చెన్నై: స్థానిక మసీదు కమిటీ ఆక్రమించిన 10 ఎకరాల ఆలయ భూమిని తిరిగి ఇచ్చిన అక్కడి కలెక్టర్ - Chennai: 10 acres of Temple land restored by Collector after encroachment by local mosque committee

క్తులు, ఆలయ కర్తలు రెండు దశాబ్దాల పోరాటం తర్వాత చెన్నైలోని విరుగంబక్కం ప్రాంతంలోని అరుల్మిగు సుందర వరదరాజ పెరుమాళ్ ఆలయానికి చెందిన పది ఎకరాల భూమిని స్థానిక మసీదు కమిటీ నుండి కలెక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు స్వరాజ్యం పత్రిక నివేదించింది.

ఆక్రమణకు గురైన, అదే ఆలయానికి చెందిన 2.5 ఎకరాల చెరువును తిరిగి ఆలయానికి ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి కలెక్టర్ స్పందించలేదు. 1997 లో చెరువులో ఎండిపోయి నిర్జీవంగా మారిపోయింది, దాని ప్రక్కనే సుంగువార్ బ్రాహ్మణ సమాజం దానం చేసిన 14 ఎకరాల భూమిని కూడా స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నించారు.

స్థానిక మసీదు కమిటీ ప్రభుత్వ సిబ్బంది సహాయంతో ఆక్రమించిన 3 ఎకరాల భూమిని తమ పేరుతో నమోదు చేసుకోగలిగింది. దీనిని వ్యతిరేకిస్తూ వెంటనే హిందూ మున్నాని, ఆలయ కర్తలు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు.

ఈ విషయంలో టెంపుల్ ఆరాధకుల సంఘం అధ్యక్షుడు టి ఆర్ రమేష్ పిల్ దాఖలు చేయగా, మద్రాస్ హైకోర్టు అతని వాదనలను అంగీకరించి రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టరు పిలిచినప్పుడు మసీదు కమిటీ ప్రతినిధులు రాలేదు. దర్యాప్తు రెండేళ్ల తర్వాత కూడా ఫలవంతమైన ఫలితాలను ఇవ్వలేదు. చెరువును అభివృద్ధి చేసేందుకు ఆలయ చెరువును తిరిగి పొందాలని ఆలయ కార్యకర్త జెబమణి మోహన్రాజ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ విషయం విన్న న్యాయమూర్తి ఆలయ భూ సమస్యపై దర్యాప్తునకు ముందే ఆదేశించారు. కలెక్టర్ తన దర్యాప్తును వెంటనే పూర్తి చేసి, అక్కడ ఒక చెరువు ఉందా అని నిర్ధారించమని ఆదేశించారు. అప్పటి నుండి, ఈ విషయం కోర్టులలో నలుగుతోంది.

దర్యాప్తులో భాగంగా 1910 నాటి రికార్డుల ప్రకారం భూమి యొక్క యాజమానులు సుంగువార్ బ్రాహ్మణ సమాజంకే హక్కు ఉన్నట్లు రికార్డులో చూపబడింది. తద్వారా భూమిని తాలూకా  హక్కులు ఆలయ బోర్డుకు చెందుతాయని పునరుద్ధరించారు. అయితే, చెరువుకు సంబంధించి ఎటువంటి తీర్పు వెలువడలేదు. ఈ విషయంపై మోహన్‌రాజ్ మళ్లీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు స్వరాజ్యం పత్రిక తెలిపింది.

Source: Op

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top