బెంగళూరు అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. బయటపడ్డ ఆందోళన కలిగించే వాస్తవాలు - Verification Committee report on Bangalore riots

గస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కు సమర్పించింది. కమిటీ సభ్యులు ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి స్థానికులతో, బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ నివేదికలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం ఎడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి, డిజిపి, పోలీస్ కమిషనర్ లతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

బెంగుళూరులోని పులికేసి నగర్ ఎస్సీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి మేనల్లుడు నవీన్ ఫేస్ బుక్ ద్వారా చేసిన ఒక పోస్ట్ కారణంగా అక్కడి ముస్లింలు దేవరజీవన హల్లి, కడు గొందనహల్లి మొదలైన ప్రాంతాల్లో తీవ్ర అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లలో ఎమ్మెల్యే ఇల్లు, నవీన్ ఇంటితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ కు నిప్పంటించి విధ్వంసం సృష్టించారు.

ఈ అల్లర్ల వెనుక ఉన్న అసలు కుట్రల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రిటైర్డ్ జడ్జి శ్రీకాంత్ బాబలాడి అధ్యక్షత వహించగా

శ్రీ మదన్ గోపాల్ రిటైర్డ్ IAS, డాక్టర్ ఆర్ రాజు రిటైర్డ్ IFS, డాక్టర్ ప్రకాష్ రిటైర్డ్ ఐఆర్ఎస్, శ్రీ. ఎం ఎన్ కృష్ణమూర్తి రిటైర్డ్ డిజిపి, ఆర్ కె మాట్టూ, జర్నలిస్ట్, సంతోష్ తమ్మయ్య జర్నలిస్ట్, డాక్టర్ ఎం జయప్ప, ప్రొఫెసర్, డాక్టర్ హెచ్ టి అరవింద, ప్రొఫెసర్, మునిరాజు, సామాజిక కార్యకర్త, శ్రీమతి. క్షమా నర్గుండ్, అడ్వకేట్, జెరోమ్ ఆంటో సామాజిక కార్యకర్త సభ్యులుగా ఉన్నారు.

ఈ నిజనిర్ధారణ కమిటీ తన నివేదికలో స్పష్టంచేసిన కొన్ని విషయాలు –
 • • ఈ అల్లర్లు ముందస్తు ప్రణాళికతోనే జరిగాయి.
 • • హిందువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను ముస్లింలు లక్ష్యం చేసుకున్నారు.
 • • రాష్ట్రంలో హిందువులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అల్లర్లు చేశారు.
 • • ఎఫ్ఐఆర్ వివరాలతోపాటు బాధితులు తెలిపిన విషయాల ప్రకారం ఈ అల్లర్లలో పాల్గొన్న స్థానిక ముస్లింలకు ముందుగానే ఇవి జరుగుతాయని తెలుసు.
 • • అల్లర్ల ముఖ్య ఉద్దేశం హిందూ మెజారిటీ గా ఉన్న ఈ ప్రాంతాన్ని ముస్లిం మెజారిటీ ప్రాంతం గా మార్చడం.
 • • మొత్తం అల్లర్ల వెనక ఎస్డిపిఐ(SDPI), పిఎఫ్ఐ(PFI) అనే ముస్లిం రాజకీయ పార్టీలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ చేసిన సూచనలు:
 • • అల్లర్ల మూలంగా జరిగిన ఆస్తి నష్టాన్ని ఇందుకు కారకులైన వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని పూడ్చాలి.
 • * ఈ అల్లర్లు ఢిల్లీ, స్వీడన్ లో జరిగిన అల్లర్ల మాదిరిగానే ఉన్నాయి. దీనిపై విస్తృత స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలి.
 • * ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్న ఉగ్రవాద సంస్థల పైన ప్రభుత్వం దృష్టి సారించాలి.
 • * మత విద్వేషాలను రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
 • * ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66ఏ రద్దు చేయడంతో ఏదైనా మతం, జాతి, సంస్థ, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సాగే అవమానకరమైన, దురుద్దేశపూర్వక, ద్వేష పూరితమైన ప్రచారాన్ని నిరోధించడానికి, విచారించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.
Download Report here
Source :samvada - విశ్వ సంవాద కేంద్రము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top