నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

9, ఆగస్టు 2020, ఆదివారం

తమ పూర్వికులదైన హిందూ మతంలోకి తిరిగి వచ్చిన 50 ముస్లిం కుటుంబాలు - 50 Muslim families embrace Hinduism in Rajasthan, say ancestors were Hindus


హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని శ్రీ నరేంద్రమోడీ చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. 

ఈ  సందర్భంలో రాజస్థాన్ లోని బార్మేర్ నగరానికి చెందిన పాయల్ల కల్లా గ్రామపంచాయతీ లోని 50 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది తమ పూర్వికులదైన హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగినప్పుడు ఈ కుటుంబాలు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మౌళి అనే పవిత్ర దారాన్ని కట్టుకొని తిరిగి  హిందూ మతాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవానికి తాము హిందువులమేనని, కాంచన్ దాది సామాజిక వర్గానికి చెందిన వారమని చెప్పారు.. తమ పూర్వీకులు మొగల్ ఇస్లామిక్ దురాక్రమణదారుల  చేత బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారని తెలిపారు. అయినా తాము హిందూ ఆచారాలను అనుసరించామని, హిందూ పండుగలను కూడా జరుపుతున్నామని తెలిపారు..

పవిత్ర రామమందిర నిర్మాణం సమయంలో తాము తిరిగి హిందూ మతంలోకి రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మూలము: Opindia - విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)
« PREV
NEXT »