నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
కుటుంబ విలువలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుటుంబ విలువలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2020, శుక్రవారం

నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబం దుస్థితి, విచ్చలవిడితనం విశృంఖలతే పరమావధి తయారైన చిన్నకుటుంబాలు - Ummadi Kutumbalu

సుందరమైన ఉమ్మడి కుటుంబం
రవై ఏళ్ళ క్రితం వరకు, మన దేశంలో ఏ ఇల్లుచూసినా అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అప్పట్లో అందరూ కలిసి ఉంటేనే సుఖం అన్నట్టుగానే ఉండేవారు. ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లకు బాగా గౌరవం ఉండేది.

అన్ని విషయాల్లో అన్నదమ్ములు ఒకమాటపై ఉండేవారు, ఇప్పుడు మాదిరిగా, వయసైపోయిన తల్లితండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలెయ్యడం లాంటివి అప్పట్లో అసలు ఉండేవి కాదు. ఇంటి కట్టుబాట్లు సంప్రదాయాలు లాంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తరతరాలుగా పాటిస్తూ వచ్చేవారు. చిన్నవాళ్లు పెద్దవాళ్ళను గౌరవించడం అనేది కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే బాగా ఉండేది.
సుందరమైన ఉమ్మడి కుటుంబం
సుందరమైన ఉమ్మడి కుటుంబం
కానీ ఆనాటి సంఘసంస్కర్తలు, మేధావులు అని చెప్పుకునేవాళ్ళు  ఈ ఉమ్మడి కుటుంబాలలో ఉండే సాధారణ సమస్యలను భూతద్దంలో చూపిస్తూ, చిన్న కుటుంబాలే సమాజానికి మేలు అన్నట్లు,  నిత్యం పత్రికలలో, పేపర్లలో రకరకాల శీర్షికలు రాస్తూ, ఉమ్మడి కుటంబ వ్యవస్థని కొద్దికొద్దిగా బలహీనం చేస్కుంటూ వచ్చారు!

నిజానికి ఎప్పుడయితే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి?
ఎవరికీ వారే అన్నట్టు చిన్న కుటుంబాలుగా విడిపోతూ వచ్చారో, ఆనాటి నుండే ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లకు కష్టాలు మొదలయ్యాయి! సమాజంలో వృద్ధాశ్రమాలు మొదలయ్యాయి! నిజానికి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అసలు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా లేవు! ఇప్పుడున్నవన్నీ చిన్న కుటుంబాలే, పెళ్లి అయిన మరుక్షణం వేరు కాపురాలే! పోనీ ఈ చిన్ని కుటుంబాలు వల్ల సమాజం అద్భుతంగా ఉందా అంటే,  చిన్న కుటుంబాలలో మొగుడు పెళ్ళాలే సరిగ్గా కలిసి ఉండట్లేదు!

వాళ్ల మధ్య గొడవ వస్తే సర్దిచెప్పే పెద్దవాళ్ళు ఉండరు ఇంట్లో! పిల్లల్ని కంటే చూస్కునే వాళ్ళు లేక,  ఒకర్ని కనేసి చేతులు ఎత్తేయడం! వయసు అయిపోయిన పెద్దలను చూసుకోలేక వృద్ధాశ్రమాలులో వదిలేయడం! చివరికి ఎటుచూసినా విచ్చలవిడితనం విశృంఖలతే పరమావధి అన్నట్టు తయారయింది ఈనాటి సమాజం!

8, జులై 2020, బుధవారం

విడిది ఇంట్లో సాంప్రదాయకంగా ఇవ్వవలసినవి, చేయవలసినవి ! - Vididhi intlo sampradayam

vididi-intlo-cheyavalasinavi

విడిది ఇంట్లో ఇవ్వవలసినవి, చేయవలసినవి:

1. చమురు కుంకుడు కాయ పళ్ళెము:
విడిది ఇంటికి వచ్చినాక ఇచ్చెదరు. ఒక పళ్ళెములో టర్కీటవలు, షాంపు సీసా, నూనె సీసా, కుంకుడు కాయలు, పౌడరు డబ్బా, సబ్బులు 2, అద్దము, దువ్వెన, 2 స్టీలు డబ్బాలు, లేక 2 వెండి కప్పులు పెట్టవచ్చును. వియ్యపురాలికి బొట్టు పెట్టి పెండ్లికి రెడీ అవ్వండి అని ఇచ్చెదరు.

2. కాఫీ, ఉప్మా గిన్నెలు:
పెద్ద సైజువి గిన్నెలు 2, మూతలు 2, గరిటెలు 2, కొద్ది టిఫిను ఒక గిన్నెలో పెట్టి వియ్యపురాలికి విడిది ఇంట్లో ఇవ్వవలెను.

3. వరపూజ:
ఒక పళ్ళెములో వెండి శుభలేఖ, మామూలు శుభలేఖ, పర్‌ఫ్యూమ్‌ స్ప్రే లేక పన్నీరు బుడ్డి, 2 జాకెటు ముక్కలు, పసుపు, కుంకుమ, పూలదండ, నాప్‌కిన్‌, అల్లుడుగారికి మంచి కండువా, బట్టలు, పానకము బిందెలు 2, వెండి గ్లాసు ఇవన్నీ పెట్టి ఇవ్వవలెను. పానకము కలుపవలెను. కొందరు రస్నా కలిపి ఇచ్చెదరు, అయిననూ శాస్త్రముగా పానకము కలపవలెను.

వరపూజ అయినాక అందరికి పానకము ఇవ్వవలెను. ప్లాస్టిక్‌ గ్లాసులలో ఇవ్వవచ్చును. ముఖ్యమైన వారికి స్టీలు గ్లాసులు కొత్తవి ఇవ్వవచ్చును.

4. ముఖాలు కడిగించుట:
vididi-intlo-cheyavalasinaviపెండ్లికూతురు తల్లి పెండ్లికొడుకు తల్లిని, వారి బంధువులను కుర్చీలలో కూర్చొనపెట్టుదురు. టూత్‌పేస్ట్‌, బ్రష్‌ను పట్టుకుని, బ్రష్‌ వెనుక వైపు చూపుతూ వారి అందరి ముందు నడచెదరు. అద్దము వెనుక వైపు చూపుతూ దువ్వెన వెనుకవైపుకు పెట్టి దువ్వెదరు. మరమరాల దండలు, కూరలతో దండలు, చాక్లెటు కాగితముతో దండలు, బిస్కెట్‌తో దండలు అందరికి మెడలో వేసి అలంకరించెదరు.

కిరీటములు, వడ్రాణములు, వంకీలు, టోపీలు, బంగారపు కలరు కాగితముతో తయారు చేసిన చీర పెట్టెదరు. దోసకాయ చదరముగా గుంటచేసి నిమ్మచెక్కలో నూనెపోసి దోసకాయలో పెట్టి కుడిచేతితో దోసకాయ తొడిమ పట్టుకుని ఎడమ చేతితో హారతి అద్దెదరు, లేనిచో బంగాళదుంప గుంటచేసి నూనెపోసి వత్తిపెట్టి ఎడమచేతితో హారతి ఇచ్చెదరు.

ఒక ప్లేటు పట్టుకుని స్పూనుతో శబ్దము చేయుదురు. వీపరాలికి లడ్డు, అరిశెలు, అప్పడాలు, వడియాలు, మినపపిండిముద్ద, చీర, పసుపు కుంకుమ పెట్టెదరు. అందరికి పంచిపెట్టు సామాను ఇచ్చెదరు.

పెండ్లికొడుకు తల్లి పెండ్లికూతురు తల్లిని, వారి బంధువులను కూర్చొనపెట్టి ఇదే విధముగా జరుపుదురు. స్నాతకము అయినాక ముఖాలు కడిగించి వివాహమునకు రమ్మని చెప్పెదరు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

16, మే 2020, శనివారం

పిల్లలు, కన్నవారి కలలు - Pillalu Kannavari Kalalu

కన్నవారి కలలు!

భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాశస్త్యం ప్రపంచ దేశాల ప్రశంసలకు నోచుకుంది. విశ్వానికి ఆదర్శప్రాయమై నిలిచింది. సీతాపహరణం పిదప రాముడి వియోగ విలాపాలు - ప్రణయ దాంపత్య జీవన సఖ్యతా మాధుర్యాన్ని లోకానికి రుచి చూపించాయి. ‘సీతారాముల పోల్కి మీరలు శుభశ్శ్రీలంది వర్ధిల్లుడంచు ఏతథ్యోక్తి ముహూర్తపుం గడియ తానేతెంచి ఆశీర్వచో జాతంబు కురిపించెనో’ అని కవులు వర్ణించినట్లు అగ్నిసాక్షిగా ముడివడగానే దంపతులు గృహస్థు ధర్మనిర్వహణ బాధ్యతలను తలకెత్తుకుంటారు.

‘కుటుంబం’ అనే ఒకానొక అద్భుత వ్యవస్థకు అదే అంకురారోపణ! నూతన దంపతుల మధ్య ‘... ఎవో అన్యోన్య అనురాగమ్ములు అంకురించి’ క్రమంగా సఖ్యత ఏర్పడుతుంది. బంధం బలపడుతుంది. కాలక్రమంలో ప్రేమలు ఫలించి, జంటకు ‘తల్లిదండ్రులు’ అనే హోదా దఖలుపడుతుంది.

మహాకవి జాషువా చెప్పినట్లు ‘తల్లిదండ్రుల తనూవల్లరీ ద్వయికి వన్నియబెట్టు తొమ్మిది నెలల పంట’ చేతికి అందుతుంది.

‘ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి తమ యింట క్రొత్త పెత్తనపుదారు’గా అవతారం దాలుస్తాడు. ‘ఇద్దరు నొక్కటై మరియునొక్కరు ముగ్గురయి...’ వారి చుట్టూ కుటుంబం అనే అపురూప భావపరీమళం అల్లుకుంటుంది. బతుకులోని మాధుర్యం, అవసరం అనుభవానికి వస్తాయి.

‘భార్య భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే ఆ ముడి సంతానం!’ అన్న భర్తృహరి మాటలకు తాత్పర్యం తెలిసొస్తుంది. అప్పుడప్పుడు వారి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడినా వేటూరి ప్రభాకరశాస్త్రి వర్ణించిన ‘అరయన్‌ ఆల్మగళ్ల హృదయంబులనంబడు రెండు రజ్జువుల్‌... ఇక వేరుపడకుండగా ఏర్పడున్‌ సుతాకారపు ముళ్లు...’ ఆ అపశ్రుతులను సరిజేస్తాయి. జీవనరాగం కొత్త పల్లవిని అందుకుంటుంది.

‘అను’ అంటే ‘ఎడతెగని’ అని అర్థం. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య బలపడే బంధం ఎడతెగనిది కనుకనేదానికి ‘అనుబంధం’ అని పేరు. అందుకు మూలం అయ్యేవాటిలో అమ్మది పేగుబంధం, నాన్నది వంశానుబంధ సుగంధం! నిరుపేదలే అయినా, ‘దినమెల్లన్‌ శ్రమియించి చెమ్మటలలో దేహంబు నీరార్చి, చిక్కిన పైకమ్ము...’తో తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు అమ్మానాన్నలు! ఆ ప్రభావం పిల్లలపై గాఢమైన ముద్రలు వేస్తాయి.

‘ఇంటి నిర్వహణము నొంటి చేతను పూని, తులసి మొక్కవోలె మెలగెనమ్మ! ఆమె జీవశక్తి ఆలంబనమ్ముగా...’ స్వీకరించిన అమ్మాయి అత్తవారింటా అమోఘంగా రాణిస్తుంది. ‘ఇంటి పరువునెపుడు మంట కలప’కుండా ప్రవర్తిస్తుంది. ‘తాను పస్తులుండి తనయుల పోషింప ఇష్టపడుచు తండ్రి కష్టపడును కోరి కరిగిపోవు కొవ్వొత్తి పోలిక...’ తనకు భవిష్యత్తును కానుక చేసిన తండ్రి పోలికలు తనయులను విజేతలుగా మారుస్తాయి. ఆదర్శవంతులుగా మలుస్తాయి.

‘నీ యింటన్‌ పుట్టిన భాగ్యమొక్కటియె తండ్రీ! నన్ను కాపాడెడిన్‌...’ అన్న కృతజ్ఞతా భావాన్ని వారిలో రేకెత్తిస్తాయి. ‘కావడియందు మ్రోయుచును కష్టము నెంతయొ నోర్చి...’ శ్రావణ కుమారుడు అమ్మానాన్నలను తీర్థయాత్రలకు తిప్పడానికి కారణం అదే! ‘సన్న్యాసికి కర్మ చేయుటకు హక్కు హుళక్కి...’ అని ఛాందసులు శంకరులకు అడ్డుపడ్డారు.

వారిని ప్రతిఘటించి ‘తల్లిని తానె ధరించి శంభు సంవాసము చేర్చె శంకరుడు’ అని కవులు చేతులెత్తి మొక్కారంటే, తన తల్లి పట్ల శంకర భగవత్పాదులకు గల కృతజ్ఞతాభావమే మూలకారణం! మాంసం వ్యాపారి ధర్మవ్యాధుణ్ని చూసి ‘నావలె ఈతడు శాస్త్రపండితుడు కాదు... నిత్య కర్మఠుడునూ కాదు... వీనికి ఎటుల ఇట్టి గొప్ప జ్ఞానమబ్బె’ అని కౌశికుడు ఆశ్చర్యపడ్డాడు. ‘వీరు నా జననియు, జనకుండు సూవె! వీరలకు శుశ్రూష సేసి ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాప్తించితిని’ అని ధర్మవ్యాధుడి నోట పలికించి- మాతాపితరుల సేవ ఎంత ఉదాత్తమైనదో, పిల్లలను అది ఏ స్థాయికి తీసుకెడుతుందో మహాభారతం మనకు పాఠం చెప్పింది.

ఉప్పుమూటలా తనను వీపున మోస్తూ ముంగిట ముగ్గులు వేస్తూ అమ్మ నేర్పిన పాటలు ఇప్పటికీ మరిచిపోని ఏ బిడ్డకూ ‘అమ్మల రోజు’తో పనిలేదు. ‘ఏనుగమ్మా ఏనుగు’ పాటను జ్ఞాపకం ఉంచుకొని, బాల్యంలో తనను పట్టి నడిపించిన చేతికి తానిప్పుడు ‘వూతకర్ర’గా మారిన పిల్లవాడికి ‘నాన్నల రోజు’ వేరే అక్కరలేదు. అమ్మప్రేమలో వైశాల్యం, నాన్నప్రేమలో లోతు ఎరిగిన సంతానానికి ‘తల్లిదండ్రుల రోజు’ను గుర్తుచేసే పనిలేదు.

అయితే, పండులో గింజలన్నీ విత్తనాలుగా పనికిరావు. అలాంటి పొల్లుగింజలకు ‘ఈరోజు తల్లిదండ్రుల రోజు’ అని గుర్తుచేయాలి. వారిలో కొందరికి ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు’ అన్న సామెత వర్తించడం దురదృష్టకరం.

అప్పుడు పెంపకం గీటురాయి అవుతుంది. సావాసాలు మరిగి వ్యసనపరులై పిల్లలు ‘పూప వయస్సునందె తనువుం బలిచేసిన దాఖలాలు... కనుల్‌ తడియారని దీనగాథలై’ జీవితాంతం పెద్దలు శోకతప్తులు కాకుండా ఉండాలంటే పెంపకం పట్ల జాగ్రత్త వహించాలి. అతి గారాలకు స్వస్తి పలకాలి. పెరుగుమీద మీగడ కోసం, పాయసంలో జీడిపప్పు కోసం, అరటిపళ్ల కోసం, అప్పడాల కోసం... పిల్లలు వాదులాడుకున్నప్పుడు తన వాటాను వారికి పంచిన అమ్మలు గుర్తుంటే పిల్లలు చెడిపోయే ప్రసక్తే తలెత్తదు. జాగ్రత్త పాటించలేకపోతే పెద్ద వయసులో అమ్మనీ నాన్ననూ పోలీసులు నిర్వహించే తరగతి గదులకు పంపే అగత్యం లేకుండా చేస్తే చాలు ‘తల్లిదండ్రుల రోజు’ను గుర్తుంచుకున్నంత పుణ్యం!

సంకలనం: కోటేశ్వర్

16, మార్చి 2020, సోమవారం

ఆ రోజుల్లో ఉమ్మడికుటుంబం - Ummadi Kutumbamuరోజుల్లో వేసవికాలం ఎంత బాగుండేది. వయసు మీద కొచ్చాక ఎండలంటే భయమేస్తోంది కాని ఆరోజుల్లో వేసవి బాగుండేది. మాది కృష్ణాజిల్లా కురుమద్దాలి. అవును. విజయవాడ బందరు మార్గంలో రోడ్డుమీద కన్పించే ఊరే. రోడ్డుప్రక్కనే రెండు దేవాలయాలు వాటి మీద రంగులువేసిన పెద్దపెద్దబొమ్మలు ఆ దారిన వెళ్లిన వారందరికి గుర్తే . 

అదే మాఊరు. తాతగారు స్వాతంత్య్రసమరయోధులు. నాన్నగారు ఇంటికి పెద్దకొడుకు కావడం వల్ల తాతగారింట్లోనే కలిసుండేవాళ్లం.బాబాయి కుటుంబం వేరే ఊళ్లో ఉండేది.ఐదుగురు మేనత్తలు పెళ్లిళ్లై వాళ్ల వాళ్ల ఊళ్ళల్లో ఉండేవారు.

వేసవి సెలవలు వచ్చాయంటే బాబాయిగారి పిల్లలు, అత్తయ్యగారి పిల్లలు తాతగారింటికి వచ్చేవాళ్ళు. ఇంకేముంది, పిల్లలందరం కలిస్తే ముఫైఐదు నలభైమంది అయ్యేవాళ్ళం. నిజం. ఉదయం పిల్లల చద్దన్నం కోసం అడ్డెడుగిన్నె దించేవాళ్ళు. టిఫిన్ కల్చర్ అప్పటికింకా రాలేదు. తొమ్మిది గంటలకల్లా చద్దన్నాలు తినేసి పక్కనున్న గుళ్ళొకో, పంచాయతీపార్కులోకో దూకేసేవాళ్లం పిల్లలందరం. మాతోపాటు ఎదురింటివాళ్ల  పిల్లలు, పక్కింటివాళ్ల పిల్లలు కలిస్తే మరోపదిమంది. అంటే యాభైమంది . ఎవరికొచ్చిన, నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకొనేవాళ్ళు. ఇంటిప్రక్కన విశాలమైన గుడి ఆవరణ, రోడ్డుదాటితే పంచాయతీ పార్కు, దాని ప్రక్కనే చెఱువు , దాని ఒడ్డున తూర్పుగా గవర్నమెంటు బడి , ఉత్తరంగా తాళ్ళతోపు, ఇవన్నీ మా ఆటస్దలాలే.

        మధ్యాహ్నం బోజనాలవగానే పెద్దవాళ్ళందరూ ఎండలకి ఆపసోపాలు పడుతూ తాటాకు విసనకర్రల్నినీళ్లల్లో ముంచుకొని విసురుకొంటూ పడుకుంటే పిల్లలందరం గుళ్లోకి జారుకొని నెమ్మదిగా రోడ్డెక్కెసేవాళ్లం. కొందరు గడవాసం భుజానేసుకొని ఈతకాయలు, దొరికితే సీమతుమ్మకాయల కోసం బయలుదేరితే, మరికొంతమంది కొత్తఆవకాయ పచ్చడిని బాదంఆకులో చుట్టి జేబులో పెట్టుకొని.

ముంజికాయలకోసం పొలంగట్లు పట్టేవాళ్లం, ముంజికాయలు తింటూ ఆవకాయ నంజుకుంటే కడుపులోనెప్పి రాదని తోటివాళ్ళు చెపుతుండేవాళ్లు. ఆవకాయ కారం నిక్కరు జేబునిండాకారి మరకలవడం, ఇంట్లోవాళ్లు తిట్టడం అవన్నీ వేరేసంగతి. 

ఈతకాయగెలల్ని తెచ్చి పశువులపాక ప్రక్కనే గుంటతీసి పాతిపెడితే,మగ్గి,తెల్లారేసరికి పండేవి. ఆ ఎచ్చి పచ్చి కాయల్నిఅందరం పంచుకొని తినడం గొప్ప ఘనకార్యంలా భావించేవాళ్లం. సాయంత్రం చల్లబడే సమయానికి ఎండగట్టిన చెరువులోకి తామరగింజలకోసం జట్లుజట్లుగా బయలుదేరేవాళ్లం. చెఱువులోని తామరపూలు ముదిరి ఎండి తామరడిప్పల్లోంచి గింజలు పడిపోయేవి. చెఱువు ఎండిపోయినప్పడు ఆ నల్లమట్టిలోంచి తామరగింజల్నిఏరుకొచ్చి కొట్టుకొని తినడం ఒకఆటగాఉండేది. ఎవరు ఎక్కువ గింజలు ఏరితే వాళ్లు గొప్పగా ఫీలయేవాళ్లం. ఇంటికొచ్చి బావిదగ్గర బక్కెట్లకొద్దీ చల్లని స్నానాలు. స్నానాలు అయ్యే సరికి అన్నాలు సిద్ధం. ఎక్కడ. పురిగట్టుమీద.

అదొక అందమైన దృశ్యం, మసకవెన్నెల్లో, సంధ్యాదీపపు కాంతుల్లో పురిగట్టుమీద పిల్లలందరూ గుండ్రంగా కూర్చుంటే మధ్యలో అత్తయ్య కూర్చొని అందరికీ అడిగి అడిగి వడ్డిస్తూంటే కబుర్లు చెప్పుకుంటూ మసకవెలుతుర్లో అన్నాలు తినడం తలుచుకుంటే గొప్ప అనుభూతి. ఈరోజుల్లో moon light dinner అంటారేమో దాన్ని. వడ్లు పురి కట్టడానికి సిమెంటుతో చేసే చప్టాని పురిగట్టు అంటారు.
ఆరోజుల్లో కుటుంబం అంటే తల్లిదండ్రులు ఏడెనిమిదిమంది పిల్లలు ఉండేవారు. ఉమ్మడికుటుంబవ్యవస్ధ పోయి కుటుంబనియంత్రణ పెరిగిన ఈకాలంలో ఇవన్నీ ఎక్కడ కన్పడతాయి కధల్లో తప్పితే. ఏదో నష్టపోతోందన్పిస్తోంది ఈతరం. ఇంట్లో ఉన్నఒక్కపిల్లాడికి ఆడుకోవడానికి చెల్లినో,తమ్ముణ్ణో ఇవ్వడానికే లెక్కలు చూసుకుంటున్న దంపతులున్న కాలమిది.
అన్నాలు అయిపోగానే మళ్లీ ఆటల్లోకే. ఆడపిల్లలు దాగుడుమూతలు, వెన్నెలకుప్పలు ఆడుకుంటుంటే,మగపిల్లలు పక్కనే ఉన్నపార్కులే కోతికొమ్మచ్చులాడేవాళ్లం. వెన్నెలవెలుగులో కోతికొమ్మచ్చులు. రాత్రి తొమ్మిది పదింటిదాక ఆడి,అలిసి, అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నచాకలి చెఱువులో ఒళ్లు, కాళ్లు కడుక్కొని వచ్చి, గుళ్లో మండపంలో పెట్టుకున్న పక్కబట్టలు తీసి దుప్పటి మడతకూడ విప్పకుండా పరచి పడుకంటే  సూరీడు బారెడు పైకొచ్చి చురుక్కు మనిపిస్తుంటే, ఉలిక్కిపడి లేచి కూర్చునేవాళ్లం. కొద్దితేడాతో వేసవి సెలవలన్నీ ఇలాగేగడిచిపోయేవి. కోతి కొమ్మచ్చిలాడే సమయంలో ఎక్కడో కొమ్మల్లోఉన్నతేనెపట్టు కదిలి తేనెటీగలు దాడి చేయడం,రాత్రిపూట చెఱువులో దిగేటప్పుడు కనపడక  బురదకొయ్యమీదో, బావురుకప్ప మీదో కాలేస్తే అది నెత్తురొచ్చ్చేటట్లు గీరి నీళ్లల్లోకి జారిపోతే, పాము కరిచింది చచ్పిపోతానేమోనని తెల్లవార్లు భయం భయంగా పడుకోవడం తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వువస్తుంది.

విచిత్రమేమిటంటే అంతమందిఉన్నాకొట్టుకోవడాలు, పోట్టాడుకోవడాలు ఉండేవికావు. అందుకే పెద్దవాళ్లుకూడా ఆడుకుంటారులే అని వదిలేసేవాళ్లు. అప్పుడప్పుడు పిల్లలమధ్య కీచులాటలొస్తే  అలిగి దూరంగాపోయి, మళ్లీ కాసేపటికొచ్చి జట్టులో కలిసిపోయేవాళ్లు కాని కక్షలకు, కోపతాపాలకు తావుండేదేకాదు. అందుకే భాల్యమెంత మధురం అనిపిస్తుంది ఆరోజుల్ని తలుచుకుంటే.

రచన: ముత్తేవి రవి ప్రసాద్

6, ఆగస్టు 2019, మంగళవారం

ఉమ్మడి కుటుంబాలు, వాటి విలువలు - Ummadi Kutumbam

ఉమ్మడి కుటుంబం వాటి విలువలు - Ummadi Kutumbam
ఉమ్మడి కుటుంబాలు
గతంలో పల్లెల్లో వున్నవన్ని ఉమ్మడి కుటుంబాలె. ఒక కుటుంబంలో పదుల సంఖ్యలో సభ్యులుండే వారు. దాంతో వ్యవసాయ పనులు చాల చక్కగా జరిగేవి. ఎవరి పనులు వారి కుండేవి. ఒక కుటుంబంలోని వ్వక్తులకు ఒక్కొక్క పని కేటాయించ బడి వుండేది. ఇద్దరు ముగ్గురు ఆడవారు ఇంటిపనికి వుంటే మిగతా ఆడవారు పొలం పనులకు వెళ్లే వారు. మగవారిలో ఒకరు గొర్రెలను కాయడానికి వెళితే మరొకరు మేకలను కాయడానికి వెళ్లె వారు. మరొకరు ఆవులను పాలు పిండి తర్వాత మేతకు తీసుకెళ్లే వారు. మిగతా వారు పొలం పనులకు వెళ్లే వారు. పెద్ద పనులు వున్నప్పుడు అనగా వరి నాట్లు, కలుపు తీత, వరికోతలు, చెరకు గానుక ఆడడము మొదలగు పనులకు చాల మంది అవసరము. ఆ సందర్భంలో ఇంటి వారందరు కలసి ఆ పనిని కొంత మేర చేసి తర్వాత తమ పనులకు వెళ్లె వారు. 

ఆ విధంగా కుటుంబ మంతా ఒకే నాయకత్వంలో కలిసి మెలిసి పనిచేసి వ్వవ సాయం చేసి చాల గొప్పగా బతికారు. అదే విధంగా ఆ పల్లెలోని అన్ని కుటుంబాలు అన్ని కలిసి ఒకే కుటుంబంగా మెలిగేవి. ఎవరికి ఏ కష్టం కలిగినా వూరు వూరంతా వారిని ఆదుకునే వారు. ఒక కుటుంబంలో పెళ్ళి లాంటి శుభ కార్వం జరిగినా..... చావు లాంటి అశుభ కార్యం జరిగినా ఆ వూరి వారంతా ఆ ఇంట్లో తామె చేయగలిగిన పని చేసేవారు. అలా అంతా ఐకమత్యంతో జీవనం సాగించే వారు. 

కానీ..ఇప్పుడు..ఉమ్మడి కుటుంబం మచ్చుకైనా లేదు. దాంతో...ఐకమత్యము, ఆత్మీయత, ప్రేమ, అనురాగము, అనే వాటికి అర్థం లేకుండా పోయింది. పక్కింట్లో ఏదైనా ఆపద సంబవిస్తే.... మాట వరసకు పలకరింపులు తప్ప మరే సహాయ సహకారాలు అందించడం లేదు. ఎదుటి వారు కూడా వారి సహాయ సహకారాలను కూడా ఆసించడము లేదు. ఇది కాలాను గుణంగా వస్తున్న మార్పు. 

సేకరణ & అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి 

15, జులై 2019, సోమవారం

ఆధునిక సమాజంలో భారతీయ కుటుంబ విలువల పతనానికి కారణం ఎవరు ? - Who destroy our family values


ఆధునిక సమాజంలో భారతీయ కుటుంబ విలువల పతనానికి కారణం ఎవరు ? - Who destroy our family values
ధునిక సమాజంలో 1970 సంవత్సరం తరువాత ప్రతీ ఇంట్లో ముసలి తల్లితండ్రుల్ని కొడుకులు కోడళ్ళు కన్నవారి ఆలనా పాలనా బాగోగులు చూసుకోకుండా వీధిలోకి గెంటి వేయటం ప్రారంభమైంది. వృద్ధ ఆశ్రమాలు కూడా క్రమక్రంగా దేశ వ్యాప్తంగా తెరిచారు. అటు పిమ్మట గత నాలుగున్నర దశాబ్దాల నుండి అమ్మ నాన్నలను కన్న వదిలించుకోవటం పెంచిన పిల్లలకు జీవిత నాటకములో మామూలు విద్యుక్త ధర్మంగా మారింది. ఈ అప్రాచ్యపు అలవాటు ఆధునిక ప్రాపంచిక వైరసుగా మన భారత దేశ సనాతన కుటుంబవ్యవస్థలోకి ప్రవేశించటానికి ప్రధాన కారణం.

మన పురాతన సంప్రదాయ సామజిక కట్టుబాట్లు సమూలంగా క్రూకటివేళ్ళతో సడలిపోవటమే. మన నవనూతన తరములో ఏకో నారాయణ లాంటి విడిపోయిన నేటి ప్రతి ఇంట్లో పూర్తి ప్రాపంచిక, జీవిత అనుభవం లేని ధనార్జనే మిదం జగత్ అని భావించిన ఈనాటి తల్లితండ్రుల కన్నపిల్లల అనుభవరాహిత్య పెంపకంలో, సంసారాలు సాగటం.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నా, భిన్న మవటం, అఖండ జీవిత, ప్రాపంచిక అనుభవ కలిగిన తాత గారు, బామ్మ గారు, అమ్మమ గారి యాజమాన్యం లేని లోటుతో ప్రతి కుటుంబం నేడు నడవటం. వారి అమ్మ,నాన్న తిట్లు, బుద్ది చెప్పేందుకు మొక్కలు విరిగేలా దండన లేకపోవడం. సంఘలో, నలుగురు మన ప్రవర్తన చూసి ఏమనుకుంటారో అన్న సిగ్గు,లజ్జ లేకుండా బరి తెగించి పెద్ద, చిన్న విచక్షణ లేకుండా ఆడా,మగా, వయస్సుతో నిమిత్తం లేకుండా హద్దులు మరిచి అతితేవితేటలతో పేట్రేగాటమే ఒక కారణంగా మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెతను మన పిల్లల పెంపకం భాగవతం గుర్తు చేస్తున్నది. .ఇందుకు ఆజ్యం పోసిన, పోస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. 

కలికాలం ప్రభావంగా మనుషులు ఆడ,మగా తేడా లేకుండా స్వార్థ బుద్ధితో తమ విద్యుక్త ధర్మాలు మరవడము, మానటమే. అందరికి సర్వస్వాతంత్రం, మాటలాడటం, ప్రతిపనీ విచ్చలవిడిగా ఎదురు బెదురూ లేకుండా చేయడం, పుష్కలంగా చేతుల్లోకి డబ్బు రావడం , ఖర్చుచేయడం, ఉచ్చు విప్పిన ఆంబోతులా ఎప్పుడైతే ఇంట,బైట చిన్న,పెద్దలకు యాజమాన్య దండన భయం పోయిందో. ఆ రోజు నుంచే మన కుటుంబ వ్యవస్థ, దేశ వ్యవస్థ పరిపాలన గాడి తప్పి సర్వనాశనమైయింది. 
సింహాం లాంటి మన పూర్వీకులు ఇంట్లో మరియు దేశంలో పరమపదించిన తరువాత క్రమశిక్షణా చర్యలు నామరూపాలు లేకుండా పోయాయి. అందుకు తగ్గ కీలెరిగి వాత పెట్టె కఠిన శిక్ష ఇంట,బైట మరుగై పోయాయి.
 • మరొక ముఖ్య కారణం, ఈ కాలం స్త్రీలకు డబ్బు సంపాయించాలన్న కోరికతో ఇల్లు, సంసారం పిల్లల ఆలన, పాలన, కన్న పిల్లల్ని క్రమ శిక్షణతో పెంచాలన్న విషయం మరిచిపోవడం?
 • ఆడవాళ్ళు ఉద్యోగ సమస్యలకు ,బరువు బాధ్యతలో తమ శక్తి,యుక్తుల్ని ధార పోయడం.
 • పిల్లల పెంపకం అనే మహా క్రతువును ఎలా నీరు కరుస్తున్నదో? ఒకదాని కొకటి లింకుగా ఈనాడు మన సమాజ అస్తవ్యస్త తీరుతెన్నుల రంగుల వలలో కొట్టు మిట్టాడుతున్న మన అందరికి తెలిసిన విషయమే. 
మగవాళ్ళు దేశానికి రాజైన ఇంట్లో పిల్లల్ని పెంచలేరు, దార్లో పెట్టలేరు.ఆడవారు తల్లిగా తమ కన్న పిల్లణ్ణి ఉగ్గు పాలతో ఈ జీవిత నాటకానికి పనికొచ్చేలా మానసికంగా సంస్కరించిన నాడే.మగవాళ్ళు తండ్రి పాత్రలో పిల్లణ్ణి వంశోధరకుల్లా, దేశోద్ధారకుల్లా భయ, భక్తులు, వినయ, విధేయతలు రంగరించి మానవత్వ విలువలు అవపోసన పట్టిన ఓ మనిషిగా తీర్చిదిద్ధి నవ నూతన సంస్కర్తలుగా తమ కన్న పిల్లణ్ణి సమాజకి, దేశానికి పరిచయం చేయగలరు.

కన్నపిల్లలు ఆడా,మగా ఎవరైనా సరే తల్లి తండ్రుల చెప్పు చేతుల్లో గత తరాల మన పూర్వికుల యాజమాన్య పాలనలో లా, విద్య, బుద్ధులు ప్రాపంచిక జ్ఞానం వచ్చేవరకు శిక్షణ పొందని పక్షంలో ఈనాటి తరం పిల్లలు వంశ ద్రోహులుగా,దేశ ద్రోహులుగా తయారయితారు. ఆ ముచ్చట, మురిపం ప్రస్తుతం మన సమాజంలో ప్రతి తల్లి తండ్రి అనుభవిస్తున్న జీర్ణించుకోలేని జీవం మరణ సమస్యాత్మక విషయం. నేటి పౌరులే రేపటి దేశ నిర్మాతలన్నట్లు ,నేటి కన్న పిల్లలే రేపటి వంశోద్ధారకులు.ఇంట్లో తల్లి తండ్రులు,పాఠశాలలో గురువులు నేడు పిల్లల్ని సంస్క రిస్తేనే మన కన్న పిల్లలు భవిషత్తులో కుటుంబాలు,యావత్ దేశాన్ని నడిపే ఆణిముత్యాలుగా తయారవుతారు.

కాబట్టి మన పిల్లలకు వారి చిన్నతనం నుండి జీవిత నాటకానికి కావాల్సిన మన ప్రాపంచిక జీవితానుభం నరనరాన నూరి పోయడం తల్లితండ్రులుగా మన విద్యుక్త ధర్మం.మన కన్న పిల్లలే మన భవిష్యత్తుకు ఆసరా.ఆడ,మగా పిల్లలకు జీవిత నాటక దిన చర్య అనుభవాలు అడుగడునా ప్రతి విషయంలో క్షుణ్ణంగా తెలియజేస్తే వారు అనుభవజ్ఞులై మనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మనకు సహకరిస్తారు.పిల్లలు పెడచెవిన పెడితే నయనా, భయానా వారిని దండించి సన్మార్గంలో పెట్టె సర్వ హక్కులు తల్లితండ్రుగా మనకున్నవి.

ఇక ఆడ పిల్లలకు, మగ పిల్లలకు ఇంటి బాధ్యతలు, ప్రాపంచిక బాధ్యతలు ఉగ్గు పాల ప్రాయం నుండి నేర్పుతే రెండు విధాలా మన పిల్లలు మన కుటుంబానికి మరియు మన దేశానికి వన్నె తెస్తారు.దానికి రుజువు గత శతాబ్దాల మన మహామహుల కుటుంబ పాలనే సాక్షం. తల్లితండ్రులు, గురువులు చెక్కిన శిల్పాలుగా జీవితానుభవం కల్గిన మన సంతానము మన చరమాంకంలో మన జీవీతానికి శ్రీరామరక్ష.

జీవీతానుభవం అణువణువునా పుణికిపుచ్చుకున్న ప్రతి ఆడ పిల్ల రేపు వివాహమై ఓ ఇంటి కోడలుగా వెళ్లిన తరువాత ఒక అనుభవజ్ఞురాలైన తల్లిగా మెట్టినింట్లో అత్తా, మామగార్ల, యావత్ మెట్టినింటి కుటుంబ సభ్యుల ఆలనా పాలన తన కన్న పిల్లలతో సమానంగా చూసుకుంటుందనటంలో అతిశయోక్తిలేదు అలాగే ఒక మగ పిల్లవాడు వివాహం ఆయన తర్వాత ఓ తండ్రిగా తన తల్లితండ్రుల్ని అంత్య కాలము వరకు బాధ్యతాయుతంగా కాపాడుతాడని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

కనుక ఈనాడు కన్న పిల్లలకు ప్రాపంచిక జీవిత నాటక అనుభవాల్ని,మానవ విలువల్ని అడుగడుగునా ఉగ్గుపాల ప్రాయం నుండి నరనరాన జీర్ణించుకునేలా తమ పాత్రను బాధ్యతా రహితంగా విస్మరించిన కన్న తల్లీతండ్రులే నేటి కుటుంబ,సామాజిక అస్తవ్యస్త ఘోర పరిస్థితులకు బాధ్యులు అని ఘంటాపధంగా చెప్పవచ్చు .ప్రాపంచిక జ్ఞానం లేని నేటి నవతారాన్ని దుయ్యబట్టి ప్రయోజనంలేదు. ఇప్పుడు చేతులు కాలింతవాత ఆకులు పట్టుకొని లాభమేంటి??? 
ఆనందమైన సాంప్రదాయ కుటుంబం 
తల్లితండ్రులు ఇలలో ప్రత్యక్ష దైవసమానులు.వారిని మానస,వాచా,కర్మణా కన్న సంతానంగా మనం వారిని సేవించటం మన జన్మ ప్రథమ కర్తవ్యం.వారు బ్రతికి ఉండగా తల్లితండ్రుల్ని మానససికంగా,శారీరకంగా నొప్పించి బాధపెడుతే ఎలాంటి ఘోరాతి ఘోరమైన విషమ పరిస్థితుల విషవలయాల్లో రంగుల వలల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయో?? 

ఈనాడు భూమ్మీద స్వంత తల్లితండ్రులు పరమపదించిన తరువాత ప్రతి గృహాంలో ప్రతి కన్నవారి జీవితాలు సర్వ జీవిత రంగాల్లో ఎలా అడవిని గాచిన వెన్నెలలా సాగుతున్నాయి మన అందరికి స్పష్టంగా సువిదితమే.

కనుక, ప్రతి కన్నసంతానం ప్రతి ఇంట్లో కలియుగ మాయలోనించి పూజ పునస్కారాలతో,నిత్య దైవ ధ్యానంతో బైటపడి మాత,పితృ సన్నిధానంలో వారికీ రేయింబవళ్లు పరిచర్యలు చేసి వారిని తృప్తిపరిచి వారి కృపకు,ఆశీర్వచన భాగ్యం పొందేందుకు కృషిచేస్తే ప్రతి కన్నసంతానం జన్మ ధన్యమౌతుంది.

.ఇక మరొహ కోణంలో ఈ విషయాన్ని ఆలోచిస్తే ,తల్లితండ్రులు మారాలి. ప్రపంచ నాటకంలో సంపాదనే ముఖ్యకాదని, కుటుంబ వ్యవస్థను కూడా సంస్కరించాలని సింహావలోకనం చేసుకొని తమ కన్న పిల్లల్ని వంశోద్దారకుల్లా, దేశోద్దారకుల్లా తయారు చేయడం తమ జన్మ హక్కుగా భావించి ప్రతీ కుటుంబంలో మనస్ఫూర్తిగా శపథం చేసి నడుం బిగించి కంకణం కట్టుకున్న నాడు మళ్ళీ ఈ భువిపై మన పూర్వీక కుటుంబ వ్యవస్థ చిగురిస్తుంది.ప్రతి కుటుంబం,యావత్ సమాజము, దేశము, ప్రపంచము మానవతా విలువలతో సువాసనా భరితమై ఈ భువి స్వర్గతుల్యమౌతుంది.

రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

""""AS PARENTS WE ARE NOT ONLY BODY GUARDS TO OUR CHILDREN.BUT ALSO,STRINGENTLY PUNISHING GOD FATHERS.WE HAVE TO INTERACT WITH OUR KIDS DAILY ONE HOUR TO ASSESS THEIR MORAL VALUES SPIRITUALITY STANDARDS AND WORLD KNOWLEDGE ACQUAINTANCE& PRACTICE FOR FAVOR OF OUR KIDS POSITIVE LIFE AFFAIRS ENACT FUTURE NEXT. IF,ANY, DISCREPANCY OBSERVED IN THEIR BEHAVIOR,WE SHOULD HAVE TAKE ACTION IMMEDIATELY TO RECTIFY THE NEGATIVE FLASHING THOUGHT&ACTIONS OF OUR KIDS ON WAR FOOT SPIRIT WITHOUT ANY FURTHER COMPROMISE AND DELAY. IT IS OUR BIRTH FUNDAMENTAL RESPONSIBILITY AS PARENTS OF CHILDREN CONCERNED,

IF ANY THING GOES WRONG &FOUND ABNORMAL WORST WITH RESPECT TO CHILDREN CHARACTER MORALITY& ETHICS ASPECT POINT OF VIEW AND FINALLY JUDGED BY COURT OF LAW. THE MOTHER WHO HAS HAD GIVEN BIRTH TO CHILDREN BY BEARING NINE MONTH IN HER BELLY.HAVING CENT PERCENT LEGAL RIGHTS TO HANG OR SHOOT TO MURDER THE CULPRIT KID CONCERNED FOR THE SAKE OF SOCIETY, COUNTRY &WORLD MORAL VALUES SHIELD POINT OF VIEW BY INTERNATIONAL COURT OF LAW. """""


సర్వేజనాసుఖినోభవంతూ. 

ఓం 

21, ఏప్రిల్ 2018, శనివారం

పురుషుడు భార్యని ఎలా గురవించాలి - Purushudu bharyani yela gauravinchali - How to give respect women

పురుషుడు భార్యని ఎలా గురవించాలి - Purushudu bharyani yela gauravinchali - How to give respect women
స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చెసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్నీ, సంతానాన్నీ, ధనాన్నీ, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.
 • అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.
 • భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.
 • ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.
 • పిల్లలతొ సరళ సంభాషణలు చేయాలి.
 • పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.
 • ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.
 • భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.
 • ఆమె అభిప్రాయలను గౌరవించాలి.
 • భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.
 • భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.
 • భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.
 • భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండ, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

9, జనవరి 2018, మంగళవారం

" తల్లితండ్రులు " గొప్పవారని ఎందుకు పిలుస్తారు? Why mother and father called great

" తల్లితండ్రులు " గొప్పవారని ఎందుకు పిలుస్తారు? Why mother and father called great

ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును.

సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.

ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధయాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


16, నవంబర్ 2017, గురువారం

వృద్ధాశ్రమాలలో తల్లితండ్రులు - పతనమవుతున్న కుటుంబ విలువలు

/vruddhasramam-lo-thalli-thandrulu-old-age-parents

వృద్ధాశ్రమాలలో తల్లితండ్రులు:

ఈ నాటి ప్రపంచంలో యువత, బాల, బాలికలు, ఈ లోకం ధర్మపథంలో నడవాలంటే, నిలబడాలంటే, ప్రతి ఇంటిలోనూ నాన్నమ్మలు, అమ్మమ్మలు ఉండితీరాలి. కానీ నేడు నాన్నమ్మలు, అమ్మమ్మలు వృద్ధాశ్రమాలాలో ఉంటున్నారు. వృద్ధులు గనుక వారు మన ఇళ్లలోనే వారు ఉండితీరాలి.

ఎందుకంటే ఇక్కడ ఒక పర్యాయము బాగా ఆలోచించండి, మన కొరకు మన తల్లితండ్రులు నిద్రాహారాలు లేక మనకు సేవలు చేస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కదా, ఎన్ని ఉపవాసాలు చేశారో, ఎన్ని మ్రొక్కులు మ్రోక్కెరో, ఎంత శ్రమ చేసేరో, ఎంత వ్యధ చెందినారో, అన్నిశ్రమలూ పడితేనేకదా మనము ఈ రోజున ఇంతవారమయ్యాము. వారికి ఆకలేసినా వారు కడుపు మాడ్చుకొని మనకు మూడుపూటలా అన్నం పెడితే తిని వృద్ధి చెందినవారము కాదా? దినకూలీ చేసుకునే తల్లితండ్రులు కూడా నా బిడ్డ ఇంగ్లీషు చదువులు చదివి అభివృద్ధి చెందాలని వృద్దిలోనికి రావాలని, మనము పడే కాయ కష్టము మనబిడ్డలు పడకూడదని పస్తులుండి మనకు అన్నం పెట్టి మన స్కూల్ ఫీజులు కట్టినవారు మన తల్లితండ్రులు. మనము చిన్నతనములో కానీ, యవ్వనములో కానీ మన తల్లితండ్రులకు కోపముకలిగించే పనులు, విసిగించే పనులు, అసహ్యము కలిగించే పనులు చేయకనే ఇంతవారమయ్యామా? ఒకసారి మనస్పూర్తిగా ఆలోచించండి.

/vruddhasramam-lo-thalli-thandrulu-old-age-parents

మరి ఆనాడు మనలను మన తల్లి తండ్రులు మనలను అసహ్యహిచుకొని, కోపగించుకొని వదలేసి ఉంటే మనము ఏ అనాధాశ్రమము పాలో అయి ఉండేవాళ్లము కదా? లేక ఏ వీధి రౌడీగానో, ఏ దొంగగానో, రాక్షస ప్రవృత్తులతో పదిమందీ అసహ్యకించుకొనేలా బ్రతుకుతూ ఉండేవారము. ఈ సభ్య సమాజములో నిర్భయముగా జీవించే అవకాశము ఉండేదా? ఇది నేర్పినవారు ఈ విధముగా మనలను తీర్చిదిద్ది,విద్యాబుద్ధులు, సభ్యత, సంస్కారములు నేర్పి ఈ నాడు మనకు ఈ సభ్య సమాజములో అందుచున్న ఈ గౌరవ ప్రతిష్టలను భిక్షగా పెట్టినవారు మన తల్లితండ్రులు.

మనము అభివృద్ధిలోకి వస్తే, ఒక ఉద్యోగము రావడం, ఉద్యోగములో ప్రమోషన్లురావడం, వ్యాపారమైతే ఆర్ధికముగా బాగా స్తిరపడి, ఉన్నతస్థాయికి రావడం, ఒకగొప్ప పదవిని చేపట్టి పదిమందిచేత మంచివాడు అనిపించుకొనడం ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి తల్లితండ్రులు ఎంత పొంగిపోతారో, ఒకవేళ వారు వృద్ధాశ్రమాలాలోఉన్నా వారికి ఈ విషయం తెలిస్తే ఎంత పొంగిపోతారో, పొంగి తబ్బిబై పోయి మనలను ఆ ఆనంద హృదయముతో దీవిస్తారు, ఆ దీవనలే మనకు శ్రీరామరక్ష. గుడిలో దేవుని ఆశీస్సులకన్నా, గుడిలో అమ్మవారి అనుగ్రహముకన్నా తల్లితండ్రులు ఆనంద హృదయముతో పరవశించి దీవించే దీవెనలు శ్రేయస్కరమైనవి. అవే మనకు శ్రీరామరక్ష. ఎందుకంటే కరచరణాదులతో కదలాడుతూ, మనకు సేవలుచేసి, వృద్ధాప్యములో మనచేత సేవలు చేయించుకొనే ప్రత్యక్ష్య దేవుళ్లు తల్లితండ్రులు. వారికి మించిన దైవములేదు.
కాబట్టి వారు పొరపా టునకూడా మనలను తిట్టరు శపించరు. వాడు పిల్లాపాపలతో పదికాలాలపాటూ చల్లాగాఉంటే అంతేచాలు అదే మాకు పదివేలు అంటారే కానీ,పొరపాటున కూడా మనలను తిట్టరు శపించరు అదే (అదే భగవంతుడు, భగవంతుడుకూడా ఎవరినీ శపించడు, తిట్టడు బగవంతునికి అందరూ సమానమే) మాతృహృదయం. మరి అలాంటి మన తల్లితండ్రులను, నాన్నమ్మలను ,అమ్మమ్మలను, తాతయ్యలను విజ్ఞులమైన మనము వృద్ధాశ్రమాలాలో ఉంచడము ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. అసలు వారిని వృద్ధాశ్రమాలలో ఉంచడానికి గల కారణాలను ఒక పరి లోతుగా పరిశీలిస్తే మనకు బోధపడేఅంశాలు, అమ్మ నాన్నలు మన మాట వినలేదనో, వారికి సేవలు చేయవలసి వస్తుందనో, మన సుఖసంతోషాలకు ఆటంకమనో, లేదా వారి అనారో గ్యమునకు, మందులకు, డాక్టర్లకు డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుందనో కారణాలు తప్ప మరే ఇతర కారణాలు కనబడుటలేదు. మనము మన తల్లితండ్రులను చిన్నతనములో,యవ్వనములో, చదువు కునే రోజులలో క్లేశములు కలిగించలేదా? మరి వారు కూడా మనలాగే ఆలోచించి మనలను నిర్లక్ష్యము చేసిఉంటే మనకు ఈ రోజు ఈ స్థితి ఉండేదా? మరి చిన్నతనములో, యవ్వనములో, చదువుకునే రోజులలో, మనము మన తల్లితండ్రులు కు కలిగించిన క్లేశములకంటే, మన తల్లితండ్రులు మనకు ఎక్కువ క్లేశము కలిగించినారా?బాగా ఆలోచించండి.

మరి మన పిల్లలు మన తల్లితండ్రులలాగే విసిగిస్తారు, కోపం తెప్పిస్తారు, అనవసర ఖర్చులు చేయిస్తారు మరి మనబిడ్డలను మనము పై కారణాల వలన ఏ ఆశ్రమములోనో లేదా ఏ వసతి గృహలలోనో వదలివేయగలమా?వదలలే ము. ఎందుకు? మనది కన్నప్రేమ, పెంచినప్రేమ, మమకారము, కడుపుతీపి, పేగుబంధము కదా! మన తల్లితండ్రులకు మనపట్ల ఇవి ఉండవా? మన పిల్లలకు బడిలోనో లేదా ఒక కాలేజీ లోనో మంచి మార్కులు వస్తే, లేదా MBBS లోనో , లేదా ఏ BITSPILANI లోనో, IIT లోనో, ఏదో ఉన్నత కళాశాలలో ఫ్రీ సీటు వస్తే మనము ఎంతసంతోషిస్తాము, పదిమంది మనలను మన బిడ్డలనూ అభినందిస్తుంటే ఎంత పొంగిపోతాము, మరి ఇవన్నీ మన తల్లితండ్రులకు మనమీద ఉండవా? వారు మన దినదినాభివృద్ధిని చూచి పొంగిపోవాలని, ఆ ఆనందాన్ని పదిమందితో వారి స్నేహితులతో బంధువర్గముతో పంచుకోవాలని ఆనందించాలని, వారికుండదా? ఆలోచించండి.
కాబట్టి మన తల్లితండ్రులను, నాన్నమ్మలను , అమ్మమ్మలను, తాతయ్యలను వృద్ధాశ్రమాలాలో కాక వారు మన ఇంటిలోనే ఉంటే, ఆలోచించండి మనము మన తల్లి,తండ్రుల ఋణమును కొంతవరకైనా తీర్చుకొన్నవారము అవుతాము. తల్లికి ఎంత సేవ చేసినా తల్లి ఋణము తీరేదికాదు.
తల్లితండ్రులకు సేవలు, సపర్యలు,చేయడం ఎంత గౌరవం ఎన్ని జన్మజన్మల పుణ్యమో, తల్లి ఋణము తీర్చుకునే భాగ్యము మనకు కలుగుతుంది. అందుకే “నేను ఇంకా మా అమ్మకు అన్నం పెడుతున్నాను” అని ఎప్పుడు కానీ పొరపాటున కూడా అనరాదు. 
అంతకంటే దౌర్భాగ్యపు బ్రతుకు, మానవత్వము ను మరచిన బ్రతుకు, మరొకటి లేదు. కృతఘ్నతకు ఇంత కంటే నిదర్శనము మరోటిలేదు. తల్లి సాక్షాత్తు పరదేవత. నేను ఇంకా ఇంత వయసు వచ్చినా(55 సం|| 60 స|| వచ్చినా అంటే తల్లి తండ్రులు కలిగి వున్నవారు) “నేను ఇంకా మా అమ్మ చేతి అన్నం తింటున్నాను” అని సగర్వంగా త్రికరణశుద్దిగా చెప్పుకొని పొంగి పోయే జన్మము ధన్యము. తల్లి తండ్రుల అవసరాలు తీర్చుచూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఇక్కడ మరో విషయం బాగా ఆలోచించండి.

తల్లి తండ్రులను మనం సేవించడం వలన మనకు పుణ్యప్రదము మరియు వయో వృద్ధులు , జ్ఞానవృద్ధులు అనుభవ వృద్ధులు ఐన తల్లితండ్రులు ఇంటిలో ఉండడం వలన వారి ద్వారా మన పిల్లలకు మనము అపారమైన, విలువ కట్టలేని, ఆధ్యాత్మికమైన, ధార్మికమైన, పురాణ విషయ సంపదలు, అనుభవపూర్వ కమైన మంచి చెడు విషయములు, అందించినవారమౌతాము. వాటి యొక్క విలువలు మనకు ఇప్పుడు తెలియవు. మన పిల్లలు ప్రయోజకులై ఈ ప్రపంచంలో బ్రతుకు తెరువుకై వెళ్ళినపుడు మాత్రమే అవగతమవుతాయి. ఈ సమాజంలో ప్రతి మనిషి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ పరంగా ఉదయం నుండి సాయంకాలంవరకు, మరీ రాత్రి వరకు బయట అలసి సొలసి విశ్రాంతికై ఇంటికి చేరుతారు. అప్పుడు మన పిల్లలు సందేహాలు, ధర్మ విషయాలు, న్యాయాన్యాయ విషయాలు, సమాజ విషయ సందేహాలు మనల్ని అడిగితే, మనము మన శారీరక, మానసిక, బడలికల వలన విసుగు ప్రదర్శించడం. లేదా మీ టీచర్లను అడగండి అనడం, మరీ మరీ అడిగితే ఇప్పుడు కాదు, అని విసిగించుకోవడం జరుగుతుంది. ఔనా? మరి మన పిల్లల సందేహాలు మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఎలా తెలుసుకుంటారు ఆలోచించండి.

కాబట్టి ఇంటిలో అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఉన్నట్లయితే మనకు ఈ శ్రమ ఉండదు కదా?మరియు పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు.
 • మరొక్క విషయము ఆలోచిస్తాము మనకు ఈ యవ్వనము శాశ్వతమా? 
 • ఈ దేహము శాశ్వతమా? మన శరీయములో ఉన్న ఈ బలము శాశ్వతమా? ఈ సంపదలు శాశ్వతమా? 
 • మనకు వృద్ధాప్యము రాదా? 
 • మరి మనలను మనబిడ్డలు వృద్ధాశ్రమములో ఉంచరని గ్యారంటీ ఉందా? 
 • అపుడు మనకు కలిగే ఆలోచనలు మనలో జరిగే సంఘర్షణలు ఇపుడు మనతల్లితండ్రులకు ఉండవా? ఎక్కడుంది ధర్మము. మనము మనసంస్కృతి ఎక్కడికి వెళుతోంది? 
 • నిజానికిమనము ఎక్కడ ఉన్నాము? 
 • కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములలో ఈ వృద్ధాశ్రమాలు ఉన్నట్లు దాఖలాలు లేవు. ఈ కలియుగములోనే అనాధాశ్ర మాలు, వృద్ధాశ్రమాలు, చైల్డ్ కేర్ సెంటర్లు పట్టణాలలో వీధికొకటి వెలుస్తున్నా యి. మరీ ప్రతి మండల కేంద్రములో ఒక వృద్ధాశ్రమము వెలుస్తున్నది. ఇది వ్యాపారమే కావచ్చు కానీ ఆశ్రమ నిర్వాహకులు ఎంత సేవచేసినా ఆ వృద్దులకు తృప్తికలుగుతుందా?
 • మనము ఇచ్చే పది రూపాయలతో వారి సేవలకు విలువ కట్టగలమా?మరి వారు ఎంతో సహృదయముతో సేవాధృక్పధముతో వారుచేసే శ్రమకు, సహనానికి, సేవలకు మనము విలువ కట్టగలమా?
 • ఆ వృద్ధులు తృప్తిపడితేనేకదా వారి సేవలకు విలువ? ఆ వృద్దులకు ఏమను కుంటారు మనబిడ్డే ఉంటే ఎంతబాగా చూచు కొనేవాడో కదా అంటారు కానీ తృప్తిపడరు. అవునా?
మన బిడ్డలు మన ప్రతిచర్యనూ మన బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారనేవిషయం మనము మరువరాదు. మన నడవడిని మన ప్రతి అడుగునూ గమనించే మన బిడ్డలు, వారుకూడా అలాగే ఉండాలని, నడవాలని అలాగే ప్రవర్తించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎలాగంటే వేప విత్తనమును నాటి మామిడిపళ్లు కావాలంటే వస్తాయా రావు వేపపళ్లే వస్తాయి, ఆలోచించండి?


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి