నోటి దుర్వాసనకు ఆయుర్వేద పరిష్కారములు - Noti Durvasana, Bad Oral Smell

0

నోటి దుర్వాసనకు ఆయుర్వేద పరిష్కారములు - Noti Durvasana, Bad Oral Smell
న నోరు మనకే కంపు వేసే పరిస్థితి వస్తే ఇతరులకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మరి దీన్ని పోగొట్టుకోవడం ఎలా.. మనచేతిలోనే ఉంది పరిష్కారం. మన ఆహార అలవాట్లలో కాస్త మార్పులు చేసుకుంటే చాలు.. దుర్వాసన దెబ్బకు దిగి కిందికి వస్తుంది

మనం తినే పదార్ధాల వాసనల ప్రభావం మనం విడిచే గాలి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన పదార్ధాల విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత రక్తప్రసరణ వ్యవస్థలో కలిసిపోతాయి. అయినా ఆయా పదార్ధాల తాలూకూ వాసనలు పూర్తిగా పోవు. అక్కడి నుంచి ఆ రక్తం ఊపిరి తిత్తుల్లోకి వెళ్తుంది. అందుకే మనం శ్వాస విడిచిపెట్టినప్పుడు.. మనం ఎప్పుడో తిన్న పదార్ధాల వాసన బయటకు వస్తుంటుంది. మన శరీరం ఆ ఆహారాన్ని పూర్తిగా బయటకు విసర్జించేంత వరకూ కూడా ఏదో రూపంలో ఆ వాసన వెలువడుతూనే ఉంటుంది.

నోటి దుర్వాసనకు కారణాలు:
 • ➛ అన్నాశయం లోని పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన కల వాయువులను ఏర్పరుస్తుంది. ఇవి నోటినుండి బయటకు వదలబడుతాయి.
 • ➛ గొంతు నందలి ఇన్ఫెక్షన్ మరియు పళ్ళ యందలి వాపు కారణంగా ఎర్పడిన చీము మరియు రక్తము అక్కడ నిలిచి, కుళ్ళి ధుర్గంధమైన వాసనను కలిగించును.
 • ➛ చిగుళ్ల వ్యాధులు, దంతాల మధ్య పాచిపేరుకోవటం వంటివి కూడా ముఖ్యకారణాలే.
 • ➛ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళలో ఇది సాధారణం గా ఉంటుంది .
 • ➛ సాధారణంగా పళ్ళు, నోరు అపరిశుభ్రంగా వున్నందున నోటి దుర్వాసన వస్తుంది.
 • ➛ నోటిలోని చిగుళ్ళు ఇన్ ఫెక్షను వల్ల కూడ రావచ్చును.
 • ➛ మసాల పదార్ధములతో తయారు చేసిన ఆహార పదార్ధములు తీసుకొన్నపుడు దుర్వాసన వచ్చే అవకాశం వుంది.
 • ➛ సాధారణంగా నోరు తడిలేని వారికి రావచ్చును.
 • ➛ దీర్ఘకాలక, శ్వాసకోశవ్యాదులు, ముక్కుకు సంబంధించిన వ్యాదులు కూడ కారణం కావచ్చును.
 • ➛ పొగాకు నమలడం, బీడీ, సిగరెట్ మొ||నవి వాడడం కారణంకావచ్చును.
తీసుకోవలసిన జాగ్రత్తలు:

దీనికి ఇది కేవలం బ్రష్‌ చేసుకోవటం, మౌత్‌వాష్‌ల వంటివి వాడటంతో తగ్గిపోయే సమస్య కాదు. ఇలాంటి సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే దంతవైద్యులను సంప్రదిస్తే తగిన కారణాలను అన్వేషిస్తారు.
 • ➣ నోటిని శుభ్రంగావుంచాలి.
 • ➣ రోజుకు రెండు సార్లు పళ్ళను శుభ్రము చేయాలి.
 • ➣ ఆహారం తీసుకొన్నతరువాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
 • ➣ మెత్తని ప్లాస్టిక్ నాలుక పుల్లతో నాలుకను శుభ్రపరచాలి.
 • ➣ కట్టుడు పళ్ళువున్న క్రమము తప్పక శుభ్రము చేసుకోవాలి.
 • ➣ వీలైనంత ఎక్కువగా నీరు తీసుకొవాలి.
 • ➣ అన్నివేలల నాలుకను తడిగా వుండే విధంగా చూసుకోవాలి.
 • ➣ నోటిని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అంటే దీనర్థం మంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలనే.. మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే షుగర్ ఫ్రీ గమ్ నమలడం. దీనిని నమిలితే నోటిలో లాలాజలం ఊరుతుంటుంది.
 • ➣ చిగుళ్ల సమస్యల్ని తగ్గించుకోవటం,
 • ➣ అవసరమైతే ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవటం వంటివన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన
ఆయుర్వేద చికిత్స:
 • ➣ ప్రతి రోజూ లవంగం నోట్లో వేసుకుని చప్పరించండి. దీంతో దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది.
 • ➣ ప్రతి రోజూ గురివింద వేరును తింటేకూడా నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.
 • ➣ నిత్యం ఒక గ్లాసు నీటిలో తాజా నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే నోటి దుర్వాసన తొలగిపోతుంది.
 • ➣ నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతి రోజూ తులసి ఆకులు నమిలి తింటే నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుంది.
 • ➣ రాత్రిపూట పడుకునే ముందు బ్రష్ చేస్తారు కదా. దానికి ముందుగా రెండు మిరియాల గింజలను నోట్లో వేసుకుని నమలండి. ఆ తర్వాత బ్రష్ చేయండి. దీంతో నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుంద.
 • ➣ వేంచిన జిలకర నమిలితేకూడా ఉపశమనం కలుగుతుంది.
 • ➣ పుదీనా ఆకులు నమిలి తినాలి. పుదీనా రసం నీటిలో కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకులు పొడుముతో దంతధావన చేయాలి. దంతవ్యాధులకు పుదీనా మంచి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ ఆకులు బాగా, ఎక్కువసేపు నమిలి తింటుంటే దంత సంబంధిత సమస్యలు తలెత్తవు.
 • ➣ ఒక కప్పు రోజ్ వాటర్‌లో అర చెక్క నిమ్మకాయ రసాన్ని అందులో కలపండి. దీనిని ఉదయం-సాయంత్రం రెండుపూటలా పుక్కలించండి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది. దంతాలుకూడా గట్టిపడుతాయ.
 • ➣ నిప్పుమీద కాల్చిన మొక్కజొన్నను తింటే దంతాలు దృఢంగా తయారవుతాయి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.
రచన: డా శేషగిరిరావు గారు 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top