నాసికా - సైనసైటిస్ కి నస్య ఔషధం - లవణ ద్రావణ చికిత్స - sinusitisసైనసైటిస్ కి నస్య ఔషధం - లవణ ద్రావణ చికిత్స

ఇది సైనసైటిస్, ఎలర్జీలు, ముక్కు కారటం, జలుబు, ఫ్లూ సమస్యలు ఉన్నవారికి అనువైనది. చెవుల సమస్యలు కలిగినవారికి మంచిది కాదు. సైనస్ లు విడుదల చేసే స్రావాలు ముక్కులోపలకు స్రవించడానికి అడ్డు ఏర్పడడంతో బ్యాక్టీరియా దాడి చేసి సైనసైటిస్ ఇంఫెక్షన్ ను కలిగిస్తాయి.ఇలా సైనస్ లు మూసుకుపోతాయి.

దీనికి లవణ ద్రావణ చికిత్స బాగా ఉపయోగపడుతుంది.ద్రావణం సాంద్రత ఎక్కువ కనుక మ్యూకస్ పొరల్లోని అదనపు ద్రవాంశాన్ని వెలుపలకు లాగేస్తుంది.దీనితోపాటు లోపల స్నిగ్ధత్వం పెరగటమే కాకుండా,శోధ వంటివి తగ్గుతాయి.

లవణ ద్రావణ తయారీ విధానం:
  • ➣ 1-2 కప్పుల గోరు వెచ్చటి నీళ్లు తీసుకొని 1/4 నుండి 1/2 టీ స్పూన్ ఉప్పు పలుకులను ( అయోడిన్ కలపని సముద్రపు ఉప్పు ),చిటికెడు వంటసోడా లను కలపాలి.
  •  వాష్బేసిన్ వద్దకు వెళ్లి 45 డిగ్రీల కోణంలో వంగి నిలబడాలి.తలను ఒక పక్కకు వంచాలి.లవణ ద్రావణాన్ని నాసిక లోపలకు పోయలి.
  • ➣ నాజిల్ ను ముక్కు రంధ్రం లోపలకు ఒక అంగులం లోపలకు మాత్రమే చొప్పించాలి. ఈ సమయంలో నోటితో గాలి పీలుస్తుండాలి. ఉప్పునీళ్లు ముక్కు అంతర్భాగం నుండి , నోటి నుంచి ధారగా కారతాయి.ఈ నీళ్లను మింగకపోవడం మంచిది. రెండవ నాసికతో కూడా ఇదే విధంగా రిపేట్ చేయాలి. ముక్కును శుభ్రం చేసుకొని రెండవ నాసికతో ఇదే క్రమాన్ని తిరిగి చేయాలి. తరువాత మిగిలిన ద్రవాన్ని పారబోసి,సామాగ్రిని ఆరబెట్టి జాగ్రత్త చేసుకోవాలి.
  • ➣ మండుతున్నా, నొప్పిగా అంపిస్తున్నా ఉప్పు మోతాదును తగ్గించండి,తలను వెనక్కి వంచవద్దు.నోరు తెరచి ఉంచి కేవలం నోటితో మాత్రమే శ్వాస తీసుకోండి.
  • ➣ ఒకటి రెండు సార్లు చేసిన వెంటనే మీకు ఫలితాలు కనిపిస్తాయి.చికిత్సను కొనసాగిస్తున్న కొద్దీ ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి.
ఈ చికిత్సను రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే సరిపోతుంది.లక్షణాలన్నీ పూర్తిగా సమసిపోయిన తర్వాత వారానికి మూడుసార్ల చొప్పున తీసుకుంటూ ఉంటే లక్షణాలు తిరగబెట్టకుండా ఉంటాయి.

సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top