విడిది ఇంట్లో సాంప్రదాయకంగా ఇవ్వవలసినవి, చేయవలసినవి ! - Vididhi intlo sampradayam

vididi-intlo-cheyavalasinavi

విడిది ఇంట్లో ఇవ్వవలసినవి, చేయవలసినవి:

1. చమురు కుంకుడు కాయ పళ్ళెము:
విడిది ఇంటికి వచ్చినాక ఇచ్చెదరు. ఒక పళ్ళెములో టర్కీటవలు, షాంపు సీసా, నూనె సీసా, కుంకుడు కాయలు, పౌడరు డబ్బా, సబ్బులు 2, అద్దము, దువ్వెన, 2 స్టీలు డబ్బాలు, లేక 2 వెండి కప్పులు పెట్టవచ్చును. వియ్యపురాలికి బొట్టు పెట్టి పెండ్లికి రెడీ అవ్వండి అని ఇచ్చెదరు.

2. కాఫీ, ఉప్మా గిన్నెలు:
పెద్ద సైజువి గిన్నెలు 2, మూతలు 2, గరిటెలు 2, కొద్ది టిఫిను ఒక గిన్నెలో పెట్టి వియ్యపురాలికి విడిది ఇంట్లో ఇవ్వవలెను.

3. వరపూజ:
ఒక పళ్ళెములో వెండి శుభలేఖ, మామూలు శుభలేఖ, పర్‌ఫ్యూమ్‌ స్ప్రే లేక పన్నీరు బుడ్డి, 2 జాకెటు ముక్కలు, పసుపు, కుంకుమ, పూలదండ, నాప్‌కిన్‌, అల్లుడుగారికి మంచి కండువా, బట్టలు, పానకము బిందెలు 2, వెండి గ్లాసు ఇవన్నీ పెట్టి ఇవ్వవలెను. పానకము కలుపవలెను. కొందరు రస్నా కలిపి ఇచ్చెదరు, అయిననూ శాస్త్రముగా పానకము కలపవలెను.

వరపూజ అయినాక అందరికి పానకము ఇవ్వవలెను. ప్లాస్టిక్‌ గ్లాసులలో ఇవ్వవచ్చును. ముఖ్యమైన వారికి స్టీలు గ్లాసులు కొత్తవి ఇవ్వవచ్చును.

4. ముఖాలు కడిగించుట:
vididi-intlo-cheyavalasinaviపెండ్లికూతురు తల్లి పెండ్లికొడుకు తల్లిని, వారి బంధువులను కుర్చీలలో కూర్చొనపెట్టుదురు. టూత్‌పేస్ట్‌, బ్రష్‌ను పట్టుకుని, బ్రష్‌ వెనుక వైపు చూపుతూ వారి అందరి ముందు నడచెదరు. అద్దము వెనుక వైపు చూపుతూ దువ్వెన వెనుకవైపుకు పెట్టి దువ్వెదరు. మరమరాల దండలు, కూరలతో దండలు, చాక్లెటు కాగితముతో దండలు, బిస్కెట్‌తో దండలు అందరికి మెడలో వేసి అలంకరించెదరు.

కిరీటములు, వడ్రాణములు, వంకీలు, టోపీలు, బంగారపు కలరు కాగితముతో తయారు చేసిన చీర పెట్టెదరు. దోసకాయ చదరముగా గుంటచేసి నిమ్మచెక్కలో నూనెపోసి దోసకాయలో పెట్టి కుడిచేతితో దోసకాయ తొడిమ పట్టుకుని ఎడమ చేతితో హారతి అద్దెదరు, లేనిచో బంగాళదుంప గుంటచేసి నూనెపోసి వత్తిపెట్టి ఎడమచేతితో హారతి ఇచ్చెదరు.

ఒక ప్లేటు పట్టుకుని స్పూనుతో శబ్దము చేయుదురు. వీపరాలికి లడ్డు, అరిశెలు, అప్పడాలు, వడియాలు, మినపపిండిముద్ద, చీర, పసుపు కుంకుమ పెట్టెదరు. అందరికి పంచిపెట్టు సామాను ఇచ్చెదరు.

పెండ్లికొడుకు తల్లి పెండ్లికూతురు తల్లిని, వారి బంధువులను కూర్చొనపెట్టి ఇదే విధముగా జరుపుదురు. స్నాతకము అయినాక ముఖాలు కడిగించి వివాహమునకు రమ్మని చెప్పెదరు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top