హైందవ ధర్మ హంతకుడు, ఘోరీ మహ్మద్: Destroyer of Hinduism, Ghori Muhammad

ఘోరీ మహ్మద్ క్రీ.శ. 1175-1205 మధ్య భారతదేశంపై వచ్చిన మరొక తురుష్క పాలకుడు. ఘోరీ మహ్మద్ ఇతడి అసలు పేరు ముయు దండెతి జుద్దీన్ క్రీ.శ.1173లో ఘోరీ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఘోరీ మహ్మద్ విశాల ఇస్లాం సామ్రాజ్య స్థాపన లక్ష్యంతో హిందువులపై దాడులు కొనసాగించాడు.

ఘోరీ మహ్మద్ లక్ష్యాలు:

  • ➣ భారతదేశంలో హిందువుల విగ్రహారాధనను నిర్మూలించడం. 
  • ➣ భారతదేశ హిందువుల సిరి సంపదలను దోచుకోవడం.
  • ➣ భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం.
  • ➣ భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని నెలకొల్పడం.
  • ➣ భారతదేశంపై శాశ్వత ప్రాతిపదికన ముస్లిం రాజ్య సార్వభౌమాధికారాన్ని నెలకొల్పడం.

దండయాత్రలు:

భారతదేశంలో నెలకొన్న అస్థిరత, స్వదేశీ రాజపుత్ర పాలకుల్లో దూరదృష్టి లేకపోవడం, అనైక్యత లాంటి అంశాలు అతడికి కలిసొచ్చాయి. ఘోరీ భారతదేశంలో తన తొలి దండయాత్రలో  దండయాత్రలో గుజరాత్ పాలకుడు భీమ్ దేవ్ (బీమదేపుడ్ని)ను ఓడించి ప్రాంతాన్ని ఆక్రమించాడు. 1179లో పెషావర్ ప్రాంతం పై విజయం సాధించాడు. సింధు ప్రాంతం మొత్తం అతడి వశమైంది.

ఘోరీ మహ్మద్ దండయాత్రలు:
తరైన్ యుద్ధాలు, చంద్ వార్ యుద్ధం, ఘోరీ పంజాబ్ ఆక్రమణ అనంతరం తన దృష్టిని ఢిల్లీపై కేంద్రీకరించాడు.  చౌహాన్ వంశస్థుడైన మూడో పృధ్వీరాజ్ చౌహాన్ పరి అనిహిల్ వాడ్ పాలిస్తున్నాడు. పృధ్వీరాజ్ అసమాన ధైర్య, సాహసాలు కలిగిన పాలకుడు. 
వీరి మధ్య 1191, 1192ల్లో రెండు తరైన్ యుద్ధాలు జరిగాయి. 1191 నాటి మొదాటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ ఘోరీని ఓడించాడు. కానీ 1192 నాటి రెండో తరైన్ యుద్ధంలో ఘోరీ పృధ్వీరాజ్ ను వధించి డిల్లీ, అజ్మీర్లను అక్రమించాడు. 

భారతదేశంలో తను ఆక్రమించిన ప్రాంతాలపై తన ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమించాడు. 1198లో దండెత్తి వచ్చిన ఘోరీ కన్జ్ పాలకుడు గహద్వాల వంశరాజు జయచంద్రుడ్ని చంద్ వార్ యుద్ధంలో ఓడించి, అతడి రాజ్యాన్ని ఆక్రమించాడు.

ఈ దండయాత్ర సమయంలోనే ఘోరీ సేనలు కాశీ సమీపంలోని వేల కొలదీ దేవాలయాలను ధ్వంసం చేశాయి.  1206లో ఘోరీ బయానా, గ్వాలియర్ ప్రాంతాలపై దండెత్తాడు. ఘక్కర్లనే తెగ ప్రజలను అణచివేయడానికి ఈ దాడి చేశాడు. కానీ తిరుగు ప్రయాణంలో వారి ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 1210లో అతడి ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.  ఘోరీ మహ్మద్ ను భారతదేశంలో ఇస్లాం రాజ్యస్థాపనకు పునాది వేసిన పాలకుడిగా, కుతుబుద్దీన్ ఐబక్ ను ఇస్లాం సామ్రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు.

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top