ఆరు బయట ఆటలు, యోగాతో ఆరోగ్యం - Āru bayaṭa āṭalu, yōgātō ārōgyaṁరు బయటి ఆటలు, యోగా. దాని ద్వారా శారీరక. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. 

 అవును.. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన జీవన ఉపాధికి  సమయం పోగా, మిగిలిన సమయాన్ని టీవీ ముందు, కంప్యూటర్ ముందో, చిట్ చాటింగ్ కో వాడుతున్నాడు.. కాస్త శారీరక శ్రమని కలిగించే ఆటలు గానీ, పనులని గానీ, యోగాసనాలు చెయ్యటానికి ప్రయత్నించడం లేదు.. 

నిజానికి మనిషి వయస్సు పెరుగుతున్నా కొలదీ తనలో వ్యాధి నిరోధకత లక్షణాలు తక్కువ అవుతూ ఉంటాయి. కండరాలు నెమ్మనెమ్మదిగా క్షీణతకి గురి అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు త్వరగానే జబ్బులకి గురి అవుతుంటారు. ఆ జబ్బుల నుండి బయటపడటానికి మందులు వాడుతుంటారు. కొద్దిరోజుల తరవాత జబ్బులు ఆ మందులకు స్పందించడం మానేస్తాయి. ఇంకా వ్యాధులు ముదరడం మొదవుతుంది. ఫలితముగా మందుల గోళీలు పుట్నాల మాదిరిగా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వేసుకున్నా ఫలితం అంతంత మాత్రమే. పైగా ఆర్ధిక భారం. ఇదంతా అవసరమా...? 

ఈరోజుల్లో కొందరు ఎంత సెన్సిటివ్ గా ఉంటున్నారూ అంటే - ఏసీ లేని ఇంట్లో - పగటి పూట కూడా స్వెటర్, మంకీ క్యాప్ లేకుండా ఉండటం లేదు.. ఇలా వృద్ధులు ఉంటే తప్పులేదు గానీ, యువకులు, యూత్ (30+) ఉంటున్నారు. వారిని చూస్తుంటే చాలా జాలేస్తున్నది. నిజానికి వీరికి ఆ అవసరం లేకుండా చెయ్యవచ్చును.

ప్రొద్దున్నే, లేదా సాయంకాలం సమయాల్లో - యోగా, వ్యాయామం చేస్తే లేదా ఆటలు ఆడితే శరీరానికి శారీరక శ్రమని కలిగించి, కాస్త క్రొవ్వు కరుగుతుంది, లోన కండరాల పటుత్వం పెరుగుతుంది. హార్ట్ బీటింగ్ బాగుంటుంది, శారీరక అందం బాగుంటుంది. 

వ్యాకర్ధ లక్షణాలు తక్కువ అవుతాయి. శరీరం మునుపటికన్నా మరింత క్రియాశీలముగా ఉంటుంది. శారీరకముగా బాగుంటాం.. మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది. క్రొత్తగా ఏదో ఆరోగ్యాన్ని మన శరీరానికి అటాచ్ చేసుకున్నట్లుగా భావిస్తాం కూడా. ఇలా ఉన్నప్పుడు మనలో ఆరోగ్యకరమైన ఆలోచనలు మొదలవుతుంటాయి. ప్రొద్దున్నే లేవాలి. 

వ్యసనాల జోలికి వెళ్ళకూడదు.. ఆరోగ్యకరమైన పనులని చెయ్యాలి అని తీర్మానించుకుంటూ ఉంటాం.. ఇదంతా అందరికీ తెలుసు.. కానీ అంతగా చెయ్యటానికి ఇష్టపడం.. అదే సమయాన యే బార్ కో, రెస్టారంట్ కో వెళ్ళి వినోదిద్దాం అంటే చాలామంది లగెత్తుకొని వస్తారు. ఫలితముగా భవిష్యత్తులో వేలల్లో.. కాదు కాదు లక్షల్లో హాస్పిటల్స్ లలో కుమ్మరించాల్సి వస్తుంది. 

సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top