రుద్రాక్షలు | రుద్రాక్ష ధారణ వలన ప్రయోజనం - Rudraksha Upayogalu


రుద్రాక్షలు అంటే ఏమిటి.? అవి ధరిస్తే చేకూరే ప్రయోజనాలేంటి.?
 • రుద్రాక్ష అంటే : రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం.  రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ వేదాంతులు, గురువులు, పూజారులు లాంటివారు వీటిని ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట వీలుకాని నియమ నిబంధనలను పాటించనివారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట గమనిస్తూనే ఉన్నాం.
 • రుద్రాక్షలు : రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు బాదంకాయ లాగ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుదించుకుని గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున గల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.
 • రుద్రాక్షలు రకాలు :  వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యా పరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెప్పబడినది. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని చెబుతారు. రుద్రాక్షల వివరాలు క్రింది తెలియజేయబడినవి.
 • ఏకముఖి ( ఒక ముఖము కలిగినది ) : అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర, తంత్ర ప్రయోగాలనైనా తిప్పి కొట్టె శక్తిగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.
 • ద్విముఖి ( రెండు ముఖములు కలిగినది ) : దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు. ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధికల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది.
 • త్రిముఖి ( మూడు ముఖములు కలిగినది ) : దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్పదోష నివారణ అగును.
 • చతుర్ముఖి ( నాలుగు ముఖాలు కలిగినవది ) : నాలుగు వేదాల స్వరూపం. పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అధికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.
 • పంచముఖి ( అయిదు ముఖాలు కలిగినది ) : పంచభూత స్వరూపం. బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.
 • షణ్ముఖి ( ఆరు ముఖములు కలది ) : కార్తీకేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియాను పోగోడుతుంది. ఈ రుద్రాక్ష కుమారస్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.
 • సప్తముఖి ( ఏడు ముఖాలు కలిగినది ) : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. సభావశ్యత, సంపద, కీర్తి , ఉత్తేజం కల్గును.
 • అష్టముఖి ( ఎనిమిది ముఖాలు కలిగినది ) : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.
 • నవముఖి ( తొమ్మిది ముఖాలు కలది ) : నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.
 • దశముఖి ( పది ముఖాలు కలిగినది ) : దశావతార స్వరూపం. శ్రీ మన్నారాయణుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.
 • ఏకాదశముఖి ( పదకొండు ముఖాలు కలిగినది ) : ఇది శివాత్మకమైన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందమునకు, గర్భ సంబంధ రోగాలకు అనుకూలత లభించును.
 • పూజ ( దీక్ష )లలో వినియోగించే రుద్రాక్ష మాల సంఖ్య: రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజ జరిపించి నిర్ణీతమైన ముహూర్తంలో మెడలో ధరించవలెను. వీటిని జప మాలగా కూడా ఉపయోగించవచ్చును.
 • వైద్యంలో రుద్రాక్షలు: రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అందరూ ధరించవచ్చును.
మీ నక్షత్రమునకు ధరించవలసిన రుద్రాక్ష:
 • ❊ అశ్వని - నవముఖి
 • ❊ భరణి - షణ్ముఖి
 • ❊ కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి
 • ❊ రోహిణి - ద్విముఖి
 • ❊ మృగశిర - త్రిముఖి
 • ❊ ఆరుద్ర - అష్టముఖి
 • ❊ పునర్వసు - పంచముఖి
 • ❊ ఆశ్లేష - చతుర్ముఖి
 • ❊ మఖ - నవముఖి
 • ❊ పుబ్బ - షణ్ముఖి
 • ❊ ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి
 • ❊ హస్త - ద్విముఖి
 • ❊ చిత్త - త్రిముఖి
 • ❊ స్వాతి - అష్టముఖి
 • ❊ విశాఖ - పంచముఖి
 • ❊ అనురాధ - సప్తముఖి
 • ❊ జ్యేష్ఠ - చతుర్ముఖి
 • ❊ మూల - నవముఖి
 • ❊ పూర్వాషాఢ - షణ్ముఖి
 • ❊ ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి
 • ❊ శ్రవణం - ద్విముఖి
 • ❊ ధనిష్ట - త్రిముఖి
 • ❊ శతభిషం - అష్టమ
 • ❊ పుష్యమి - సప్తముఖి
 • ❊ పూర్వాభాద్ర-పంచముఖి
 • ❊ ఉత్తరాభాద్ర-సప్తముఖి
 • ❊ రేవతి-చతుర్ముఖి

సనాతన ధర్మస్య రక్షిత-రక్షతః

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top