్వైత గురువులైన మధుసూధనానంద సరస్వతీ స్వామి వారు అక్బర్ సభకే వెళ్ళి ఈ హింసను ఆపమని కోరితే అక్బర్ నిరాకరించడంతో, స్వామి వారు నాగసాధువులకు కబురు పంపితే వారొచ్చి ఆ అక్బరు అక్కడి సైన్యాన్ని అంతా అతి క్రూరముగా ఖండఖండాలుగా నరికేశారు.

ఆ భయానికి అక్కడి ప్రాంతీయ ముస్లిములు కొన్ని తరాలపాటు వందలయేళ్లు హిందువుల జోలికి పోలేదనే చారిత్రక సత్యాన్ని Soldier Monks & Militant Sadhus అనే పుస్తకంలో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ మరియు షా జహాన్ సైన్యము కూడా హిందూ సాధువులు క్షేత్రాల జోలికి వచ్చి హిందూ సైన్యముతో సంహరింపబడ్డారని తెలుసుకోవచ్చు. నేడు 2020లో కూడా మహారాష్ట్రలో ఇద్దరు సాధువులని హిందూ ద్వేషులు హత్య చేస్తే నాగసాధువులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే పరిష్కరించమని లేకపోతే త్వరలో తామే వచ్చి పరిష్కరించవలసి వస్తుందని తమ మాటగా తెలుపడం దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు మొదలు పెట్టడమూ చూశాము. ఈ విధంగా శంకరాచార్యుల వారిచే ఏర్పాటు చేయబడిన హిందూత్వ సైన్యము హిందువులకి సైన్యం ఆవశ్యకమయినప్పుడు తప్పక వస్తారు.

శంకరాచార్యుల వారిచే పఠిష్ఠ సైన్యముగా వీరంతా ఉత్తరభారతంలో హిమాలయాలలో పర్వతాలలో ఉండేవారు కనుక వారు ఉత్తర ఆమ్నాయ పీఠ పరిధికి చెందుతారు. ఆది శంకరాచార్య స్వరూపులే తనచే స్థాపించబడిన నాలుగు ఆమ్నాయ పీఠాధిపత్య శంకరాచార్యుల వారని అందరూ గుర్తించాలని శివావతార ఆది శంకరాచార్యులవారే తెలిపారు. నేడు 12 నుంచి 14 అఖాడాలుగా ఉన్నాయి అందులో కొన్ని విష్ణు భక్తులుగా ఉంటారు, అయినప్పటికీ వారు కూడా ఆది శంకరులచే ఏర్పాటు చేసిన అఖాడా సైన్య వ్యవస్థలో ఒకరు కనుక వారితో పాటుగా అన్నీ అఖాడాలూ ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారికి ఆజ్ఞా బద్ధులు.
 కుంభమేళా
కుంభమేళా
కుంభమేళా:
కుంభమేళా మొదటి రోజున ఏమవుతుందో చాలామందికి తెలియదు, కుంభమేళా మొదలు అయ్యేది ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారి పూజతో, తరువాత కుంభమేళా స్నానాలు అవుతాయి. అప్పుడు అక్కడ నాగసాధువులు అఖాడాలు జగద్గురు శంకరాచార్యుల వారికి గౌరవ వందనం చేసి "మేము దేశం లోపలికి వచ్చి మా యుద్ధంతో చేయవలసిన పరిస్థితి ఏమైనా వచ్చినదా, అనుజ్ఞ ఇవ్వండి" అని అడుగుతారు.

ఒకవేళ వాళ్లే దేశంలోపలికి వచ్చి యుద్ధం మొదలు పెడితే హిందూత్వ శత్రువులు మిగలరు, అంత పరిస్థితి ఇంకా రాలేదు వచ్చినప్పుడు కబురు పంపిస్తాము అని సమాధానం ఇచ్చి పంపిస్తారు ఉత్తర ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారు. అఖాడాలు అనుజ్ఞని తీసుకుని గౌరవ వందనం చేసి మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పి వెళతారు.

వీళ్ళ భయం అప్పటి రాజులకే కాక ఇప్పటి రాజకీయ నాయకులకి కూడా ఎప్పుడూ ఉంటుంది కానీ పైకి బయటపెట్టుకోరు. అందుకే వాళ్ళ జోలికి పోరు. మన హిందువులలో చాలా మంది ఈరోజు మాటలు ఏమిటయ్యా అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర విలువ తెలుసుకోకుండా చేతిలో Facebook Twitterలాంటివి ఉన్నవి కదా అని ప్రతి చిన్నదానికి శంకరాచార్యుల వారి పరంపరనే మనకు ఏమిచ్చారు ఏమి చేశారు అంటూ నోటికి వచ్చిన మాటలు అనేస్తారు. "సెక్కులర్ రాజకీయ నాయకులు" ప్రణాళికాబద్ధంగా హిందూత్వ గురువులైన ఆది శంకరాచార్యుల వారి పరంపర నుంచి హిందువులని విభజించి పాలించే పద్ధతితో దూరం చేస్తూ వస్తున్నారు, హిందువులేమో చాలామంది వాళ్ళ ప్రణాళికకు అనుగుణంగా ఆదిశంకర పరంపరకు దూరం అవుతున్నారు.
సాధు సైన్యం
సాధు సైన్యం
హిందూ సైన్యం:
మరి హిందూత్వానికి సైన్యమే ఏర్పాటు చేసిన వారు కదా మరి చతురామ్నాయ శంకరాచార్య జగద్గురువులు నేడు మన దేశంలోని సమస్యలు అన్నీ పరిష్కరించలేరా అంటే తప్పక పరిష్కరించగలరు, కానీ దానికి శాసనాధికారం ఉండాలి కదా! అనాది కాలముగా పరిపాలించే వాడు శాసనాధికారి అయితే ఆ రాజుని కూడా శాసించేవాడు గురువు కదా.

ఎప్పుడో ఎందుకు శృంగేరి పరంపరలోనే వచ్చిన విద్యారణ్య స్వామి వారు పూనుకుని హరిహర రాయ బుక్కరాయలలను శాసనం చేసి అప్పటికే ఇస్లాం స్వీకరించిన వారిని తిరిగి హిందూత్వం స్వీకరింపజేసి వాళ్ళచే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపింపచేయలేదా! అదే జరిగి ఉండకపోతే అసలు నేడు మన పరిస్తితి ఏంటి? హిందువులు మిగిలి ఉండేవారా! పాలకులపై శాసనాధికారం గురువులకి ఉండాలి కదా అప్పుడే కదా వాళ్ళు ధర్మ రక్షణ చేయగలిగేది! మరి రాజ్యాంగ వ్యవస్థలో ఆ అవకాశం ఉన్నదా? లేదు కదా! హిందువులు అందరూ ఇప్పటికైనా విషయం గ్రహించి హిందూ సైన్యాన్ని ఆదేశించగలిగే శంకర పరంపరకు కట్టుబడి ఉండాలి. అనేక రాజకీయ కోణాలలో దూరం చేయబడిన హిందువులంతా ఏకమయ్యి నాలుగు ఆమ్నాయ జగద్గురువులకి మనమంతా దగ్గరయ్యి జగద్గురువులని ఆశ్రయిస్తే అప్పుడు రాజకీయ నాయకులంతా ఓట్లకైనా లేక దేనికైనా  హిందువుల కాళ్ళ బేరానికి వస్తారు.

కోర్టు - ప్రభుత్వాలు:
అసలు చతురామ్నాయ జగద్గురువుల నినాదమే గోహత్య నిషేధం మరియు ఇది హిందూత్వ దేశగా ప్రకటించడం కదా! ఇది చాలామంది హిందువులకే తెలీదు. ఎన్నోసార్లు ప్రతి చిన్నదానికీ ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది. హిందువులు ఏకతాటిపై నిలిచి శంకర పరంపరకు కట్టుబడి ఉండి పాలకులపై  వారి శాసనాధికారం తిరిగి వారికే రాజ్యాంగ సవరణతో ఇప్పిస్తే మనకు ఏది కావాలో వారే ఇప్పిస్తారు. దానికి ఉదాహరణ రామసేతు అయినా రామమందిరం అయినా సుప్రీం కోర్టులో నిలబడి గెలిచిన వాదాలు శంకరాచార్యుల వారి పీఠానికి చెందిన వారిదే అనేది తెలుసుకోవచ్చు, అలాగే గోహత్య నిషేధానికి కూడా పై స్థాయిలో కృషి చేస్తున్నదే కాక భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించమనే ఆదేశం కూడా ప్రభుత్వానికి ఎప్పుడో ఇచ్చారనేది అందరూ గ్రహించాలి.

హిందూత్వ పరిరక్షణ:
హిందూత్వ పరిరక్షణకు మనమేమి చేయాలి మరీ అనేది మనమంతా తెలుసుకోవలసిన అసలు విషయం, ఆది శంకరాచార్యుల వారు 72అవైదిక మతాలను ఖండించడమే కాకుండా షణ్మతాల రూపములో 6 మార్గాల ఆరాధనా విధానము కూడా ఇచ్చి - వేదము సూచించే అద్వైత స్థితి అయిన ముక్తి మార్గము చూపారు. దానిని మనకు తమ అనుగ్రహముతో సులువుగా అలవర్చుకునేందుకు నాలుగుదిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను పెట్టి ముక్తి మార్గాన్ని సూచిస్తే, నేటి రోజున 70 శాతము హిందువులు పురోగతి మార్గములో కాకుండా తిరోగతి మార్గాలు వెతుకుతున్నారు తమకు తెలిసీ తెలియక. ఈ ప్రాపంచికములని దాటి పరమును చేరుకోడానికి నాలుగు ఆమ్నాయాలలో తన పరంపరను ఏర్పాటు చేశారు, ప్రాపంచికములో కూడా రాజ్యాంగము ఏర్పడక ముందు ఉన్న ప్రభువుల పై జగద్గురువులుగా శాసనం చేసేవారుగా జగద్గురువులుగా ఉండడమే కాక వాటితో పాటు సైన్య వ్యవస్థని కూడా ఇచ్చారు కదా ఇంకా ఏమి కావాలి !

ఏమి కావాలి అనుకోవడం కాదు, హిందూధర్మ పరిరక్షణకు గాను అన్నివిధాలలోనూ ఆది శంకరాచార్యుల వారు బీజమెప్పుడో దూరదృష్టితో వేశారు, దానికిగాను తన స్వరూపమే అయిన శంకర పరంపరను కూడా ఏర్పాటు చేశారు నాలుగు ఆమ్నాయ పీఠాలలో, మనము చేయవలసినదల్లా పైన సూచించిన విధముగా మనము వారిని భక్తితో చేరి తద్వారా హిందూ ధర్మానికి జగద్గురు ఆది శంకరాచార్యుల వారి మార్గదర్శకములో కట్టుబడి ఉండాలనేదే నేడు హిందువులందరూ గ్రహించాలి.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవద్పాద శంకరం లోక శంకరం
హిందూ ధర్మ పరిరక్షకులైన జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి జై

రచన/సంకలనం: పలికినవాడు మునిపల్లె జ్యోతిస్వరూప్

Friday, June 19, 2020

పాల్ఘర్ సాధువుల హత్యోదంతం: నిజ నిర్ధారణ కమిటి విచారణలో బయటకొస్తున్న వాస్తవాలు - Palghar saints: Facts revealing at the inquiry committee



పాల్ఘర్ సాధువుల హత్యోదంతం

దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో సాధువుల దారుణ హత్య ఘటన జరిగి రెండు నెలలు అయింది. ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ను నడిరోడ్డు మీద కర్రలతో కొట్టి పైశాచికంగా కొట్టి హత్య చేసిన ఈ ఘటనను కరోనా లాక్ డౌన్ హడావుడి పేరుతో ప్రధాన మీడియా చాప కిందకు తోసేసింది.

కానీ మహారాష్ట్రకు చెందిన వివేక్ విచార్ మంచ్ అనే స్వచ్ఛంద సంస్థ మాత్రం ఈ దారుణంపై స్పందించింది. ఈ హత్య తాలూకు వాస్తవాలను శోధించేందుకు నిజ నిర్థారణ కమిటీ ను నియమించింది.  నిజ నిర్ధారణ కమిటి విచారణలో అనేక వాస్తవాలు బయటకొస్తున్నాయి.

బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంబదాస్ జోషి అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీ ఏర్పడింది. న్యాయవాదులు సమీర్ కాంబ్లీ, ప్రవర్తక్ పాథక్, పాత్రికేయులు కిరణ్ షేలార్, సామాజిక వేత్త సంతోష్ జనథ్, మాజీ పోలీసు అధికారి లక్ష్మణ్ ఖార్పడే, స్వచ్చంద  సేవకులు శ్రీమతి మాయా పోతేదార్ లు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు.

ఘటన జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి, గ్రామస్తులను, సర్పంచ్ స్థాయి నాయకులను కలిసి వివరాలు సేకరించింది. సాధువులను చంపాలన్న క్రూరమైన ఆలోచన వెనుక కారణం ఏమిటి, ఈ విధంగా ప్రేరేపించినది ఎవరు, ఆదివాసీల ముసుగులో ఉన్న విద్రోహ శక్తులు ఎవరు అనే విషయాలపై కూలంకుషంగా జరిపిన విచారణలో దిగ్భ్రాంతిని కలిగించే అనేక విషయాలు బయటపడ్డాయి. మరెన్నో లోతైన అనుమానాలు కూడా కలిగాయి:
  • 1. హత్యాకాండ జరిగిన వెంటనే ప్రభుత్వం ఒక నాటకానికి తెరదీసింది. “పిల్లల కిడ్నాపర్లు అనుకొని సాధువులను హతమార్చారు” అంటూ అప్పటికప్పుడే ఓ కథ అల్లి తమ యంత్రాంగం సహాయంతో ప్రచారం చేసేసింది. ఏమాత్రం విచారణ జరపకుండా ఈ విధమైన నిర్థారణకు ఎలా వచ్చారు?
  • 2. హత్యకు సంబంధించిన వీడియో చూస్తే.. కాపాడమని సాధువులు ప్రాథేయపడుతుంటే పోలీసులు పట్టించుకోకుండా హంతకులకు వారిని అప్పగించినట్లు అర్థం అవుతోంది. హంతకులతో ప్రభుత్వ యంత్రాంగం చేతులు కలిపినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.
  • 3. ఘటన జరిగిన తరువాత, సమీపంలోని కాసా పోలీసు స్టేషన్ సిబ్బంది అందరినీ గుట్టుచప్పుడు కాకుండా ఇతర పోలీసు స్టేషన్లకు బదలీ చేసేశారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా రాబట్టడం ఎలా సాధ్యం అవుతుంది?
  • 4. సాధువులపై దాడిని ప్రోత్సహిస్తూ వీడియోల్లో కనిపించిన కాశీనాథ్ చౌధరి అనే స్థానిక నేత జోలికి పోలీసులు వెళ్లడం లేదు. ఘటన జరిగిన తర్వాత అక్కడ పర్యటించిన రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్.. ఇదే వ్యక్తిని వెంటతీసుకుని తిరిగారు. అంటే నిందితులను ప్రభుత్వం ఏ విధంగా కాపాడుతోందో అర్థం చేసుకోవచ్చు.
  • 5. హత్య జరిగిన గడ్చించలే గ్రామంలోని కొంత భాగం మహారాష్ట్రలో ఉంటే, మరికొంత భాగం కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో ఉన్నది. నిందితులు అక్కడ దాక్కుంటే ఈ కుంటి సాకును చూపించి స్థానిక పోలీసులు సరిహద్దులు దాటడం లేదు.
ఈ వాస్తవాల్ని బట్టి చూస్తుంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం అవుతోంది. అసలు దోషుల్ని దాచిపెట్టి స్థానిక ఆదివాసీ యువకుల మీద తూతూ మంత్రంగా కేసులు పెట్టి కాలక్షేపం చేస్తోంది.

వాస్తవానికి ఈ ఘటనకు ముందు నుంచే పాల్ఘర్ జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్యూనిస్టు ప్రభావిత సంస్థలు, నక్సలైట్ ఉద్యమకారులు చురుగ్గా పనిచేస్తున్నారు. వీరికి నిధులు సరఫరా చేస్తూ క్రైస్తవ మిషనరీ సంస్థలు మతమార్పిడిలకు పాల్పడుతున్నాయి. అమాయక ఆదివాసీలను తమ వైపు తిప్పుకోవటమే ఈ సంస్థల లక్ష్యం. ఇందులో భాగంగా అక్కడ వివిధ రకాల విద్రోహపూరిత చర్యలకు పాల్పడుతున్నాయి.

నిజనిర్ధారణ కమిటీ విచారణ సందర్భంగా  ఈ క్రింది విషయాలు దృష్టికి వచ్చాయి:
  • 1. భారత రాజ్యాంగాన్ని, భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నది ఈ సంస్థల ఉద్దేశ్యం. ఇందుకు అనుగుణంగా స్థానిక ప్రజల్లో దేశం పట్ల, సమాజం పట్ల వ్యతిరేకతను పెంచుతూ వచ్చారు.
  • 2. ప్రజా ప్రతినిధులు, అధికారులను అటువైపు రాకుండా అడ్డుకొంటుంటారు. గ్రామాల్లో అడుగు పెడితే దాడుల చేయటం, వాహనాలను తగల బెట్టడం వంటివి చేస్తుంటారు.
  • 3. ఆదివాసీలకు మేలుచేసే అభివృద్ది పనులను ఈ సంస్థలు మూకుమ్మడిగా అడ్డుకొంటాయి. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను బెదిరించి పంపించేస్తుంటారు.
  • 4. ఈ గ్రూపులు చేసే అతి ముఖ్యమైన పని హిందుత్వంపై విషాన్ని చిమ్మటం. పురాణాలు, హిందూ దేవుళ్ల పై వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. మత మార్పిడికోసం ప్రజలకు ఈ విషాన్ని నూరిపోస్తుంటారు.
ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న సంస్థలను నిజనిర్థారణ కమిటీ గుర్తించింది. పేర్లతో సహా బయట పెట్టింది. కష్టకారీ సంఘటన్, భూమిసేన, ఆదివాసీ ఏక్తా పరిషత్, కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ సంస్థలకు చెందిన కొందరు నాయకులు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తించింది. సాధువుల హత్యకు కూడా ఇటువంటి నాయకులే కారణమని నిర్ధారణ చేసింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే వీరి బాగోతాలన్నీ బయట పడతాయి. దోషులు హాయిగా తిరుగుతుంటే, కొందరు ఆదివాసీల మీద మాత్రమే కేసులు పెట్టారని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. సీబీఐతో కానీ, ఎన్ ఐ ఎ తో కానీ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.

Source: www.organiser.org

Monday, June 1, 2020

యోగి ప్ర‌హ్లాద్ జాని - Yogi Prahlad Jani



గాంధీన‌గ‌ర్, గుజరాత్ ‌: 70 ఏళ్లుగా అన్న‌పానీయాలు ముట్టుకోని యోగి ప్ర‌హ్లాద్ జాని(90) 26 మే మంగ‌ళ‌వారం 2020 ఉద‌యం తుది శ్వాస విడిచారు.

ప్రహ్లాద్ జానీ 1929 ఆగస్టు 13 న గుజ‌రాత్‌లోని చ‌రడా గ్రామంలో జ‌న్మించారు. ఈ యోగిని అత‌ని భక్తులు ప్రేమ‌గా "చునిర్వాలా మాతాజీ" అని పిలుస్తారు. గుజ‌రాత్‌లో ఇత‌ని పేరు తెలియ‌ని వారు ఉండ‌ర‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. 1940 నుండి ఎటువంటి ఆహారము, నీరు లేకుండా 70 ఏళ్లు జీవించ‌డంతో అత‌నిపై ఎంతోమంది శాస్త్రవేత్త‌లు అధ్య‌య‌నం చేశారు. అందులో మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లామ్ కూడా ఒక‌రు. ఏమీ తిన‌కుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అస‌లు కారణాన్ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయారు. 2010లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఒక గ‌దిలో ఉంచి వీడియో మానిట‌రింగ్ నిర్వ‌హించారు. అనంత‌రం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, త‌దిత‌ర వైద్య ప‌రీక్ష‌లు జరిపారు. ఈ ఫ‌లితాల్లో ఆయ‌న‌కు అసాధార‌ణ రీతిలో ఆక‌లి, దాహాన్ని త‌ట్టుకునే ల‌క్ష‌ణాలున్నాయ‌ని వెల్ల‌డైంది.
  • ➣ 2003 లో స్టెర్లింగ్ హాస్పిటల్స్, అహ్మదాబాద్ లో 30 మంది డాక్టర్స్(Sudhir Shah & Others) ఈ యోగి ని ఒక రూమ్ లో ఉంచి 15 రోజుల పాటు పరీక్షలు జరిపారు.
  • ➣ రోజు ఉదయాన్నే 100ml నీరు మాత్రం పుక్కిలించుకోవటానికి ఇచ్చేవారు. CCTV cameras అమర్చారు. 15 రోజుల తర్వాత అతని ఆరోగ్యం లో ఎటువంటి మార్పు లేదు.
  • ➣ అయితే ధ్యాన‌మే త‌న‌ను బ‌తికిస్తోంద‌ని యోగి గ‌తంలోనే స‌మాధాన‌మిచ్చారు. కాగా ఆయ‌న ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన వారిలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.
  • ➣ ఇట్టి గొప్ప యోగులు పుట్టిన గడ్డ నా భరతభూమి. ఈ గడ్డపై ఇలాంటి యోగిపుంగవులు ఎందరో!నా జాతి నీ పునీతం చేశారు.
  • ➣ కానీ ఇదెలా సాధ్యమో తెలియక మతులు పోగొట్టుకొంటున్నారు. దుర్గామాత ఆరాధన వలన ఈ శక్తి తనకు వచ్చిందని ప్రహ్లాద్ జని గారు చెబుతారు. —

జైప్రహ్లాద్ జానీ! - జై హింద్! - భారత మాతకీ జై.

సంకలనం: కోటేశ్వర్

Sunday, May 24, 2020

పాల్గర్ సాధువుల హత్య వెనుక: ఆదివాసీ ఏక్తా పరిషద్ అసలు రూపం - Palghar, The true face of Adivasi Ecata Parishad


పాల్గర్ సాధువుల హత్య వెనుక: ఆదివాసీ ఏక్తా పరిషద్ అసలు రూపం - Palghar, The true face of Adivasi Ecata Parishad

త నెల 16న మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలోని గడ్ చించలే గ్రామంలో జునా అఖాడాకు చెందిన ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ ను హంతక మూకలు నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపాయి. ఈ సంఘటనలో 100మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వీరిని విడిపించేందుకు ఆదివాసీ ఏక్తా పరిషద్ అనే సంస్థ వెంటనే రంగంలోకి దిగడంతో ఈ మూకుమ్మడి హత్యల వెనుక పరిషద్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతకీ ఈ ఆదివాసీ ఏక్తా పరిషద్ ఏమిటి? గిరిజనుల్లో ఆ సంస్థ సాగిస్తున్న కార్యకలాపాలు ఏమిటి?

వామపక్ష సమూహాలు, చర్చ్ సంస్థల పనితీరులో అనేక పోలికలు ఉంటాయి. తమ అసలు రంగు బయటపడకుండా వివిధ సంస్థలను సృష్టించి వాటి ద్వారా కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ఆ విధంగా తమ కుట్ర బయటపడకుండా,  పేరు వినిపించకుండా జాగ్రత్తపడుతుంటాయి. జాగ్రత్తగా తీగ లాగితేనేగానీ డొంక అంతా కదలదు, అసలు నిజాలు బయటకిరావు.

సాధువుల మూకుమ్మడి హత్యకు సామాజిక మాధ్యమాలలో జరిగిన అసత్య ప్రచారమే కారణమంటూ కొందరు ఓ వాదన లేవదీశారు. “కరోనా వైరస్ వ్యాప్తికి ముస్లిములు కారణం” అని సామాజిక మాధ్యమాల్లో సాగిన దుష్ప్రచారం ఒక కారణమని అన్నారు. అలాగే `పిల్లల మూత్రపిండాలను దొంగిలించే ముఠా తిరుగుతోందనే’ ప్రచారం ఈ సంఘటన జరగడానికి మరొక కారణం కావచ్చని వాదించారు. ఇంతకీ మూత్రపిండాలు ఏవైనా పువ్వులా, అలా తెంపుకుని ఇలా పట్టుకుపోవడానికి? ఈ అసంబద్ధమైన వాదనలు ఎక్కడ పుట్టాయి? ది ప్రింట్ మొదలైన మీడియా సంస్థల ప్రకారం ఈ వార్తలు, పుకార్లు కొందరు పుట్టించారని ఆదివాసీ ఏకతా పరిషద్ కు చెందిన రాజు పంధార చెప్పారు. ఈ పరిషద్ పశ్చిమ భారతంలో పనిచేసే ముఖ్యమైన సంస్థ  అంటూ ఆ మీడియా సంస్థలు కితాబు కూడా ఇచ్చాయి. ఇంతకీ ఈ ఆదివాసీ ఏకతా పరిషద్ వెనుక ఉన్నదెవరు?

ఆదివాసీ ఏక్తా పరిషద్ రెండు ముఖాలు
“సమస్త మానవాళి, ప్రకృతి కోసం పనిచేస్తాం” అంటూ ఆదివాసీ ఏకతా పరిషద్ తమ అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది. ఇటీవల జనవరిలో పాల్ఘార్ దగ్గర ఈ సంస్థ ఏర్పాటు చేసిన “సాంస్కృతిక” సభకు మధ్యప్రదేశ్ గవర్నర్ అనసూయ, స్థానిక ఎంపీ రాజేంద్ర గావిట్ తో సహా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ ఉత్సవం ప్రతిసంవత్సరం జరుగుతుంది. దీనికి 2 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని ఈ సంస్థ గొప్పగా చెపుతుంది కూడా. గత సంవత్సరం (2019)లో ఈ ఉత్సవాన్ని దాద్రా నాగర్ హవేలి లోని సిల్వాసా లో నిర్వహించారు. అప్పటి నుంచి పాల్ఘార్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సంస్థ కార్యకలాపాలు పెరిగాయి.

తెర వెనుక కధ
ఈ 2019 దాద్రా నాగర్ హవేలి ఉత్సవం గురించి కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా(CBCI) సంస్థ కూడా తమ వెబ్ సైట్ లో ప్రస్తావించింది. `కాథలిక్ బిషప్స్ కు చెందిన గిరిజన వ్యవహారాలు చూసే ఫాదర్ నికోలస్ బర్లా కూడా ఈ ఉత్సవ నిర్వాహకులలో ఒకరు. అలాగే ఆయన ఆదివాసీ ఏకతా పరిషద్ సభ్యుడు కూడా. అలాగే సిస్టర్ లలితా రోషిణి లక్రా కూడా ఆ మూడు రోజుల కార్యక్రమానికి హాజరయ్యారు” అని సంస్థ వెబ్ సైట్ పేర్కొంది. “ఫాదర్ బర్లా ఆ ఉత్సవంలో `గిరిజన అంశాలపై ఐక్యరాజ్యసమితి’ అనే విషయాన్ని గురించి మాట్లాడారు కూడా” అని కాథలిక్ బిషప్స్ సంస్థ వెబ్ సైట్ వెల్లడించింది.

“పాల్ఘార్ లో జనవరి 13 నుంచి 15 వరకు జరిగిన సమావేశాలను కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది’’ అని ఇటలీలోని రోమన్ కాథలిక్ పాంటిఫికల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫారిన్ మిషన్స్ (PIME) తన అధికారిక వార్తా సంస్థ asianews.it ద్వారా వెల్లడించింది. “ఈ కార్యక్రమం చర్చి కార్యకలాపాల్లో  ఒకటి, అలాగే అది జీసస్ సందేశాన్ని, దివ్య ప్రబోధపు విలువలను తెలియజేసింది” అని కూడా పేర్కొంది.

“ఐక్యరాజ్య సమితికి చెందిన స్థానిక జాతుల అంశాలపై శాశ్వత ఫోరం ఉపాధ్యక్షుడు ఫూల్ మన్ చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ ఫాదర్ బర్లా పేర్కొన్న విషయాన్ని కూడా రోమన్ కాథలిక్ సంస్థ ప్రస్తావించింది.
ఈ ఐక్యరాజ్యసమితి ఫోరం ఏమిటి?
ఇది ఐక్యరాజ్యసమితి సలహా సంఘం. ఇందులో వివిధ ప్రభుత్వాలు నామినేట్ చేసిన 8 మంది సభ్యులతోపాటు స్థానిక జాతుల సంస్థలకు చెందిన మరో 8 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఫూల్ మన్ చౌదరి స్థానిక జాతుల సంస్థల ద్వారా నేపాల్ నుంచి నామినేట్ అయిన వ్యక్తి. ఆదివాసీ ఏకతా పరిషద్ మాదిరిగానే ఈ `స్థానిక జాతుల సంస్థలు’ కూడా చర్చ్ కి సంబంధించిన మరొక సంస్థగా భావిస్తారు. అయితే ఐక్యరాజ్యసమితి సంస్థ కావడంతో దీనికి అపారమైన నిధులతో పాటు, గౌరవం, పరపతి కూడా లభిస్తాయి. వాటిని ఉపయోగించి ఈ సంస్థ `పేద స్థానిక జాతుల’ కోసం పనిచేస్తుంది. ఇలాంటి సంస్థలో ఫాదర్ నికోలస్ బర్లా ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. బర్లా ద్వారా ఆదివాసీ ఏకతా పరిషద్ కార్యకర్తలు విదేశీ ప్రయాణాలు చేస్తూ అంతర్జాతీయ వేదికలపై తమ వాదనలు వినిపిస్తుంటారు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం బర్లాను కేవలం నికలస్ బర్లాగానే పేర్కొంటారు తప్ప ఆయన క్రైస్తవ ఫాదర్ అనే సంగతి తెలియనివ్వరు.

ఆదివాసీ ఏకతా పరిషద్ గురించి కొందరు స్వతంత్ర రచయితలు పరిశోధించినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. హారీ గోల్బార్నే సంపాదకత్వంలో వచ్చిన `race and ethnicity’లో ఆదివాసీ ఏకతా పరిషద్ ప్రస్తావన కూడా ఉంది. `హిందువుల కబంధ హస్తాల నుండి విముక్తం కావాలని ఆదివాసీలకు పిలుపునిస్తుంది’ అని ఆదివాసీ ఏకతా పరిషద్ గురించి వ్రాసారు.

ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట `సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పుకార్లు’ అసలు నిజంగా వచ్చినవా, లేక గిరిజనులను రెచ్చగొట్టేందుకు ఉపయోగించిన ప్రచారమా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. గిరిజనులను ఈ విధంగా రెచ్చగొట్టి `పత్తల్ గర్హి ఉద్యమం’ మాదిరిగా పాల్ఘార్ లోకి కూడా `ఇతరులు’ఎవరు ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నం సాగుతోందని అనిపిస్తుంది.

సమాధానం దొరకాల్సిన కొన్ని ప్రశ్నలు:
ఈ వ్యవహారమంతా ఈనాటిది కాదు. ఇది చాలా సంవత్సరాలుగా సాగుతోంది. అయితే సాధువుల మూక హత్యల సంఘటన నేపధ్యంలో ఆదివాసీ ఏకతా పరిషద్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంది. అవి :
  • – చర్చ్ సహాయసహకారాలతో ప్రతి సంవత్సరం లక్షలాది మందితో కార్యక్రమాలు జరుగుతాయా?
  • – కాథలిక్ బిషప్స్ సంస్థ (CBCI)కు చెందిన ఫాదర్ నికోలస్ బర్లా పరిషద్ కార్యనిర్వహణ బోర్డ్ సభ్యుడా?
  • – కొన్ని పుస్తకాలు పేర్కొన్నట్లు పరిషద్ హిందూ వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటున్నదా?
  • – సాధువుల మూకుమ్మడి హత్యలకు సోషల్ మీడియా పుకార్లు కారణమని చెప్పాలనుకుంటున్నవాళ్లు ఎవరు?
  • చర్చ్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు
  • – ఆదివాసీ ఏకతా పరిషద్ తో చర్చ్ కు ఉన్న సంబంధం ఏమిటి?
  • – అటువంటి సంస్థల ద్వారా చర్చ్ పాల్ఘార్, దాద్రా నాగర్ హవేలి వంటి ప్రాంతాలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నదా?

Wednesday, April 22, 2020

శస్త్రధార, శాస్త్రధార "దశనామి అఖాడా" వీర సాధువా - Dasanami Janaa Akhada Sadhus

హారాష్ట్రలోని పాల్ఘర్ దగ్గర హంతక మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులు, చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్(35), "దశనామి జునా అఖాడా"కు చెందినవారు. వారితోపాటు వారి కారు డ్రైవర్ని లేశ్ తెలగానే(35) ను కూడా మూకలు హత్య చేశారు.
ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులు, చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్(35),
ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులు, చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్(35),
"దశనామి అఖాడా" మన దేశంలో ఉన్న ప్రాచీనమైన అఖాడాలలో ఒకటి. ఈ అఖాడా సంప్రదాయాన్ని స్వయంగా ఆది శంకరాచార్యులు ప్రారంభించారని సాధువులు చెపుతారు.

దశనామీ సంప్రదాయానికి చెందినవారు రెండు రకాలుగా ఉంటారు:
  • 1. శాస్త్రధారులు, 
  • 2. శస్త్రధారులు.
శాస్త్రధారులు వివిధ శాస్త్రాల అధ్యయనంలో గడుపుతారు. శస్త్రధారులైన వారు యుద్ధవిద్యాలలో ప్రావీణ్యత సంపాదిస్తారు. వీరిద్వారానే వివిధ అఖాడాలు ఏర్పడ్డాయి.

ఈ సంప్రదాయానికి చెందినవారు పది రకాల పేర్లలో ఏదో ఒకటి ధరిస్తారు. అందుకనే వీరికి దశనామీ అని గుర్తింపు వచ్చింది. ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని పది శాఖలుగా ఏర్పాటు చేశారని చెపుతారు.
  •  1. అవి గిరి - (కొండ),
  •  2. పురి - (నగరం),
  •  3. భారతి - (జ్ఞానం),
  •  4. వనం - (తోట),
  •  5. అరణ్యం - (అడవి),
  •  6. పర్వతం - (పర్వతం),
  •  7. ఆశ్రమ - (ఆశ్రమం),
  •  8. సాగర - (సముద్రం),
  •  9. తీర్థ - (తీర్థస్థలం),
  • 10. సరస్వతి - (వివేకం). 
(పాల్ఘర్ లో హత్యకు గురైన సాధువులు గిరి సంప్రదాయానికి చెందినవారు).

ఈ పది పేర్లు ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలకు చెందినవారికి ఉంటాయి. అలాగే ఈ మఠాలలో ఒక్కో మఠంలో ఒక్కో వేదాధ్యయనం జరుగుతుంది.
  • ۞ దక్షిణం: శృంగేరి మఠం, కర్ణాటక (పురి, భారతి, సరస్వతి). వేదం: యజుర్వేదం
  • ۞ తూర్పు: గోవర్ధన మఠం, పూరీ (వన, అరణ్య). వేదం: ఋగ్వేదం
  • ۞ పడమర: శారదా మఠం, ద్వారక (తీర్థ, ఆశ్రమ). వేదం: సామవేదం
  • ۞ ఉత్తరం: జోషి మఠం, బదరీనాధ్, (గిరి, పర్వత, సాగర). వేదం: అథర్వణ వేదం
దశనామి సంప్రదాయాన్ని అనుసరించాలనుకున్నవారు భౌతికమైన వస్తుసంపదను పూర్తిగా త్యజించాలి. కేవలం కాషాయ వస్త్రాన్ని ధరించి, దండకమండలాలు ధరించాలి. అలాగే పురుషసూక్తం చదువుతూ విరాజ హోమం చేయాలి.

ఆ తరువాత `అంతా వినండి : నా గురువు అనుగ్రహం మూలంగా నేను భౌతిక జీవితాన్ని దాటి వెళ్లాలనుకుంటున్నాను. నేను అన్ని సంబంధాలను త్యజిస్తున్నాను. కొడుకు పట్ల ప్రేమ, సంపద, సహచరులపట్ల అభిమానం వదిలిపెడుతున్నాను. మీరు కూడా నాపట్ల అనురాగ బంధాలను వదిలిపెట్టండి. నా సన్యాస జీవనానికి అడ్డురాకండి’ అని చెపుతూ దోసిలి నిండా నీళ్ళు తీసుకుని వేద మంత్రాన్ని(అశుప్ శిశ్నాహ..) చదువుతూ నీటిని వదిలిపెడతాడు.

ఆ తరువాత అతను నదిలో స్నానం చేసి, సంధ్యాదులు పూర్తిచేసి తాను సన్యాసం స్వీకరించానని ప్రతిజ్ఞ చేస్తాడు.

దశనామీ సన్యాసి ఆచరించే నియమాలు:
  • ⭄ కాషాయ వస్త్రం ధరించి భిక్షాటన చేయడం
  • ⭄ రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం
  • ⭄ సాధారణ జన నివాసాలకు బయట ఉండడం
  • ⭄ నేలపై నిద్రించడం
  • ⭄ ఎవరి గురించి చెడుగా మాట్లాడకపోవడం
  • ⭄ తన కంటే పై స్థాయిలోని సన్యాసికి తప్ప ఎవరికి వందనం చేయకపోవడం
  • ⭄ కేవలం కాషాయ వస్త్రాలే ధరించడం
యోధులైన దశనామీలు మధ్యయుగంలో హిందూ సమాజ రక్షణలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు విదేశీ దురాక్రమణ దారులను ఎదుర్కొని మథుర, వారణాశి వంటి పుణ్యక్షేత్రాలను కాపాడారు.

నిర్వాణి పత్రం ప్రకారం దశనామీ సాధువులు 1664లో ఔరంగజేబును ఓడించి వారణాసిలోని విశ్వనాథ మందిరాన్ని కాపాడారు. అప్పుడు రోజంతా పోరాడిన సాధువులు చివరికి ముస్లిం సేనానులు మీర్జా అలీ, అబ్దుల్ ఆలీ లను చిత్తుగా ఓడించారు.

నిర్వాణి పత్రంలో ఇలా ఉంది :
  • ⭄ “కాశీ క్షేత్రంలో శాలివాహన శకం 1721(1664) లో వాళ్ళు సుల్తాన్ పై ఘనవిజయం సాధించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం సాగింది. అందులో దశనామీలు వీరవిహారం చేశారు. వాళ్ళు ఆ క్షేత్ర పవిత్రతను కాపాడారు. వాళ్ళు ముస్లిములైన మీర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీ లను ఓడించారు”.
చరిత్ర:
అలాగే దశనామీ సంప్రదాయానికి చెందిన అటల్ అఖాడా కూడా హిందూ ధర్మ రక్షణ కోసం అనేకమంది వీరులను, యోధులను అందించింది. ఇది జోధ్ పూర్ కేంద్రంగా పనిచేసింది.

కాబూల్, బెలూచిస్తాన్ నుంచి ముస్లింలు జోధ్ పూర్ పై దండెత్తి వచ్చి తమకు పెద్ద మొత్తంలో కప్పం కట్టాలని అక్కడి రాజును బెదిరించినప్పుడు ఈ అటల్ సన్యాసులు అక్కడికి వచ్చి ముస్లింలను ఓడించి, వారి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మరెప్పుడు మార్వార్ వైపు చూడామని ఆ ముస్లిం దోపిడిదారులతో ఖురాన్ పైనే ప్రమాణం చేయించారు. అటల్ సన్యాసులు చేసిన ఈ మహోపకారానికి కృతజ్ఞతగా రాజు నాగోర్ తాలూకాను ఈ గోసాయిలకు (సన్యాసులకు) దానం చేశాడు. ఈ ప్రాంతం ఇప్పటికీ అటల్ సన్యాసుల ఆధీనంలోనే ఉంది.
  • ⭄ 1757లో అహమద్ షా అబ్దాలి భారత్ పై దండయాత్ర చేసి వేలాదిమందిని కత్తికి ఎర చేసి మిగిలిన అందరినీ బానిసలను చేశాడు. కనిపించినదంతా ధ్వంసం చేశాడు. 
  •  40వేలమంది ఆఫ్ఘన్ లను తీసుకుని కృష్ణమందిరాన్ని (గోకులనాధుడు) ధ్వంసం చేయడానికి గోకులానికి వచ్చాడు. 
  •  అక్కడే ఉన్న 4వేలమంది నాగా సాధువులు అఖాడా నుంచి బయటకు వచ్చి పుణ్యక్షేత్రాన్ని రక్షించడానికి పోరాడారు. 
  •  సంఖ్యలోను, ఆయుధపరంగా మెరుగైన ఆఫ్ఘన్ సేనతో యుద్ధం చేస్తూ 2వేలకుపైగా నాగా సాధువులు ప్రాణాలు అర్పించారు. 
  •  కానీ వీరోచితంగా పోరాడిన నాగా సాధువుల ముందు నిలవలేక చివరికి అబ్దాలి వెనక్కు తగ్గవలసి వచ్చింది. 
  •  దేవాలయాలు, మఠాలను ధ్వంసం చేసే ఆలోచనకు స్వస్తి చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. 
భారత్ పై దండెత్తిన తరువాత అన్నిచోట్ల ఘోరమైన మారణకాండ, విధ్వంసం సాగిస్తూ వచ్చిన అబ్దాలికి గోకుల్ లో నాగా సాధువుల చేతిలో పరాభవం తప్పలేదు.

దశనామీ సాధువులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. సన్యాసుల తిరుగుబాటు (1770-1820)లో ముఖ్యమైన పాత్ర పోషించారు. కఠినాతికఠినంగా శిక్షించడం, దశనామీ సన్యాసులు బెంగాల్ లోకి ప్రవేశించకుండా నిషేధం విధించడం ద్వారా బ్రిటిష్ పాలకులు ఆ తిరుగుబాటును అతికష్టం మీద అణచివేయగలిగారు.

దశనామీ సాధువుల పరాక్రమం, త్యాగాలు భారత దేశ చరిత్రలో గుర్తింపుకు నోచుకోలేదు. కుంభమేళాల సమయంలో కనిపించే ఈ సాధువులు వేలాది సంవత్సరాల సాంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుతున్నారు.

మన ఈ సాంప్రదాయాలను కాపాడేందుకు  వాళ్ళు సర్వస్వం వదులుకున్నారు. మన నాగరకత, సంస్కృతి ఈనాడు ఇలా నిలబడిందంటే అందులో దశనామి సన్యాసుల పాత్ర ఎంతైనా ఉంది. మనకు ఇంత చేసినా వాళ్ళు ఎప్పుడు ఏదీ మన నుంచి ఆశించారు, కోరుకోరు.

కానీ ఇప్పుడు మనం వారిని ఏవిధంగా గౌరవిస్తున్నాం? 
ఏవిధంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం? 
మూకుమ్మడి దాడుల ద్వారానా? 
అమానుషమైన హత్యల ద్వారానా? 
ఈ విషయంలో మొత్తం సమాజంగా మనం విఫలమయ్యమా? 
మన కోసం జీవించిన, జీవిస్తున్నవారిని గౌరవించుకుని, కాపాడుకోలేకపోయామా? ఆలోచించండి.

హార హార మహాదేవ శంభో శంకర
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

సంకలనం: కన్నయ్యా నానీ కట్టర్ హిందూ

Friday, January 31, 2020

నాగసాధవు - Naaga Saadhu



క వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవలసివస్తుంది. అందుకే "కుంభమేళా" జరిగే సమయంలో అక్కడి వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది.

ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలసి వారి వివరాలు తెలియచెయ్యాలి. వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు లేదా అక్కడే రాంరాం చెప్పేస్తారు. ఒక సారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు. స్వీకరించిన తరువాత వీరికి అక్కడ 6 నెలలు నుండి 12 సంవత్సరాలు వరకు శిక్షణ ఉంటుంది
ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుoది. ఇంకా యోగా మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు.

మన మహా ఋషులు తపస్సు అనే పేరుతో విటీతోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు. కొందరికి తెలియని విషయము ఏమిటంటే "అఘోరాలు వేరు, నాగ సాధువులు" వేరు.

పాటించవలసిన నియమాలు:
  • Ψ నాగ సాధువులు శాకాహారులు వీరు నేల పైనే నిద్రించాలి రోజులో ఒక సారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ అహరాన్నివారే సంపాదించుకోవాలి.
  • Ψ అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. 
  • Ψ ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన మహా ప్రసాదంగా స్వీకరించాలి వారు ఏమీ ఎవ్వనిచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిదే. 
  • Ψ అలాగే వీరు దిగంబరంగ జీవించాల్సి ఉంటుంది.
  • Ψ శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం మాత్రమే ధరిస్తారు శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే దరిస్తారు.
వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి
  • 1. శివుని
  • 2. శక్తిని 
  • 3. వినాయకుని
  • 4. విష్ణువును మరియు 
  • 5. సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు.
  • ఆగడాలకు వచ్చిన వారికి అంచె అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది.
  • ముందుగా వీరు అవధూతగా మారాలి.
  • గుండు చేయించుకొని వారి కర్మ కాండలను వారే నిర్వహించుకోవాలి.
  • పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి అధికారిక నాగ సాధువులుగా గుర్తింపు లభిస్తుంది.
ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతువస్తుంది
మొదటగా 
  • (1) నాగ సాధువుగా 
  • (2) మహంతగా 
  • (3) శ్రీ మహంతగా 
  • (4) జమతియా మహంతగా 
  • (5) పీఠ మహంతిగా 
  • (6) దిగంబర శ్రీ గా 
  • (7) మహా మండలేశ్వరుడిగా చివరిగా 
  • (8) ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరించును.
  • చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు
కుంభమేళాలో నాగసాధువులు
శిక్షణ అనంతరం:
వీరు హిందు పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటనికైనా సిద్ధంగా ఉంటారు.
ఈక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారీనా వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది.

రహస్య జీవనం: 
వీరు ఏంత కాలమైన నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు.
వీరు మనుష్యలకు కనిపించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివశిస్తుంటారు.
కొన్న కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలల సంచరిస్తుంటారు ధర్మ పరిరక్షణ గాడి పడిన రోజున కాల రుద్రులుగా మారుతుంటారు.
శిక్షణలో ఉన్న నాగ సాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాలలో ఉన్న ఆగడాలలో కొన్ని అనుమతులు ద్వారా దర్శించవచ్చును. అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం.

"ఇకపోతే నాగసాధువులు లక్షల్లో కుంభ మేళానికి వస్తారు వీరు వచ్చేసమయాలో ట్రాఫిక్(రవాణా స్తంభించడం) ఉన్న జాడలు ఉండవు, ఎక్కడ హోటల్(భోజన విక్రయశాల')లో ఆహారం తీసుకున్న దాఖలు ఉండవు, వీరు కేవలం సూక్ష్మ రూపంలో ఆహారాన్ని నింపుకుంటారు. ఒక్కసారిగా లక్షలో వచ్చి కొద్దీ దూరం వెళ్ళాక ఎవరికి కనిపించరు...

ఓం నమః శివాయ-హర హర మహాదేవ్

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com