![]() |
Mahalaya Pitru Paksham |
పితరపక్ష - భాద్రపదం
ఏవం విధానతః శ్రాద్ధం కుర్యాత్ స్వవిభవోచితం .
ఆబ్రహ్మస్తంబపర్యంతం జగత్ ప్రీణాతి మానవః .. బ్రహ్మపురాణ
శ్రాద్ధ కార్యక్రమం మన పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా, తన శక్తి వంచన లేకుండా శ్రాద్ధం చేసే వ్యక్తి బ్రహ్మ నుండి గడ్డి వరకు ఉన్న అన్ని జీవులను సంతృప్తి పరుస్తాడు. ( ఆచరణ విశ్వం లోని సమస్త స్థితికి ఉపకారమే అని)
ఈ పాడ్యమి నుండి 15 రోజులు అమావాస్య పర్యంతం పితృ మహాలయ పక్షం. “మహత్ అలం యాత్ ఇతి మహాలయః” “అనంతమైన తృప్తి”ని పితరులు ఈ పక్షంలో వారి పుత్రులు చేసిన శ్రాద్ధ, తర్పణాదుల ద్వారా ఆస్వాదిస్తారు , అందువల్ల దీనిని 'మహాలయం' అని అంటారు, తల్లి తండ్రి లేక ఒక్కరు గతించిన వారి పిల్లలు అందరూ యథాశక్తి పితృశ్రాద్ధాన్ని ఆచరించాలి. పక్షం అంటే మొత్తం 15 రోజులు పాటించడం, ప్రతి రోజూ చెయ్యలేని వారు, కనీసం ఒక్కరోజైనా చెయ్యాలి. అలా చేస్తే "సకృన్ మహాలయం" అంటారు. ఇది ఆచరించిన వారికి కూడా పితృ అనుగ్రహం కలుగుతుంది.
పితృ దేవతలు కూడా కోరికలు అనుగ్రహించు శక్తి వారికి ఉంటుంది "దేవతాపూజ మరియు ఈ పితృ ఆరాధన" చేసిన వారికి మాత్రమే సుఖ సంపత్తి ఫలం తప్పక ఉంటుంది.
నిత్య తర్పణ లేక రుచి మహాముని కృత పితృ స్తోత్రం లాంటివి కూడా చేసుకోవచ్చు.
మహాదేవ మహాదేవ