ఎన్నికల ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రభుత్వం మతమార్పిడులను ప్రోత్సహిస్తోంది: బీజేపీ

0
ఎన్నికల ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రభుత్వం మతమార్పిడులను ప్రోత్సహిస్తోంది: బీజేపీ - Andhra govt supporting conversion for electoral benefits: BJP
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ ఆర్ సీపీ) ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలని క్రైస్తవమతంలోకి మారేందుకు ప్రోత్సహిస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది.

బిజెపి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కో-ఇంఛార్జ్ సునీల్ దేవధర్ మాట్లాడుతూ మతం ప్రాతిపదికన ఓటు బ్యాంకు వర్గం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
   పెద్ద సంఖ్యలో రెడ్డి సామజిక వర్గాన్ని క్రైస్తవమతంలోకి మార్చాలని యోచిస్తున్నారని, వారి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా జగన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని దేవధర్ ఐఎన్ ఎస్ IANS కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. "పెద్ద సంఖ్యలో ఉన్న రెడ్డి  జనాభాను క్రైస్తవంలోకి మార్చడం ద్వారా ఎన్నికలలో విజయానికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగించవచ్చని ఏపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని అయన ఆరోపించారు. దీనిని సాధించడం కొరకు, అతను సామూహిక మతమార్పిడుల వైపు దృష్టి పెట్టాడని," అని ఆయన తెలిపారు. మతమార్పిడులకు పాల్పడుతున్న వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో "సామూహిక మార్పిడి దినచర్యగా మారిందని ఇది బహిరంగంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రేరణతో ఇలాంటివి జరగడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ”అని ఆయన ఆరోపించారు.

  ఆంధ్రప్రదేశ్‌లో అందరూ క్రిస్టియన్లు గా  మారాలని రెడ్డి కోరుకుంటున్నారని దేయోధర్ ఆరోపించారు. "ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సామూహిక మార్పిడి జరుగుతోంది  రాష్ట్ర ప్రభుత్వం దీనికి మద్దతు ఇస్తోంది. సామూహిక మార్పిడి గురించి హోర్డింగ్‌లు మరియు పోస్టర్లు రాష్ట్రంలో కనిపిస్తాయి కాని ఎవరిపైనా చర్యలు తీసుకోరు. ఎవరైనా వ్యతిరేకిస్తే పోస్టర్లు లేదా హోర్డింగ్‌లు తొలగించబడతాయి కాని పరిపాలన స్వయంగా అలాంటి చర్యలపై చర్యలు తీసుకోదు, ”అని దేయోధర్ అన్నారు.
  షెడ్యూల్డ్ కులాల (ఎస్ సి) వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారి, రిజర్వేషన్ ల ప్రయోజనాలను పొందడానికి తమ అధికారిక పత్రాల్లో "హిందూ"ని మతంగా ఇప్పటికీ రాస్తారు అని దేవధర్ పేర్కొన్నారు.

   క్రైస్తవమతాన్ని అనుసరిస్తు, ఇప్పటికీ ఎస్సీ రిజర్వేషన్లను పొందుతున్న వారిని గుర్తించాలని దేవధర్ సూచించారు. "చర్చీలకు హాజరయ్యే వ్యక్తులు మరియు అటెండెన్స్ రిజిస్టర్ యొక్క పరిశీలన ను వీడియో రికార్డింగ్ చేయడం మరియు చర్చికి వెళుతూ SC రిజర్వేషన్ లు పొందుతున్న ఈ వ్యక్తులను గుర్తించడానికి విధిగా చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

Source: Hindu Post

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top