భారత్ - టిబ్బెట్ - చైనా: Bhaarath,Tibet, Chinaభారత్ - టిబ్బెట్ - చైనా: Bhaarath,Tibet, China

భారత్ - టిబ్బెట్ - చైనా

భారతదేశం మరియు టిబ్బెట్ కు మధ్యన వేల సంవత్సరాల చారిత్రిక మరియు సాంస్కృతిక సంబంధం ఉంది 1950 కు ముందు భారతీయులు టిబ్బెట్ లోని కైలాశ పర్వతాన్ని దర్శించడానికి ఎవరైనా ఎలాంటి వీసా ప్రక్రియలు లేకుండా వెళ్ళడానికి వీలుగా ఉండేది , కానీ నేడు కైలాశ పర్వతాన్ని దర్శించాలంటే చైనా నుండి వీసా తీసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. టిబ్బెట్ దేశంలో ఆచరించే మతం బౌద్ధం శాంతి , సహనము, ప్రేమలకు ప్రతీక అయినటువంటిది. ఈ భౌద్దం పుట్టినది భారతదేశం అయినా కూడా భారత్ , చైనా , శ్రీలంక , మయన్మార్ , కాంబోడియా ఇలా అన్నీ తిరిగి టిబెట్ లో సుస్థిర స్థానం ను ఏర్పరుచుకున్నది .

టిబ్బేట్ యొక్క భౌగోళిక సరిహద్దులు మనం పరిశీలిస్తే టిబెట్ చైనాకు నైరుతి దిశలో ఉంది, ఇది భారతదేశం, నేపాల్, మయన్మార్ (బర్మా) మరియు భూటాన్ సరిహద్దులో ఉంది. టిబెట్ యొక్క చారిత్రక భూభాగం ప్రపంచంలోని 10 వ అతిపెద్ద దేశంగా మారుతుంది. ఈ రోజు ఇది చైనా ఆక్రమణలో ఉంది మరియు విభజించబడింది, పేరు మార్చబడింది మరియు చైనీస్ ప్రావిన్సులలో చేర్చబడింది చైనా టిబెట్‌ను సూచించినప్పుడు, దీని అర్థం చారిత్రాత్మక టిబెట్‌లో ఒక భాగం మాత్రమే: దీనికి చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్ (TAR) అని పేరు పెట్టారు.

భారతదేశం మరియు చైనా మధ్య యుద్ధం కు టిబెట్ లో స్థిరపడిన బౌద్దం కు సంబంధం ఏమిటి అని మనం ఆలోచిస్తే 1914 లో భారతదేశం బ్రిటిష్ పరిపాలకుల చేతిలో ఉన్నది .ఇక చైనా దేశం క్యుమింగ్ ట్యాంగ్ పరిపాలనలో Republic of CHINA గా కొనసాగుతున్నది. ఇక టిబ్బెట్ మాత్రం 13వ బౌద్ధ గురువు దలైలామా ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్టు , మరియు హిందువులు పరమ పవిత్రంగా కొలుచుకునే కైలాస పర్వతం , మరియు మానస సరోవరం వంటి ఎన్నిటికో starting point టిబెట్. టిబెట్ భువిలో వెలిసిన స్వర్గం లాగా కనిపిస్తుంది, శాంతి, అహింస వంటి పరమ ఉన్నతమైన జీవన సత్యాల ద్వారా మానవులను ఉన్నతమైన వారిగా తీర్చి దిద్దుతూ ఏ తగువు లేకుండా జీవిస్తుంటారు భౌద్దులు , అలాగే వారి సైన్యం కూడా చాలా వరకు సహనాన్ని కలిగి ఉంటుంది. అలా సైనిక బలగం పరంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే అంత దృడంగా లేకపోవడం వలన , ఇటు కమ్యూనిస్ట్ పాలనలోని సోవియట్ యూనియన్ , మరియు చైనా , అలాగే బ్రిటిష్ పాలన లోని భారతదేశం కూడా ఆక్రమించుకోవాలని చూశాయి. ఇలా ఎవరికి తోచిన ఎత్తులు వారు వేయడం ఆరంభించారు. ఇది గమనించిన 13 వ దలైలామా మనం ఎవరో ఒకరి సహకారం లేకపోతే భౌతిక దాడులుతో, తమ ప్రాంతంలో హింస చోటుచేసుకుంటుంది అనుకుని చివరికి బ్రిటిష్ ఆధ్వర్యంలోని భారతదేశం ను సహాయం కోరారు. వెంటనే 1914 లో చైనా మరియు టిబెట్ లు గ్రేట్ బ్రిటన్ ఆధ్వర్యంలో సరిహద్దు వివాదాల గురించి చర్చలు జరుపుకున్నారు. ఆ చర్చలలో భాగంగా inner Tibet ను చైనాలోకి , మిగిలిన outer Tibet భూభాగం ను దలైలామా ఆధ్వర్యంలో కి పరిపాలించుకోమని వివరించింది బ్రిటన్. అయితే విభజింపడం కోసం చర్చలు చేయడానికి వచ్చిన బ్రిటన్ కూడా టిబెట్ పై కన్నేసింది. విభజించినందుకు మాకేంటి లాభం అని అడిగింది. ఇక చేసేది లేక దలైలామా సరే south tibet గా పరిగణించే తవాంగ్ అనే ప్రాంతంను బ్రిటన్ కు ఇచ్చింది. ప్రస్థుతం ఈ తవాంగ్ అనబడే ప్రాంతం మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో అంతర్ భాగంగా ఉంది. అయితే inner tibet ను పొందిన చైనా ఆనందంను అటు ఉంచి , తవాంగ్ అనే ప్రాంతం ను బ్రిటీష్ ఆధ్వర్యంలోని భారతదేశం పొందడం ఏ మాత్రం ఓర్చుకోలేక , మధ్యలోనే అక్కడ నుంచి అలిగి tri - T పైన సంతకం చేయకుండా వెళ్లిపోయింది. ఇక outer Tibet పాలకుడుగా దలైలామా , మరియు tawang ప్రాంతం బ్రిటీష్ ఆధ్వర్యంలోని india లోకి చేర్చుకుంటున్నట్లు బ్రిటన్ లు Tri - T పై సంతకం చేసి తమ పాలనను జరుపుకోవాలని నిశ్చయించుకున్నాయి , ఈ సంధర్భంగా ఈ Tri - T సరిహద్దు విభాగం ను సమర్దవంతంగా పరిష్కరించిన" హెన్రీ మెక్ మహన్ " పేరు మీద INDIA - TIBET సరిహద్దు రేఖకు Mc Mahone line అని పేరు పెట్టారు .1914 లో జరిగిన ఈ టిబెట్ విభజన మొదటి సిమ్లా ఒప్పందం గా చెప్పుకుంటున్నాము. ఇక 1947 లో భారతదేశం కు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించింది .

అలాగే 1949 లో చైనాకు republic of Chaina పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ బలగాలు మావో ఆధ్వర్యంలో అధికారాన్ని చేజికించుకున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలే మావో ప్రభుత్వం 1950 లో outer Tibet పై దాడికి దిగి దలైలామా సైన్యం ను ఓడించింది. అప్పటికి అధికారంలో ఉన్న 14 వ దలైలామా పై ఒత్తిడి పెంచి బలవంతంగా 17. (Seventeen point ) అనే agreement పై ఒప్పందం చేయించుకున్నాడు మావో. ఈ ఒప్పందం ప్రకారం టిబెట్ ను Peoples Republic of CHINA భాగంలో ఉండేటువంటి ఒక atanumos ప్రాంతంగా ప్రకటించుకున్నాడు మావో . అంటే టిబెట్ చైనాలో అంతర్భాగం అయిపోయినట్లు అన్నమాట . కాకపోతే మత పరమైన వ్యతిరేకత ఏర్పడుతుందని భావించిన మావో టిబెట్ వరకు 14 వ.దలైలామా ఆధ్వర్యంలో నే పరిపాలన సాగేలాగా వెసలుబాటు కల్పించాడు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ చర్యను వ్యతిరేకించారు . చైనా అధికార దాహంతో యుద్దోన్మాద చర్యలకు దిగుతూ , చిన్న రాజ్యాల ను భయపెట్టి విలీనం చేసుకోవడం తప్పు అని చెప్పాడు . ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించగా , చైనా తో స్నేహం ఎక్కడ చెడిపోతుందో అని భయంతో నెహ్రూ ఈ దాడి ని సమర్థించాడు కూడా. అంతే కాకుండా నాడు బ్రిటన్ ప్రభుత్వం టిబెట్ కు భారతదేశంకు మధ్యన ఏర్పాటు చేసిన మెక్ మహోన్ సరిహద్దు రేఖను ఇది భారత చైనా సరిహద్దు రేఖ అంటూ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు . అలా చెప్పడమే కాక నాడు టిబెట్ విభజన చేసిన బ్రిటన్ ద్వారా భారతదేశం కు లభించిన తవాంగ్ ప్రాంతంలో 1951 లో మొదటి సారి భారత సైన్యం ను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం . దీనితో మావో కు ఇంకా కోపం పెరిగింది , పూర్తి టిబెట్ ను ఆక్రమించుకున్న చైనా కు నెహ్రూ హద్దులు గీయడమేమిటి ? అని మనసులోనే భారతదేశం పైన విధ్వంసం ను పెంచుకున్నాడు మావో . కానీ మావో యొక్క ఆంతర్యం తెలుసుకోలేని నెహ్రు , తవాంగ్ ప్రాంతం భారతదేశం దే అని చైనా అంగీకరించింది అనుకుని , హిందీ చైనా బాయీ బాయీ అని ప్రకటించాడు. అంతేకాకుండా 1954 లో చైనా లో పర్యటించిన నెహ్రు మావో ను అమాంతం పొగిడాడు కూడా. అలాగే మావో తో కలిసి 29 may 1954 న ఇరుదేశాల మధ్యన పంచశీల ఒప్పందం కూడా జరిగింది.

ఈ పంచశీల ఒప్పందం లోని సూత్రాలు:
  • 1 . రాజ్యాల ప్రాధేశిక సమగ్రత , సార్వభౌమత్వం పట్ల పరస్పర అవగాహన .
  • 2 . దురాక్రమణ కు పాల్పడకపోవడం .
  • 3 . ఇతర రాజ్యాల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకపోవడం .
  • 4 . సమానత్వం - ఉమ్మడి ప్రయోజనం .
  • 5 . శాంతియుత సహజీవనం .
అంతర్జాతీయ సంబంధాలలో ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుకగా పంచశీల సూత్రాలను వర్ణించవచ్చు. కానీ ఈ పంచశీల సూత్రాలలో ఉన్న చిన్న లోపం ఏమిటంటే టిబెట్ ప్రస్థావన లేకపోవడం, మెక్ మెహోన్ లైన్ గురించి పేర్కొనకపోవడం అనేది ఇక్కడ సమస్యగా మారింది . నెహ్రూ టిబెట్ చైనాది అని ఒప్పుకునట్లుగా అర్థం వచ్చింది ఇక్కడ, అలాగే భారత్ కు సంప్రాప్తించిన తవాంగ్ కూడా పూర్వము టిబెట్ లో భాగం కనుక , ఇప్పుడు టిబెట్ చైనాకు పోతే తవాంగ్ కూడా చైనాకు వెళుతుంది కదా అని ఆలోచించలేక పోయాడు నెహ్రూ .

ఇక మావో తన అరాచక నియంతృత్వ పాలనలో చైనా టిబ్బేట్ ప్రజలను ఆందోళన కు గురి చేస్తూ ఇబ్బందులు భయబ్రాంతులకు గురి చేయడంమొదలెట్టారు ..దీనితో విసుగు చెందిన టిబెట్ ప్రజలు చైనా సైన్యం పై 1956 లో గెరిల్లా దాడులు జరపడం మొదలుపెట్టారు . ఇంతలో మావో తన భూభాగం లోని జింగ్ జియాంగ్ నుండి , టిబెట్ ను కలుపుతూ అక్షయ్ చిన్ గుండా రహదారి ని నిర్మించినట్లు 1957 లో చైనా కు చెందిన ఒక పత్రిక లో కథనం వెలువడింది. ఇది విన్న కాంగ్రెస్ ప్రభుత్వంకు దిమ్మ తిరిగిపోయింది , నిజానికి అక్షయ్ చిన్ భారత భూభాగం. అయితే ఆ ప్రాంతమంతా బంజరు భూమి కావడంతో అక్కడికి ఎవరువస్తారు లే . అంటూ సరైన నిఘా కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.

మావో తీసుకువచ్చిన నూతన అవిష్కరణలు , great leap forward వంటి కఠినమైన నిర్ణయాలు చైనీయులు ను అనేక బాధలు , సమస్యలు ఆకలి చావులను కల్పించాయి . ఇది ఒక వైపు మావో ప్రభుత్వం పై అసహనం కలిగిస్తుంటే , మరో వైపు గెరిల్లా పోరాటాలు చేస్తున్న టిబెటియన్లు , మరియు దలైలామా యొక్క అహింసా బోధనలు చైనా ప్రజలను ఆకర్షించ సాగాయి . దీనితో కోపోద్రేకుడయ్యాడు మావో , ఇంకేముంది 1959 లో టిబెటియన్లు పై మారణహోమం జరిపాడు, దొరికిన వారిని దొరికనట్లుగా చంపేయండి ఆజ్ఞలు ఇచ్చాడు . అలాగే ప్రజలను తనకు వ్యతిరేకంగా పనిచేసేలా దలైలామా నేర్పిస్తున్నాడు అంటూ ఆయనను arrest చేయమంటూ ఉత్తర్వులు ఇచ్చాడు మావో. ఇది తెలుసుకున్న టిబెటియన్లు 10 march 1959 న దాదాపుగా , 3,00000 మంది లాసా లోని , ఫొటాలా లోని దలైలామా నివాసగృహం చుట్టూ గుమికూడి , చైనా సైన్యం టిబెట్ లోకి రాకుండా ప్రాణాలకు తెగించి పోరాటం చేసి, దలైలామా ను భారత్ కు తప్పించేశారు . ఈ పోరాటం లో టిబెట్ వీరులు వీరోచిత పోరాటం లో భారీగా ప్రాణనష్టం జరిగి అమరులయ్యారు టిబెటియన్లు . 1950 నుండి 1959 వరకు దాదాపుగా 86000 మంది టిబెట్ ప్రజలు మవో దాష్టీకం కు బలయ్యారు అని ఒక సమగ్ర సమాచారం . అలాగే టిబెటియన్ స్త్రీల పైన చైనా సైనికులు జరిపిన అత్యాచారాలు , శారీరక హింస కు అవధులు లేవు , చివరికి వారు వారి దేశంలో బ్రతకలేక సుమారు లక్షల సంఖ్యలో భారతదేశం కు వలస వచ్చేశారు . అలా ఇక్కడ కు వచ్చిన టిబెట్ ప్రజలు ఇక్కడే జీవించసాగారు ఇప్పటివరకు , ఆఖరికి వారి పార్లమెంట్ కూడా ఈ దేశంలో ఏర్పాటు చేసుకుని , ఇక్కడి నుంచి మాక్ పరిపాలన కొనసాగిస్తున్నారు . ఇలా 1959 నుండి దశాబ్దాల కాలంగా వారి దేశంలోకి పోకుండా కమ్యూనిస్ట్ లకు భయపడి ఇక్కడే జీవిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అది ఎంతటి రాక్షస పాలననో. బీజింగ్ నుండి పెద్ద ఎత్తున చైనా స్థిరనివాసులను టిబెట్‌లోకి బదిలీ చేయడం వల్ల అక్కడ జనాభా అసంతులనం కోసం ప్రయత్నం చేస్తున్నది ఇది 1949 నాల్గవ జెనీవా సదస్సు యొక్క తీవ్రమైన ఉల్లంఘన, ఇది పౌర జనాభాను ఆక్రమిత భూభాగంలోకి మార్చడాన్ని నిషేధిస్తుంది.

మెక్ మహోన్ లైన్ విషయంలో , మరియు దలైలామా పారిపోతే భారతదేశం ఆశ్రయం కల్పించడం వంటి చర్యల ద్వారా చైనా అప్రమత్తమయ్యారు . ఇక అప్పటి వరకు భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య ఉన్న సైన్యం ను మెక్ మహోన్ సరిహద్దు వెంబడీ కేటాయించింది భారతదేశం .దీనినే forward policy అని అంటారు . ఎప్పుడైతే మెక్ మహోన్ లైన్ వెంబడి సైనికులు ను భారతదేశం కేటాయించిందో అప్పటికే భారత దేశం పై కోపం పైన ఉన్న మావో , వెంటనే నెహ్రూ ప్రభుత్వం కు ఒక లేఖ వ్రాశాడు మావో , ఆ లేఖ సారాంశం ఏమిటంటే తవాంగ్ ను మీరు తీసుకోండి , అక్స్కైచింగ్ ను మాకు వదిలేయండి అని అర్థం అన్నమాట. నిజానికి రెండు భారత భూభాగాలే చైనా మనకు ఇచ్చేదేమీ లేదు ఇందులో . ఇలా భారతదేశం కు చైనా కు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి ఉంటే , నెహ్రూ మాత్రం United Nation Security Council శాశ్వత సభ్యత్వం కు United states ద్వారా భారతదేశం కు వచ్చిన అవకాశం ను తిరస్కరిస్తూ చైనా పేరును ప్రతిపాదించాడు. నాడు ఈ అవకాశం ను వదులుకోవడం వలన మనమెంత నష్టపోయామో మొన్న మసూద్ అజహర్ విషయంలో కల్లకు కట్టినట్లు కనిపించింది . నెహ్రూ అలా ఆ రోజు ఎందుకు చేశాడో ? ఎవరికీ తెలియదు. బహుశా ఇలా చేస్తేనైనా మావో కోపం కొంత తగ్గుతుంది అనుకున్నాడో ఏమో మరి ? కానీ అధికార దాహం , ప్రపంచం గుర్తించాలన్న నియంతృత్వంతో తన స్వంత ప్రజానీకం నే హింసించి చంపుకున్న మావో నెహ్రూ అందించిన తాయిలాలు కు లొంగిపోతాడు అనుకోవడం నెహ్రు యొక్క మూర్కత్వపు ఆలోచన గా మనం చెప్పుకోవచ్చు . 

మావో నిరంకుశ విధి విధానం వలన బాధించబడిన చైనీయులు నుంచి వస్తున్నవ్యతిరేకత ను మళ్లించడం కోసం 1962 october 20 న భారతదేశం పై యుద్ధం ను ప్రకటించినాడు మావో. వాస్తవానికి ఇది యుద్ధం అనడం కంటే ఒక నమ్మక ద్రోహం కు ప్రతీకగా చెప్పుకుంటే బాగుంటుంది . అలాగే మరో విధంగా చెప్పుకోవాలంటే భారతదేశ పరిపాలన ఒక షోకుల రాయుడు అయినటువంటి ఒక అసమర్ద పాలకుడి చేతిలో పరిపాలన పెడితే ఎలా నాశనం చేయబడుతుందో అనే దానికి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. పాముకు పాలు పోసి పెంచినా అది కాటు వేసి తీరుతుంది అనే విషయం మరిచి చైనాను United Nation of security కి సిఫార్సు చేసి మా మధ్య అన్ని సమస్యలు తీరిపోయినాయి , మేము మిత్రులమే అనే భావంతో , సైనికుల ను , సైనిక ఆధునీకరణ ను మరియు సరిహద్దు ల భద్రత ను నిర్లక్ష్యం చేశాడు నెహ్రూ .అది ఎంతలా అంటే సైనికులు వద్ద అత్యాధునిక సామాగ్రి కాదు కదా కనీసం బ్రిటిష్ కాలం నాటి తుప్పు పట్టిన ఆయుధాలు కు సైతం సరిగా మరమ్మతులు కూడా చేయించలేదు , అదే కాక ఆ సమయం లో సైనికుల కు అవసరమైన ఆహార నిల్వలు కేవలం పది రోజులకు సరిపడేవి మాత్రమే ఉన్నాయి భారతీయ సైనికులకు సరైన ఆయుధ సామాగ్రి లేక సమయానికి ఆహారం లేక భారత సైనికులు మావో సైన్యం పై ప్రాణాలు పణంగా పెట్టి వీరోచితంగా పోరాడారు .ఈ యుద్ధ సమయం లో భారతదేశం లోని కమ్యూనిస్ట్ చైనా ప్రేమికులు మన సైనికులు కు ఆహారం ఆందజేయనీకుండా అంతర్గత సమస్యలను సృష్టించి రాస్తారోకో లు చేపట్టారు ఇంకో వైపు మందుగుండు సామగ్రి తయారీ కర్మాగారాలలో కమ్యూనిస్ట్ కార్మిక సంఘాలు పనిని నిలిపివేసి నిరసన హెపట్టారు .దానితో భారత సైనికులు విలవిలలాడుతూ చైనా సైనికులు చేతిలో దాదాపుగా 1696మంది సైనికులు చనిపోయారు ,1047 మంది తీవ్రంగా గాయపడ్డారు ,1696 మంది సైనికులు ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు , 3968 మంది సైనికులు యుద్ద ఖైదీలు గా చైనా బంధించింది .దాదాపుగా 42,732 squre kilometers ల భారత భూభాగం ను చైనా ఆక్రమించింది .అలాగే చైనా ఆక్రమించిన భారత భూభాగం లోని ప్రజలను ఊచకోత కోశారు .అలాగే ఆ ప్రాంతంలో నివాసమున్న స్త్రీల పై అత్యాచారాలు జరిపారు 31( 20 th అక్టోబర్ నుండి 21 నవంబర్ 1962 ) రోజుల పాటు సాగిన ఈ యుద్ధం లో భారతదేశం తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొని , చరిత్ర లో మరచిపోలేని గుణపాఠం ను కమ్యూనిస్టుల ద్వారా నేర్చుకుంది .

మన దేశానికి వ్యతిరేకంగా చైనా దశాబ్ధాల తరబడి భౌతిక, ఆర్థిక, వ్యూహాత్మక, దౌత్యదౌర్జన్యాన్ని కొనసాగిస్తుండడం సుదీర్ఘ పూర్వరంగం. ఈ దౌర్జన్యం, ఈ దురాక్రమణ 1949నుండి కొనసాగుతోంది.1949వ, 1959వ సంవత్సరాల మధ్య చైనా టిబెట్‌ను దురాక్రమించడం, దిగమింగడం మన దేశానికి వ్యతిరేకంగా చైనా దురాక్రమణ మొదలుకావడానికి ఏకైక ప్రాతిపదిక.1949కి పూర్వం వలె టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండినట్టయితే చైనాతో మనకు సుదీర్ఘమైన సరిహద్దు ఏర్పడి ఉండేది కాదు. చైనా మన దేశంపై 1962లో దురాక్రమించడానికి 1959నుంచి మన లడక్‌లోకి చొరబడడానికి ఏకైక కారణం టిబెట్‌ను చైనా అక్రమంగా ఆక్రమించుకొనడం. టిబెట్ మన దేశానికి ఉత్తరంగాను, చైనాకు దక్షిణంగాను 1959వరకు నెలకొని ఉండిన స్వతంత్ర దేశం. 1959 తరువాత కూడ యథాపూర్వంగా ఈ భౌగోళిక స్థితి కొనసాగి ఉండినట్టయితే టిబెట్‌ను- దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంకల సువిశాల టిబెట్‌ను- దాటుకొని వచ్చి చైనా 1962లో మన దేశంలోకి చొఱబడి ఉండేది కాదు, మన జమ్మూకశ్మీర్‌లోని ఈశాన్య ప్రాంతంగుండా టిబెట్‌నూ తమ అధీనంలో ఉన్న ‘సింకియాంగ్’నూ కలుపుతూ రహదారులను నిర్మించి ఉండేది కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం తన దురాక్రమణలో ఉన్న మన కశ్మీర్ ఉత్తర భాగంలో చైనాకు దాదాపు ఆరువేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పగించి ఉండేది కాదు. ‘పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్’లో చైనా పారిశ్రామిక పథకాలను ప్రారంభించగలిగి ఉండేది కాదు. టిబెట్‌ను చైనా దురాక్రమించిన తరువాతనే ఇవన్నీ జరిగిపోయాయి. భారత దేశ సరిహద్దుల భద్రతకు టిబెట్ యొక్క సార్వభౌమత్వా పరిరక్షణ అనేవి పరస్పరం ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి భారత దేశ ప్రభుత్వం టిబ్బేట్ యొక్క సార్వభౌమత్వా పరిరక్షణకు వారు చేస్తున్న స్వాతంత్ర పోరాటానికి మద్దతుగా నిలబడాలి.
జైహింద్

రచన: శ్రీ కట్ట రాజ్ గోపాల్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top