నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
పంచాంగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంచాంగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2020, మంగళవారం

ఉగాది - మీకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోండి - Ugadi festival

ఉగాది - మీకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోండి - Ugadi festival
సంవత్సరంలో మొదటి రోజైన ఉగాదికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత  "జనవరి ఫస్ట్’కి లేదు. ఆ ప్రాముఖ్యత భూమి లోపల జరుగుతున్నదానికీ, మనిషి శరీరంలో, మనస్సులో జరుగుతున్నదానికీ సంబంధించినది. ఉగాది మనిషి శరీర నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న చంద్రమాన-సౌరమాన పంచాంగాన్ని(క్యాలండర్‌ని) అనుసరిస్తుంది. గ్రహగతితో మిమ్మల్ని అనుసంధానం చేస్తూ ఉండటం వల్ల భారతీయ క్యాలండర్ సాంస్కృతికంగానే గాక, శాస్త్రీయంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది.

తరతరాలుగా భారతీయులు అనుసరిస్తున్న చంద్రమాన-సౌరమాన పంచాంగం ప్రకారం సంవత్సరంలోని మొదటి రోజుని “చంద్రమాన ఉగాది” అంటారు. తూర్పు సంస్కృతి నుంచి వచ్చే అన్నిటి లాగానే, పంచాంగం(క్యాలండర్) కూడా మనిషి శరీరంలో, చేతన(consciousness)లో జరుగుతున్న వాటికి అనుగుణంగానే ఉంటుంది. ఉగాది నుండి మొదలయ్యే మొదటి 21 రోజులలో భూమి ఒక పక్కకు వొంగి ఉండటం వల్ల ఉత్తరధృవం అత్యధిక సూర్యశక్తిని పొందుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల మనుషులకు ఇబ్బందికరంగా ఉంటుండవచ్చు కానీ, భూమి యొక్క బ్యాటరీలు నింపబడేది కూడా ఈ సమయంలోనే.
ఉగాదిని ‘నూతన సంవత్సర ఆరంభదినం’ గా జరుపుకుంటున్నది కేవలం నమ్మకం వలనో లేదా అనుకూలంగా ఉంటుందనో కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును ఎన్నో విధాలుగా పెంపొందించే ఒక శాస్త్రవిజ్ఞానమే ఉంది
ఉష్ణమండలాల్లో సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండే ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఈ సాంప్రదాయంలో, సంవత్సరంలో ఈ భాగాన్ని శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆముదం లాంటి నూనెలను విస్తృతంగా పూసుకొని ప్రారంభిస్తారు. గ్రహగతితో మానవ అనుభావానికి ఉన్న సంబంధాన్ని పట్టించుకోని ఆధునిక క్యాలండర్ల మాదిరిగా కాక, చంద్రమాన-సౌరమాన క్యాలండర్ గ్రహగతి వల్ల మనిషిలో కలిగే అనుభవాన్ని, అతనిపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే ఈ క్యాలండర్‌ని అక్షాంశాల ఆధారంగా సరిచేస్తారు.

ఉగాదిని ‘నూతన సంవత్సర ఆరంభదినం’ గా జరుపుకుంటున్నది కేవలం నమ్మకం వలనో
లేదా అనుకూలంగా ఉంటుందనో కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును ఎన్నో విధాలుగా పెంపొందించే ఒక శాస్త్రవిజ్ఞానమే ఉంది.మన దేశంలోని ప్రగాఢ జ్ఞానాన్ని ఈ రోజున ఒక పనికిమాలిని విషయంగా పరిగణిస్తున్నారు. దానికి కారణం కొన్ని దేశాలు మన దేశం కంటే ఎక్కువ ఆర్ధిక పురోగతిని సాధించడమే. మనం కూడా ఆ ఆర్ధిక పురోగతిని తొందరలోనే సాధిస్తాం, కాని ఈ సంస్కృతి అందిస్తున్న ప్రగాఢ జ్ఞానాన్ని కొన్ని సంవత్సరాలలో సృష్టించలేం. ఇది వేలాది సంవత్సరాల కృషి ఫలితం.

నూతన సంవత్సరం ఆరంభించడానికి మీరు చేయగలిగే అతి సులభమైన పని ఏమిటంటే మీరు ఫోన్ ఎత్తుకున్నప్పుడు, “హలో”, “హాయ్” లేదా అలాంటిదేదో అనకండి. “నమస్తే”, “నమస్కారం”, “నమస్కార్”  అని అనండి. ఇలాంటి పదాలను మన జీవితంలో ఉచ్చరించడంలో ఒక ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే మనం భగవంతునితో ఏమైతే అంటున్నామో లేదా చేస్తున్నామో, అదే మన చుట్టూ ఉన్న వాళ్లకు చేస్తున్నాము. ఇది అత్యున్నత జీవన విధానం.

మీకు ఒకటి ప్రవిత్రమైనదీ, మరొకటి అపవిత్రమైనదీ అయితే, అసలు విషయాన్ని మీరు ఏ మాత్రం గ్రహించటం లేదని అర్ధం. ఈ నూతన సంవత్సరాన్ని అందరిలో దైవత్వాన్ని గుర్తించే అవకాశంగా మీరు మలచుకోవాలని నేను ఆశిస్తున్నాను.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

14, జూన్ 2019, శుక్రవారం

పంచాంగము అంటే ఏమిటి ? - Panchangamu

పంచాంగము అంటే ఏమిటి ? - Panchangamu
సాదారణంగా ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు మన ఇంట్లో ఉన్నటు వంటి చిన్న పిల్లలను, హాయ్ కం హియర్ అంటూ దగ్గరకు తీసుకొని ఏదీ నీకు ఎన్ని రయిమ్స్ వచ్చో చెప్పు చూద్దాం? అని అడుగుతున్నారు. వాళ్ళేదో ఆంగ్లము లో నాలుగు ముక్కలు చెబితే మనం సంబర పడిపోతున్నాం....   కానీ, ఇప్పుడు పిల్లలను తెలుగులో వారముల పేర్లు అడిగితేనే తడబడు తున్నారు. పూర్వకాలము అలా కాకుండా, అమ్మమ్మలో, నానమ్మలో సాయంత్రము అయితే ఆరు బయట మంచం వేసుకుని దగ్గర పడుకో బెట్టుకోని  మన తెలుగు వారములు, తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాలు, ఇలా ఒకటేమిటి అన్నీ నేర్పేవారు. అలా కొంత వయస్సు వచ్చేటప్పటికి మనకు అవసరమైనంత వరకు పంచాంజ్గ్న పరిజ్ఞానం ఉండేది. మరిప్పుడో?

పంచాంగము అంటే ఏమిటి?  డాడీ అని అడిగే పరిస్థితి. అందుకే కొంతయునా తెలుసు కుందామని నా ఈ  చిన్న ప్రయత్నం..

పంచాంగము అనగా ఐదు అంగములు కలది. 
అవి: 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.

మొదటగా తిథిల గురించి తెలుసుకుందాం:

తిధులు : 15
1. పాడ్యమి 
   6. షష్ఠి 
 11. ఏకాదశి 
2. విదియ 
   7. సప్తమి 
 12. ద్వాదశి 
3. తదియ 
   8. అష్టమి 
 13. త్రయోదశి 
4. చవితి 
   9. నవమి 
 14. ద్వాదశి 
5. పంచమి 
 10. దశమి 
 15.పూర్ణిమలేకఅమావాస్య 

వారములు : 7
క్రమ సంఖ్య
తెలుగు నామము
సంస్కృత నామము
1
ఆదివారము 
భానువారము
2
సోమవారము
ఇందువారము
3
మంగళవారము
భౌమవారము
4
బుధవారము
సౌమ్యవారము
5
గురువారము
బృహస్పతివారము
 6 
శుక్రవారము 
భ్రుగువారము
7
శనివారము
మందవారము

నక్షత్రములు : 27
 1. అశ్వని 
 10. మఖ (మఘ)
 19. మూల
 2. భరణి 
 11.పుబ్బ(పూర్వఫల్గుని)
 20. పూర్వాషాడ 
 3. కృత్తిక 
 12. ఉత్తర(ఉత్తరఫల్గుని) 
 21. ఉత్తరాషాడ 
 4. రోహిణి
 13. హస్త 
 22. శ్రవణం
 5. మృగశిర 
 14. చిత్త (చిత్ర)
 23. ధనిష్ఠ 
 6. ఆరుద్ర (ఆర్ద్ర)
 15. స్వాతి 
 24. శతబిషం 
 7. పునర్వసు 
 16. విశాఖ 
 25. పూర్వాభాద్ర 
 8. పుష్యమి 
 17. అనూరాధ 
 26. ఉత్తరాభాద్ర 
 9. ఆశ్లేష (ఆశ్రేష) 
 18. జ్యేష్ఠ 
 27. రేవతి 

యోగములు :27
 1. విష్కంభము
 10. గండము
 19. పరిఘము
 2. ప్రీతి 
 11. వృద్ధి 
 20. శివము 
 3. ఆయుష్మాన్
 12. ధృవము 
 21. సిధ్ధము 
 4. సౌభాగ్యం 
 13. వ్యాఘాతము 
 22. సాధ్యము 
 5. శోభనం 
 14. హర్షణము 
 23. శుభము 
 6. అతిగండము
 15. వజ్రము 
 24. శుక్లము
 7. సుకర్మము
 16. సిద్ధి
 25. బ్రాహ్మము
 8. ధృతి 
 17. వ్యతీపాతము
 26. ఐంద్రము
 9. శూలము
 18. వరీయాన్ 
 27. వైధృతి 

కరణములు : 11
1. బవ 
   7. భద్ర  
 2. బాలవ 
   8. శకుని  
 3. కౌలువ 
   9. చతుష్పాతు  
 4. తైతుల  
 10. నాగవము  
 5. గరజ  
 11. కింస్తుఘ్నము  
 6. వణిజ 


ఆయనములు, పక్షములు గురించి తెలుసుకుందాం:

ఆయనములు: రెండు 

1. ఉత్తరాయనము : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలు మిధున రాశిలో  ఉన్నకాలము.
2. దక్షిణాయనము : సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు  ధనూరాశిలో ఉన్న కాలము.

పక్షములు : రెండు 

1. శుక్ల పక్షము (శుద్దము) : ప్రతి మాసమునందు మొదటి పదిహేను రోజులు. 
    శుక్ల పక్షమనగా చంద్రుని కళలు వృద్ధియగు దినములు. 
2. కృష్ణ పక్షము (బహుళము) : ప్రతి మాసమునందు రెండవ పదిహేను రోజులు. 
    కృష్ణ పక్షమనగా చంద్రుని కళలు క్షీణించు దినములు.

ఋతువులు: 6
1. వసంత ఋతువు
 చైత్ర మాసము 
 వైశాఖ మాసము


చెట్లు చిగురించును 

2. గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసము
ఆషాఢ మాసము


ఎండలు మండును  

3. వర్ష ఋతువు 
 శ్రావణ మాసము
భాద్రపద మాసము


వర్షములుకురియును 

 4. శరదృతువు 
ఆశ్వీయుజమాసము
 కార్తీక మాసము


వెన్నెల కాయును 

 5. హేమంతఋతువు 
మార్గశిర మాసము
 పుష్య మాసము


మంచు కురియును 

 6. శిశిర ఋతువు  
 మాఘ మాసము
 ఫాల్గుణ మాసము


ఆకులు  రాలును 
సంవత్సరములు: 60
1.ప్రభవ 
11.ఈశ్వర 
21.సర్వజిత్ 
31.హేవళంబి 
41.ప్లవంగ 
51.పింగళ  
2.విభవ 
12.బహుధాన్య 
22.సర్వధారి 
32. విళంబి 
42.కీలక 
52.కాళయుక్త 
3.శుక్ల 
13. ప్రమాథి 
23.విరోధి 
33.వికారి 
43.సౌమ్య 
53.సిద్దార్ధి 
4.ప్రమోద 
14. విక్రమ 
24.వికృతి 
34.శార్వరి 
44.సాధారణ 
54.రౌద్రి 
5.ప్రజాపతి 
15. వృష 
25.ఖర 
35.ప్లవ  
45.విరోధకృత్ 
55.దుర్మతి 
6.అంగీరస 
16. చిత్రభాను 
26. నందన 
36.శుభకృతు  
46.పరీధావి 
56.దుందుభి 
7.శ్రీముఖ 
17.సుభాను  
27.విజయ 
37.శోభకృతు 
47.ప్రమాది 
57.రుధిరోద్గారి 
8.భావ 
18.తారణ 
28.జయ 
38.క్రోధి 
48.ఆనంద 
58.రక్తాక్షి 
9.యువ 
19.పార్థివ 
29.మన్మధ 
39.విశ్వావసు
49.రాక్షస 
59.క్రోధన 
10.ధాత 
20.వ్యయ 
30.దుర్ముఖి 
40.పరాభవ 
50.నల 
60.క్షయ 

నవగ్రహములు 9
 1.రవి (సూర్యుడు)
 4.బుధుడు 
 7.శని 
 2.చంద్రుడు 
 5.గురువు(బృహస్పతి)
 8.రాహువు 
 3.కుజుడు (అంగారకుడు)
 6.శుక్రుడు 
 9.కేతువు 
రాహువు, కేతువులు ఛాయా గ్రహములు 

మాసములు: 12
 1. చైత్ర మాసము 
 7. ఆశ్వీయుజ మాసము
  2. వైశాఖ మాసము 
 8. కార్తీక మాసము 
  3. జ్యేష్ట మాసము 
  9. మార్గశిర మాసము 
  4. ఆషాడ మాసము 
 10. పుష్య మాసము 
  5. శ్రావణ మాసము 
 11. మాఘ మాసము 
 6. భాద్రపద మాసము 
 12. ఫాల్గుణ మాసము 

ద్వాదశరాశులు: 12
1. మేషము 
 7. తుల 
2. వృషభము 
 8. వృశ్చికము
3. మిధునము
   9. ధనుస్సు
4. కర్కాటకము  
 10. మకరము 
5. సింహము
 11. కుంభము 
6. కన్య  
 12. మీనము  

హోరా కాల చక్రము
ప్రతి హోరయు సూర్యోదయము మెదలు ఒక్కొక్క గంట కాలము చొప్పున తిరిగి సూర్యోదయము వరకు జరుగుచుండును.

దివాహోరా చక్రము(పగలు)
 వారము 
6మొ 
7వ  
7మొ 
8వ
8మొ 
9వ
9మొ 
10వ 
10మొ 
11వ 
11మొ
12వ 
12మొ
1వ 
1మొ
2వ 
2మొ
3వ  
3మొ
4వ 
4మొ
5వ  
5మొ
6వ 
అది 
స్యూర్య
శుక్ర
 బుధ
చంద్ర
శని
 గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
సోమ 
చంద్ర
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
మంగళ 
కుజ 
స్యూర్య
శుక్ర
 బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
బుధ 
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
గురు 
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
శుక్ర 
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
శని 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర

రాత్రి హోరా చక్రము(రాత్రి)
 వారము 
6మొ 
7వ  
7మొ 
8వ
8మొ 
9వ
9మొ 
10వ 
10మొ 
11వ 
11మొ
12వ 
12మొ
1వ 
1మొ
2వ 
2మొ
3వ  
3మొ
4వ 
4మొ
5వ  
5మొ
6వ 
అది 
గురు 
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
సోమ 
శుక్ర
బుధ 
చంద్ర 
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
మంగళ 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు 
చంద్ర
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర 
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని 
బుధ 
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 

షరా: చంద్ర, గురు, శుక్ర హోరలు శుభఫలమునుబుధ, కుజ హోరలు మధ్యమ ఫలమును,స్యూర్య, శని హోరలు అధమ ఫలమును ఇచ్చును. చంద్ర, గురు, శుక్ర హోరల యందు రాహుకాలముగా  ఊండినను కార్యానుకూలముగా ఉండునని శాస్త్ర వచనము. క్షీణ చంద్రుడు, పాప సహిత బుధుడు వీరు పాపులు అని తెలియవలసియున్నది. 

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి