తిప్పతీగ ఔషధగుణములు - Medicinal properties of Thippathiga ( Tinospora cordifolia )

తిప్పతీగ ఔషధగుణములు - Medicinal properties of Thippathiga ( Tinospora cordifolia )
Giloy
సాధారణంగా పల్లెలలో దొరికే మూలిక తిప్పతీగ ,దీనిని హిందీ లో జిదాయ్, గిలోయ్ అని సంస్కృతం లో అమృత అని పేర్లున్నాయి. ఇది చెట్లమీదకు పాకి అల్లుకుంటుంది. కాడలకు బొడిపెలు వుంటాయి .ఆకులు పచ్చగా చిన్న సైజ్ తమలపాకుల్లావుంటాయి. కాస్త వగరు చేదు ,కారంగా రుచి కలగలసి వుంటుంది. నమిలితే జిగటగా వుంటుంది. దీనివిశేషమేమిటంటే మనం పీకి వేసినాక కొద్దికాలం ఆగాక మరలా తడితగిలినా బ్రతుకుతుంది. ఆరునెలలైనా తిప్పతీగ మరలాబ్రతుకుతుంది అని అంటారు పెద్దలు. ఇలాంటి దివ్యమైన మూలికలు అదృశ్యమవుతున్నాయి. ఎక్కడ బడితే అక్కడ దొరికే ఈమొక్క ఇప్పుడు అంతగా కనిపించటం లేదు.

Tinospora cordifolia
Tinospora cordifolia
తిప్పతీగను తులసిని కలిపి తింటే స్వైన్ ఫ్లూను ఎదుర్కునే రోగనిరోధక శక్తి శరీరానికి చేకూరుతుంది. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చినా తగ్గించగల దివ్యౌషధమిది. దీనినే ఈమధ్య యోగా గురువు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్య పరిశోధకులు రామ్ దేవ్ బాబా ఈవ్యాధి నివారణకు మందుగా సూచించారు. దీనిని కాడను ఒకటిరెండంగుళాల ముక్కను ,పది తులసి ఆకులతో కలిపి పొద్దుటే నమిలి తినాలి. అలా నాలుగైదు రోజులకు ఒకసారి తీసుకోవాలి.వ్యాధిసోకినప్పుడు ఎక్కువమోతాదులో తీసుకోవాలి. అద్భుతంగా పనిచేస్తుంది.

దీనిని మన పూలకుండి లో నాటుకుంటే నీరుపోస్తుంటే అదేపెరుగుతుంది .కనుక పెంచటము తేలికే . పుట్టకొక్కులు ,తేనె పల్లెటూర్లనుంచి తెచ్చి అమ్మే యానాదులకు ఈమూలిక బాగ పరిచయం కనుక వారినడిగితెప్పించుకోవచ్చు. లేదా మీకు పల్లెలలో ఎవరన్నా చుట్టాలుంటే వారినడిగినా పంపిస్తారు.తులసి మొక్క ఎలాగూ మీదగ్గరలో దొరుకుతుంది ..

 ..Dr.Vandana Seshagirirao

గమనిక:
పైనుదహనించిన చికిత్స విధానాలు మనిషి అవగాహన కొరకే, మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించగలరు.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top