ధృడమైన ఆరోగ్యకరమైన శరీరానికి "చద్దన్నం మూట" - Dhr̥uḍamaina ārōgyakaramaina śarīrāniki chaddannaṁ mūṭa

పెద్దల మాట చద్దన్నం మూట

పాతతరం పెద్దలు నేటి తరానికి ఏదైనా చెబితే ఆ... ఏముందిలే, పాత చింతకాయ పచ్చడి అని అంతా తీసిపారేస్తారు. వారు చెప్పే మాటలకు విలువనివ్వరు. కానీ నిజంగా పెద్దలు చెప్పే మాటలే కాదు, వారు తిన్న ఆహారం కూడా ఎంతో విలువైందే.

అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వారు తేల్చి చెప్పింది కూడా ఇదే. ఇంతకీ వారు చెప్పింది దేని గురించో తెలుసా.. మజ్జిగ కలిపిన చద్దన్నం. రాత్రి మిగిలి పోయిన అన్నాన్ని పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాత్రి అన్నం ఎంత ఉన్నా పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని చేస్తూ ఉంటారు. అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు ఉన్నాయి. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది.

పాతతరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినేవారు. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేది తాతల కాలంలో రాత్రి వండిన అన్నంను పొద్దున్నే పెరుగు కలుపుకుని, మామిడి కాయ చట్నీ వేసుకుని, పచ్చి మిర్చి, ఉల్లిగడ్డ నంజుకుని తినేవారు.

అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల పెరిగే పోషకాలు ఎన్నో ఉన్నాయి. 
  • ➧ 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. 
  • ➧ అలాగే పోటాషియం, కాల్సియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ➧ రాత్రి మిగిలిన అన్నంలో మజ్జిగ, ఉప్పు కలిపి కుండలో పెడితే ఉదయం అయ్యే సరికి ఆ అన్నం పులిసి మంచి పోషకాలతో రెడీ అవుతుంది. లేదంటే రాత్రి పూట అన్నం వండి అందులో కొన్ని పాలు పోసి తోడుకోవడం కోసం ఓ మజ్జిగ చుక్కను వేసినా ఉదయం లేచే సరికి మజ్జిగ, చద్దన్నం తయారుగా ఉంటుంది. 
  • ➧ దీన్ని పచ్చడితోనో, ఉల్లిపాయ, మిరపకాయలతోనో మనవాళ్లు ఉదయాన్నే తినేవారు. 
  • ➧ దీంతో వారు రోజంతా ఎంతో ఉత్తేజంగా, శక్తితో ఉండేవారు. అలా వారు అప్పటికీ, ఇప్పటికీ అదే శక్తితో ముందుకు సాగుతున్నారు.
అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ సంస్థ చేసిన పరిశోధన ప్రకారం సాధారణ అన్నం కన్నా పైన చెప్పిన విధంగా తయారైన చద్దన్నంలో ఐరన్, పొటాషియం, కాల్షియం. విటమిన్లు దాదాపుగా 20 రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిసింది.
  • ➧ చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
  • ➧ పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుందని, బీపిని కంట్రోల్లో ఉంచుతుందని తేలింది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనే మాట నేటికి వినిపిస్తోంది.

_జాగృతి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top