నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
స్త్రీల ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్త్రీల ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఏప్రిల్ 2020, ఆదివారం

రక్తహీనత నివారణకు ప్రకృతి ఆహారము - Anemia, Raktahinathaరక్తహీనత నివారణకు ప్రకృతి ఆహారము - Anemia, Raktahinatha
రక్తహీనత వల్ల పూర్తి బలహీనం అవుతారు. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది.

రక్తహీనత క్షణాలు 
ముఖం పాలిపోయినట్లు ఉండటం, త్వరగా అసిపోవడం, చిరాకు, కోపం, అసహనం ఎక్కువుగా ఉంటాయి. ఆయాసం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం. నాుక మంట. మెడనొప్పి, తనొప్పి వస్తుంది.

నివారణ:
ఐరన్‌ లోపం వ్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీరానికి కావసిన ఐరన్‌ భించుటకు పండ్లు, పుట్టగొడుగు, ఆకుకూరు, తీగకు కాసే కాయ గూరు, ఖర్జురము, తేనె, సోయాబీన్స్‌, బీన్స్‌ సమృద్దిగా తీసుకోవాలి,  కూరలో నిమ్మకాయ పిండుకోవాలి. తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురంలో ఐరన్‌ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి. 

నిషిద్ధ ఆహరం:
 • 🙙 వైట్‌ బ్రెడ్‌, స్వీట్స్‌, పంచదార, వేపుళ్లు, న్వి పచ్చళ్ళు, మైదాపిండి మొదగునవి వాడకూదు. 
 • 🙙 ఐరన్‌ శరీరం గ్రహించాలి అంటే సీ విటమిన్‌ అవసరం ఉంటుంది. ఐరన్‌ టాబ్లెట్స్‌ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్‌ శరీరానికి అందించడం ఉత్తమం. 
 • 🙙 మద్యపానం, ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువ చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
పళ్ళు, కాయ రసములతో వైద్యం:
ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌లో ఒక స్పూన్‌ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు తీసుకోవాలి. ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్‌ పండు తినాలి. ఇలా చేస్తే కేవం నభై రోజులోనే శరీరంలో సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యే అవకాశం ఉంది.  దానిమ్మ జ్యూస్‌ తాగలేనివారు ఆపిల్‌ జ్యూస్‌లో కూడా గోధుమగడ్డి చూర్ణం కుపుకుని తాగవచ్చు.

సంకలనం: మాధవ్ బాలు చౌదరి 

28, మార్చి 2020, శనివారం

స్త్రీ ఆరోగ్య ప్రదాయిని "ప్రాణాయామము" - Pranayamam, Mahilaluస్త్రీ ఆరోగ్య ప్రదాయిని "ప్రాణాయామము" - Pranayamam, Mahilalu
సర్వరోగ నివారిని ప్రాణాయామం
తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు
ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు. నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.
ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.
ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.

వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
 • 🟔 ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
 • 🟔 శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
 • 🟔 రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
 • 🟔 బయటికి వెళ్లి పోతుంది.
 • 🟔 గుండెకు సత్తువ లభిస్తుంది.
 • 🟔 మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 • 🟔 ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
 • 🟔 జఠరాగ్ని పెరుగుతుంది.
 • 🟔 శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
 • 🟔 ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.
3. తీసుకోవలసిన జాగ్రత్తలు
 • 🟔 మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
 • 🟔 కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
 • 🟔 గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
 • 🟔 మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
 • 🟔 సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
 • 🟔 పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
 • 🟔 ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
 • 🟔 అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
 • 🟔 ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
 • 🟔 పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
 • 🟔 నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
 • 🟔 నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
 • 🟔 ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
 •  రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన  వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
 • 🟔 ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
 • 🟔 ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి 

23, డిసెంబర్ 2019, సోమవారం

సాంప్రదాయిక పద్దతిలో " కాలకృత్యములు" తీర్చుకొనుట - Kaalakrutyamulu (Strii Hithabodini )

సాంప్రదాయిక పద్దతిలో " కాలకృత్యములు" తీర్చుకొనుట - Kaalakrutyamulu (Strii Hithabodini )
ఉదయము నుండి రాత్రి పరుండు వఱకు స్త్రీ, ఆచరింపవలసిన విధులను ఈ గ్రంథక రతి శ్రీమతి, సౌభాగ్యవతి శారదాదేవి గారు చక్కగా చిత్రించినారు.

కాలకృత్యములు
ప్రతివారును సూర్యోదయమునకు ముందే నిద్ర మేల్కొని మల మూత్ర విసర్జనము చేయవలెను. పట్టణములలో నుండువారు మలవిసర్జనమునకు మరుగుదొడ్ల లోనికి వెళ్ళవలసి యుండును. అప్పుడు ఒక పెద్ద చెంబుత నీరు తీసికొని, కొన్ని అచట పోయవలెను అంటురోగములు రావు.

రాత్రి సమయములందు పల్లె-గ్రామములలో బహిర్భూమికి వెళ్ళవలసివచ్చిన, తోడు తీసికొని అందువలన కొన్న వెళ్ళపలెనే కాని, ఒకరే వెళ్లరాదు.

తరువాత కాలుసేతులు కడగుకొని పుక్కిలించి ఉమిసి దంతధావనము చేయవలెను. వేప, గానుగ, తుమ్మ, మజ్జి మొదలగు పుల్లలతో దంతధాననము చేయవచ్చును. ఉచితముగా దొరకునపుడు వీనిని కొనగూడదు, పుల్లలు దొరకనపుడుగాని, ప్రయాణములు చేయునపుడు గాని, పండ్లపొడి తయారుచేసికొనిన అది ఉపయోగించవలయును.

కాని బజారులలో నమ్మబడు పౌడర్లనుగాని, టూత్పేస్టుని కొనగూడదు. అందువలన వ్యయము ఎక్కువగుటయేగాక ప్రయోజనముగూడ ఉండదు. ప్రకటనలో ఉన్నంత పస వస్తువులలో ఉండదు. మనము తయారు చేసికొనిన పొడి, పంటివ్యాధులను పోగొట్టి, నోటిని బాగుగా శుభ్రపరచును. కొద్ది వ్యయముతో తయారగును దీనిని తయారుచేయువిధము ముందు చెప్పబడును. 

దంతధావన మైనపిమ్మట ఆరోగ్యవంతులు స్నానము చేయవలెను. చన్నీ రు స్నానమునకు చాల మంచిది. వేడినీరు అంత మంచిది కాదు. పైగా వంట చెరకు కొనవలసిన వారికి చన్నీటిస్నానము ఖర్చు తగ్గించును. రోగులు తొట్టిస్నానపు పద్దతిలో తప్ప చన్నీ ట స్నానము చేయరాదు. స్నానమునకు సాధారణముగ సబ్బుల నుపయోగింపరాదు. అట్టి సబ్బుల
లోని సోడా శరీరమునకు గరకుతనము గలిగించును. అవి మన దేహముపై ని సన్నని పొట్టును గూడ లేవదీయును. సబ్బుల నుపయోగింపనియెడల గౌరవహాని యని తలచువారు స్వదేశీ సబ్బులను, ఎక్కువ వాసన లేసవాటిని ఉపయోగింపవలెను.

వాసన శర్రీరము పై నిలువన ఉండునది కాదు. కావున వాసనకుగాను ఎక్కువ వ్యయము చేయరాదు.

సబ్బులకంటే క్రింది పిండి శరీరమునకు చాల మంచిది. ఇది శరీరమునందలి మురి కీని పోగొట్టుటయే గాక దురద, గజ్జి మున్నగు చర్మవ్యాధులను గూడ పోగొటును. ఆబాలవృద్ధులు దీనిని ఉపయోగించవచ్చును. ఇది చాలా చౌకగా తయారగును.

పిండితయారీ కి కావలసిన వస్తువులు:
 • 🍀పెసలు సోలెడు, 
 • 🍀 పసుపు తులము, 
 • 🍀 బావంచాలు తులము,
 • 🍀 తంటెపుగింజలు తులము,
 • 🍀 తుంగముసైలు తులము, 
ఇందులో పెసలు విసిరి పిండిచేసి మిగిలినవాటిని చూర్ణము చేసి ఆపిండిలో కలుపవలెను,

రచన: శ్రీమతి, వెంపటి సౌభాగ్యవతి శారదాదేవి - "స్త్రీ హితబోధిని" గ్రంధము 

2, సెప్టెంబర్ 2019, సోమవారం

వక్షోజాలు ఉన్నది బిడ్డలకి పాలివ్వడానికే, అదే ఆరోగ్యదాయకం - Breastfeeding


వక్షోజాలు ఉన్నది బిడ్డలకి పాలివ్వడానికే, అదే వాటికి క్షేమ దాయకం కూడా !

మన శరీరంలో ప్రతి అవయవానికీ ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది. మనల్ని దేవుడు పుట్టించాడని నమ్మే వాళ్ళు, లేక డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఇద్దరూ ఒప్పుకొనే మాట ఇది. స్త్రీలలో  వక్షోజాలుపాత్ర బిడ్డలకి పాలివ్వడం. మానవుల కన్నా పరిణామ క్రమంలో కింద ఉన్న జంతువులు ఈ పనిని నిర్వహిస్తూ ఉంటే ఉన్నత స్థానంలో ఉన్న మానవులు ఇటీవల దీనిని విస్మరిస్తూ ఉన్నారు. స్త్రీల రొమ్ములని పాలిచ్చే అవయవంగా కాక ఒక లైంగిక వస్తువుగా, సుఖాన్నిచ్చే సాధనంగా మార్చి వేస్తున్నారు.

రొమ్ములు చిన్నవిగా ఉన్నవాళ్ళు సిలికాన్ ఇంప్లాంట్స్‌తో ఆపరేషన్ ద్వారా వాటిని పెద్దవి చేసుకోవడం, బిగి సడలి జారిపోయాయి అనికున్నవాళ్ళు mastopexy అన్న ఆపరేషన్‌తో వక్షోజాలు రూపు మార్చుకోవడం ఇందులో భాగమే. అయితే రొమ్ములు కప్పుకోవడం తెలియని నాగరికత పూర్తిగా నెర్చుకోని తెగల్లోని వారు రొమ్ములని కేవలం పిల్లలలి పాలిచ్చే భాగాలుగా మాత్రమే చూస్తారని, వాళ్లకి అవి శృంగార సాధనాలు అన్న భావన ఉండదని శాస్త్రవేత్తలు చెబుతారు,

సినిమాలలో, మోడలింగ్‌లో రొమ్ములని చూపిస్తూ వాటికి sex objects ముద్ర వేస్తున్నారు. మగవారు చేసే ఈ పనికి ఆడవారు కూడా సహకరిస్తూ తమని తాము sex objects గా మార్చుకుంటున్నారు. అందులో భాగంగా బిడ్డలకి పాలివ్వడం తమ పాలిండ్ల సౌందర్యాన్ని పాడు చేస్తుందన్న అపోహ. రొమ్ముల బిగి సడలిపోతుందని సినిమా స్టార్లు, మోడల్సే కాక చాలా మంది ఆడవాళ్ళు పిల్లలకి తల్లిపాలు దూరం చేస్తున్నారు. చంటి బిడ్డలకి తల్లిపాలు ఆరోగ్యంతో బాటు రోగ నిరోధక శక్తి కూడా ఇస్తుందని డాక్టరు చెబుతున్నా వీరికి ఎక్కడం లేదు. ఇప్పుడు ఇలాంటి వారి కళ్ళు తెరిపించే నిజం మరొకటి నిపుణులు తెలుసుకున్నారు.

పిల్లలకి పాలివ్వడం ద్వారా తల్లికి రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కలిగించే కొన్ని రకాల హార్మోన్లు తగ్గిపోయి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉండదనీ, అలాగే రొమ్ముల్లో DNA లో మార్పు వచ్చిన కణాలు పాలివ్వడం ద్వారా తగ్గిపోతాయనీ, ఇలాంటి కణాలే ఉత్తరోత్తరా కేన్సర్ కలిగిస్తాయనీ, ఇవి తగ్గి పోవడం ద్వారా కేన్సర్ ప్రమాదం కూడా తగ్గిపోతుందనీ నిపుణులు చెబ్తున్నారు.


సంకలనం: సురేష్

18, ఆగస్టు 2019, ఆదివారం

గర్భధారణ సమయంలో వెన్నునొప్పి సమస్యలు - Garbhadarana Vennu Noppi, Spinal Painగర్భధారణ సమయంలో వెన్నునొప్పి సమస్యలు - Garbhadarana Vennu Noppi, Spinal Pain
దాదాపు 70శాతం మంది మహిళలలో గర్భధారణ సమయంలో వెన్ను దిగువ భాగాన నొప్పి వస్తుంది. గర్భధారణ సమయంలో వెన్ను నొప్పి తీవ్రంగా ఉండి, బాధను, అశక్తతను కలిగిస్తుంది. 

గర్భధారణ తరువాత వచ్చే వెన్నునొప్పిని తట్టుకునేలా చేస్తుంది. గర్భధారణ వలన కలిగే వెన్నునొప్పి మరింత పెరిగే అవకాశం ఉండదు. ఈ నొప్పి, బరువు పెరగడం, వ్యాయామం, పనిలో సంతృప్తి లేదా గర్భంలోని బిడ్డ బరువు, పొడవు బిడ్డ భౌతిక లక్షణాల వంటి వాటివలన కలుగుతుంది. 

గర్భధారణ యొక్క జీవయాంత్రిక కారకాలతో పాటుగా, పొత్తికడుపు సగిట్టల్‌, తిర్యక్‌ వ్యాసం, లూంబార్‌ లార్డోసిస్‌ లోతువంటివి దిగువ భాగపు వెన్ను నొప్పికి కారణమవుతాయి. నిలబడడం, కూర్చోవడం, ముందుకు వంగడం, బరువులు ఎత్తడం, నడవడం వంటి వాటితోపాటుగా, సంక్లిష్టమైన కారకాలు నొప్పి తీవ్రతను పెంచుతాయి.

గర్భధారణ సమయంలోకనబడే వెన్నునొప్పి తోడలలోకి, పిరుదులలోకి వ్యాపించవచ్చు, రాత్రి సమయాలలో ఈనొప్పివల్ల నిద్రపోవడానికి వీలుపడకపోవచ్చు. కొన్ని సార్లు పగటిపూట ఎక్కువగాను, కొన్నిసార్లు రాత్రిపూట ఎక్కువగాను ఉండవచ్చు. ఈ నొప్పి తీవ్రం కాకుండా ఉండడానికి, శరీరాన్ని అధికంగా వంచి బరువులను ఎత్తడం, ఒంటికాలిమీద నిలబడడం, మెట్లెక్కడం వంటివి చేయరాదు మోకాళ్ళను వంచకుండా ఉండాలి. సరాసరి కిందికి వంగటం గర్భిణీలలోనూ, మామూలు వ్యక్తులలోనూ వెన్ను దిగువ భాగపు నొప్పికి కారణం అవుతుంది. ఇబ్బందికార పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే వైద్యసహాయం పొందాడం చాలా సమయాల్లో మేలు చేస్తుంది.

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

15, జులై 2019, సోమవారం

తృణ ధాన్యమైన " ఆరికలతో " సంపూర్ణ ఆరోగ్యం - Health Benefits with Arikalu


అరికలు - Kodo Millet
మనదేశంలో అరికలు ఎక్కువగా పండిస్తారు. సుమారుగా 3000 సం !! లనుండి అరికలను పండిస్తున్నారు . మన ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా , ఎత్తైన గిరిజన ప్రాంతాలలో స్వల్ప విస్తీర్ణంలో అరికలు పండిస్తారు . తమిళనాడు , గుజరాత్ , కర్ణాటక లలోనూ వీటిని పండిస్తారు. దక్కన్ పీఠభూములలో ఎక్కువగా ఆహారంగా తీసుకునే వారు.
 • ఈ అరికలలో ఎక్కువగా పీచు పదార్థం , లోఫ్యాట్ , ఫైటో కెమికల్స్ , ఫైటేట్స్ , సూక్ష్మపోషకాలు , యాంటీ ఆక్సిండెంట్స్ మొదలగునవి వున్నాయి .
 • మోకాళ్ళ నొప్పులకు , కీళ్ళనొప్పులకు , భుజం నొప్పులకు మొదలగు వాత రోగాలకు ఈ అరికెలు మంచి ఆహారం.
 • రుతుస్రావం సరిగా రాని స్త్రీలకు , కంటి నరాల బలానికి , మధుమేహానికి , బరువు తగ్గాలనే వారికి , వ్రణాలు ( పుండ్లు , గడ్డలు )  త్వరగా తగ్గటానికి , ఈ అరికలు చక్కటి ఔషధంగా పని చేసే ఆహారం.
 • వీటిలో వుండే సూక్ష్మ పోషకాల వలన క్యాన్సర్ ని నిరోధించ వచ్చును.
దీర్ఘకాలిక రోగాల వలన కలిగే బాధల ఉపశమనానికి , వాపులకు అరికలు తినడం ద్వారా మంచి గుణం కనబడుతోంది .

" చిరు ధాన్యాలు సంపూర్ణ ఆహారం "

సేకరణ: రామ ప్రసాద్. పి
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

9, డిసెంబర్ 2018, ఆదివారం

నెలసరి, స్త్రీలలో హార్మోన్ల పాత్ర ఎటువంటిది ? - Strilu Hormones - Women and Hormonesనెలసరి, స్త్రీలలో హార్మోన్ల పాత్ర ఎటువంటిది ? - Strilu Hormones - Women and Hormones

ప్రశ్న: నా వయసు ముప్ఫై. నెలసరి రెణ్నెల్లకోసారి వస్తోంది. వైద్యుల్ని సంప్రదిస్తే.. హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్‌ అంటూ మందులు సూచించారు. ఏమిటీ పరిస్థితి? అసలు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏయే సమస్యలు తలెత్తుతాయి?హార్మోన్ల పనితీరు అంత కీలకమా?.
- ఓ సోదరి

జవాబు: స్త్రీ శరీరంలో మెరుగైన పునరుత్పత్తి వ్యవస్థకు హార్మోన్ల పాత్ర కీలకమైంది. వాటి సమతుల్యత ఏ మాత్రం లోపించినా సమస్యలు తప్పవు. పునరుత్పత్తి వ్యవస్థకు సందేశాలు అందించడంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌, తక్కువ మోతాదులో ఉండే టెస్టోస్టెరాన్‌ (పురుష హార్మోను) కాకుండా లుటైనిజింగ్‌ (ఎల్‌హెచ్‌), ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ (ఎఫ్‌ఎస్‌హెచ్‌), గోనాడోట్రోఫిన్‌ రిలీజింగ్‌ (జీఎన్‌ఆర్‌హెచ్‌) అనే ఆరు హార్మోన్లు ముఖ్యమైనవి. అవి సక్రమంగా సాగినంత కాలం సమస్యలు రావు. రుతుక్రమం సజావుగా సాగుతుంది. సమతుల్యత లోపించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. మీ విషయంలో ఇదే జరిగింది. నెలసరి సక్రమంగా రాకపోవడానికీ హార్మోన్ల పని తీరే కారణం.

నెలసరి ఆలస్యం..
అండాశయాల్లోని హార్మోన్లలో మార్పు చోటు చేసుకొని, ఫలితంగా పురుష హార్మోనుగా పరిగణించే టెస్టోస్టెరోన్‌ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల నెలసరి సక్రమంగా రాదు. పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)గా పేర్కొనే ఈ పరిస్థితి వల్ల ప్రతినెలా అండం సక్రమంగా విడుదల కాదు. కొందరిలో అండాలే విడుదల కావు. అందుకే నెలసరి రావడంలో ఆలస్యం. ఒకవేళ వచ్చినా రక్తస్రావం సక్రమంగా కాకపోవడం వంటి సమస్యలుంటాయి. ఇదే కొనసాగితే, సంతానసాఫల్య సమస్యలు, అవాంఛిత రోమాలు, మొటిమలూ బాధిస్తాయి. ఈ సమస్యతో బాధపడే ప్రతి పదిమందిలో నలుగురు అధిక బరువు పెరుగుతారని ఓ అధ్యయనం తెలిపింది. సమస్యను నివారించకపోతే మధుమేహం, అధిక రక్తపోటు వంటివీ తప్పవు. అలాగే నెలసరి సక్రమంగా రాకపోయినా, ఆగిపోయినా గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనవిధానంలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను చాలామటుకు అదుపులో ఉంచవచ్చు.

Women and Hormones

శారీరక, మానసిక సమస్యలు..
హార్మోన్లలో చోటు చేసుకునే తేడా వల్ల ఎదురయ్యే మరో సమస్య ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎమ్మెస్‌). దాదాపు తొంభై శాతం మహిళలకు ఎదురయ్యే సమస్యే ఇది. నెలసరికి రెండు వారాల ముందు నుంచి చిరాకు, ఒత్తిడి, ఆందోళన, ఉద్వేగాలకు లోనవడం, అలసట, తలనొప్పి, ఆకలి లేకపోవడం, రొమ్ముల్లో నొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి అందరిలో ఒకేలా ఉండవు. నెలసరి వచ్చి ఆగిపోయాక లక్షణాలు అదుపులోకి వస్తాయి. హార్మోన్ల ప్రభావం జుత్తు, చర్మంపైనా ఉంటుంది. నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్ల పనితీరులో తేడా వల్లే ఈ పరిస్థితి. అధిక బరువున్న వారు, వ్యాయామం సరిగా చేయనివారు, బీఎంఐ ఎక్కువగా ఉన్నవారిలో ఇది మరింత అధికం. జీవన శైలిలో మార్పులు చేసుకుంటే.. సమస్య అదుపులోకి వస్తుంది.

మెనోపాజ్‌ ఇబ్బందులు..
హార్మోన్ల తేడా వల్ల చోటుచేసుకునే మరో మార్పు మెనోపాజ్‌. ఈ దశలో నెలసరి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అండాశయాలు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లను చాలా తక్కువగా ఉత్పత్తి చేయడమే అందుక్కారణం. తరచూ హార్మోన్ల స్థాయులు మారుతుండటం వల్ల నెలసరి ఓ పద్ధతి ప్రకారం రాదు. ఈ మార్పు నలభైల్లో మొదలై నెమ్మదిగా కొనసాగి, చివరకు రుతుచక్రం ఆగిపోతుంది. ఈ సమయంలో హాట్‌ఫ్లషెస్‌, దాంతో అధిక స్వేదం... రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, జననేంద్రియాల దగ్గర పొర పొడిబారి పలచగా మారడం, కలయిక అసౌకర్యం, మానసిక స్థితిలో తేడాలు, అధికబరువు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని అదుపులో ఉంచేందుకు వైద్యులు హార్మోన్లను సిఫారసు చేస్తారు. అవి ఈస్ట్రోజెన్‌కు ప్రత్యామ్నాయం. అలా వాడే అన్నిరకాల మందుల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తప్పనిసరిగా ఉంటుంది. ఇవి చాలారకాల్లో లభిస్తాయి. వాటి వల్ల కొంత మార్పు ఉన్నా.. గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే వైద్యులు ఈస్ట్రోజెన్‌తోపాటు ప్రొజెస్టెరాన్‌ను కూడా కలిపి సిఫారసు చేస్తారు. హిస్ట్రెరెక్టమీ చేయించుకుంటే.. ఇతర ప్రత్యామ్నాయాల్ని సూచిస్తారు.

హార్మోన్లలో తేడా చోటుచేసుకోకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలికి, సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పంచదార, కెఫీన్‌, కొవ్వు ఆధారిత పదార్థాల్ని తగ్గించాలి. పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి. వ్యాయామం చేయడం, బరువుని అదుపులో ఉంచుకోవడం అన్నివిధాలా మేలు.  -డాక్టర్‌ ప్రణతీరెడ్డి, యూరో గైనకాలజిస్టు

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

23, ఏప్రిల్ 2018, సోమవారం

ఇరువురి కలయిక వలన యోనిలో నోప్పికి గల కారణం - Iruvuri kalaika valana yonilo noppi - Vagina Pain and Relief

నెల నెల బహిష్టు అయినపుడు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. అలా 3 రోజులు వస్తుంది. మైలు 5,6 రోజులు అవుతుంది.  నాకు 5 నెలల క్రితం నాకు పెళ్ళి అయ్యింది. పెళ్ళయిన 5వ రోజున మమ్మల్ని కలిపారు. కాని 7 రోజుల కొకసారి చొప్పున నేను భర్తతో కలిసినపుడు యోని లోపల నొప్పిగా మంటగా వుంటుంది. అలా 2,3 రోజులుంటుంది. వద్దంటున్నామా వారు ఒప్పుకోరు. ఆ టైములో నా బాధ పగ వాళ్ళకి వద్దనిపిస్తుంది. యోనిపై దురద, నొప్పి ఉంటుంది. ఈ సమస్య గూర్చి నేను చాలా వీక్‌ అయిపోతున్నాను. నా సమస్యకు సలహా ఇవ్వగలరు.

ఋతు సమయంలో కడుపునొప్పికి రకరకాల కారణాలుంటాయి. హార్మోను హెచ్చుతగ్గులు కావచ్చు, పొత్తికడుపులో వ్యాధి ఉండటం కావచ్చు. చెప్పుకోదగ్గ కారణం ఏవిూ ఉండకనూ పోవచ్చు. ఒకసారి గైనకాలజిస్టుకి చూపించుకుంటే మందులు రాస్తారు. రతి సమయంలో యోని లోపల మంటకు కారణం సాధారణంగా యోని లోపల తడి చాలకపోవడం కాని, పొత్తి కడుపు లోపలి వ్యాధి కాని కారణమవుతుంది. దీన్ని కూడా గైనకాలజిస్టే మందులతో తేలిగ్గా పోగొడతారు. వ్యాధులేవిూ లేని పక్షంలో విూరిద్దరూ జననాంగాలకు జారుడు పదార్థం పూసుకుని రతిలో పాల్గొంటే మంట ఉండదు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


19, ఏప్రిల్ 2018, గురువారం

తల నూనె ఇంట్లోనే ఎలా తాయారు చేసుకోవాలి - Hair Oil

 కావలసిన పదార్ధాలు ....

1. స్వచ్చ మైన కొబ్బెర నూనె .... 500 ml. ( శుద్ధి చేయని కొబ్బరి నూనె ).

2. ఉసరి కాయల పొడి .... 100 గ్రాములు.

తయారు చేయు విధానము....

కొబ్బెర నూనెను పాత్రలో వేసి కొద్దిగ వేడి చేయ వలెను . ఉసరి పొడిని కలిపి , చిన్న మంట మీద , కొబ్బెర నూనె బాగా నల్లగ అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత వడ బోసి , నిల్వ చేసు కొన వలెను .

ప్రతి రోజు నూనెను వాడ వలెను.

ప్రతి రోజు నూనెను వాడిన చుండ్రు , జుట్టు రాలడం , వెంట్రుకలు చిట్లి పోవడం  నివారించ బడును . క్రొత్త వెంట్రుకలు వచ్చును . వెంట్రుకలు  silky & shine గా తయారవును .


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

18, ఏప్రిల్ 2018, బుధవారం

ఇంగువ ఆహారంలో వాడండి అధ్బుత ఆరోగ్యాన్ని పొందవచ్చు - Inguva tho Aarogyam, asafoetida usefull

ఇంగువ ఆహారంలో వాడండి అధ్బుత ఆరోగ్యాన్ని పొందవచ్చు - Inguva tho Aarogyam, asafoetida usefull
ఇంగువ‌ను ఆహారంలో వాడితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

ఇంగువ‌ను చాలా మంది ప‌లు వంట‌కాల్లో రుచి కోసం వేస్తుంటారు. అయితే నిజానికి ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో వంటల్లో ఇంగువ వేయ‌డం వ‌ల్ల రుచి మాత్ర‌మే కాదు, దాంతో ఇంకా అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు క‌లుగుతాయి. ఇంగువ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 1. ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ స‌మ‌స్య ఉండ‌దు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణ స‌మ‌స్య బాధించ‌దు. మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ ఉండ‌దు. ఇతర జీర్ణ స‌మ‌స్య‌లున్నా పోతాయి.
 2. ప‌లు ర‌కాల అల్స‌ర్ల‌ను న‌యం చేసే శ‌క్తి ఇంగువ‌కు ఉంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఆక‌లి లేకున్నా దీంతో చేసిన ప‌దార్థాల‌ను తింటే బాగా ఆక‌లి పుడుతుంది.
 3. యునానీ వైద్యంలో ఇంగువ‌ను ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా కూడా వాడుతున్నారు. ఫిట్స్, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు ఇంగువ చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.
 4. మ‌హిళ‌ల్లో రుతు క్ర‌మంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు స‌హజం. అయితే వాటితోపాటు రుతు క్ర‌మం స‌రిగ్గా లేని మ‌హిళ‌లు కూడా ఇంగువ‌తో చేసిన ఆహారం తింటే దాంతో వారిలో రుతుక్ర‌మం మెరుగ‌వుతుంది. ఇది సంతాన సాఫ‌ల్య‌త అవ‌కాశాల‌ను పెంచుతుంది.
 5. ఆస్త‌మా, బ్రాంకైటిస్, ద‌గ్గు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. తీవ్ర‌మైన ప‌డిశెం (ఇన్‌ఫ్లుయెంజా) వ‌చ్చినా ఇంగువ‌తో చేసిన ఆహారం తింటే వెంట‌నే ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 6. ఇంగువ వేసిన ఆహారం తింటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇది డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇన్సులిన్ లాగా ప‌నిచేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉంటుంది.
 7. ర‌క్త నాళాల్లో కొవ్వు గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చూస్తుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి గుండె స‌మ‌స్య‌లు రావు.
 8. త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ఆయా నొప్పులను త‌గ్గించే గుణం ఇంగువ‌కు ఉంది.
 9. ఇంగువ‌ను వంట‌ల్లోనే కాక డైరెక్ట్‌గా కూడా తీసుకోవ‌చ్చు. దీంతో పైన‌ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే దాన్ని గోరు వెచ్చ‌ని నీటితోనో లేదా మ‌జ్జిగ‌తోనో తీసుకోవాల్సి ఉంటుంది
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

5, మార్చి 2018, సోమవారం

ఉమ్మనీరు అంటే? - What is amniotic fluid?


ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు... హెచ్చరికలే
అమ్మకడుపులో తొమ్మిదినెలలు.. ఈ సమయంలో గర్భస్థ శిశువులో ఎన్నెన్నో మార్పులు. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనే తల్లులు కొన్ని సందర్భాల్లో కలవరపడుతుంటారు కూడా.

శిశువు ఎదుగుదలలో.. సౌకర్యాన్నందించడంలో కీలకం ఉమ్మనీరు. బిడ్డకు పలువిధాల మేలుచేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయికన్నా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సాధారణంగా అయితే.. గర్భం ధరించినప్పటి నుంచీ ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. రెండున్నర నెలలకు ఇది 30 ఎం.ఎల్‌.. ఆ తరవాత అంటే తొమ్మిదో నెలకు ఇది వెయ్యి ఎం.ఎల్‌వరకు చేరవచ్చు. గర్భస్థశిశువు ఇందులో కదలడమే కాదు అప్పుడప్పుడు స్వీకరించడం.. మళ్లీ మూత్రం ద్వారా వదిలేయడం కూడా బిడ్డ ఎదుగుదలలో భాగమే.

ఉమ్మనీరు చేసే మేలు..
బిడ్డ గర్భంలో సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బిడ్డ చుట్టూ సమాన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.. వేడి తగ్గినప్పుడు ఉమ్మనీరు రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. బయటి నుంచి శిశువుకు గాయాలు కాకుండా కాపాడే బాధ్యత కూడా ఉమ్మనీరుదే.
తగ్గినా, పెరిగినా ప్రమాదమే...
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఎలా తలెత్తుతాయో చూద్దాం..
 • ఓలిగోహైడ్రామ్నియోస్‌: ఉమ్మనీరు ఉండాల్సిందానికన్నా తక్కువగా ఉండటాన్నే ఇలా పరిగణిస్తారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని మూత్రం ద్వారా విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి బాగా తగ్గిపోతుంది. అలాగే శిశువులో మూత్రం తయారు కాకపోయినా, విసర్జించిన మూత్రం ఉమ్మనీరు ఉన్న సంచిలోకి చేరకపోయినా, మూత్రనాళం ఏర్పడకపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మనీటికి కారణమైన పొరలు రాసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవ్వవచ్చు. బిడ్డకు రక్తసరఫరా సరిగా అందకపోయినా, గర్భస్థ శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలున్నా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్నిరకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు నెలలు నిండినా ప్రసవం కాకపోవడం.. (వైద్యులు చెప్పిన తేదీ దాటి రెండు వారాలు గడిచినా ప్రసవం కాకపోవడం..) వంటి కారణాల వల్ల కూడా ఉమ్మనీరు స్థాయి బాగా తగ్గిపోతుంది.
 • పాలీహైడ్రామ్నియోస్‌: గర్భంలో బిడ్డ చుట్టూ ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు అధికంగా ఉండటాన్ని పాలిహైడ్రామ్నియోస్‌గా పరిగణిస్తారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అసలు స్వీకరించకపోయినా.. శిశువు ఉదర సంబంధ పేగు (గ్యాస్ట్రోఇంటస్త్టెనల్‌ ట్రాక్‌) మూసుకుపోవడం వల్లకూడా ఇలా జరుగుతుంది. సహజ ప్రక్రియలో శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలేదంటే.. అందుకు ఉదరం, మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటు.. మరికొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు శిశువులు ఉండటం, తల్లికి జెస్టేషినల్‌ డయాబిటీస్‌.. వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో కారణాలు విశ్లేషణకు అందకపోవచ్చు.
 • ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు, సమస్యలు: నెలలు నిండకుండానే నొప్పులు రావొచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ (ప్లాసెంటా) వేరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా అసాధారణ(మాల్‌ప్రెజెంటేషన్‌) స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధిక రక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా సిజేరియన్‌ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ.
ఇలా తెలుసుకోవచ్చు...
ఉమ్మనీరు పెరుగుతోందా.. తగ్గుతోందా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చక్కటి పరిష్కారం. అలాగే బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డాప్లర్‌ ఫ్లో స్టడీలతో బిడ్డకు రక్తసరఫరా తీరుతెన్నులు పరీక్షించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. కాస్త అవగాహన, ముందుచూపుతో వ్యవహరిస్తే పండంటి పాపాయిని ఆహ్వానించవచ్చు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

అలర్జిక్‌ రైనైటిస్ వ్యాధి అంటే ఏమిటి - What is Alzheimer's Rhinitis Disease?ఇది చాలా పెద్ద సమస్య. మన సమాజంలో దాదాపు మూడో వంతు మంది ఈ రకం అలర్జీతో బాధపడుతున్నారు. మనకు 'అలర్జీ' కలిగించే ఆ శత్రువు.. మన పరిసరాల్లోనే.. మన ఇంట్లోనే ఉండొచ్చు. అది ఇతరుల్ని ఏ ఇబ్బందీ పెట్టకపోవచ్చు. కానీ మన పాలిట మాత్రం విలయం సృష్టిస్తుంటుంది. నిజం చెప్పాలంటే దాన్ని మనమేం చెయ్యలేం.

మరి దీన్నుంచి బయటపడేదెలా?

ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం.. ఇవన్నీ చూడటానికి ఏమంత
ప్రమాదకరమైనవి కావు. కానీ కొందరి పాలిట ఇవే శత్రువులు! ఇవి తగులుతూనే శరీరంలో తీవ్రమైన అలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు.. పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు.. ఇలా అలర్జీ కారకాల జాబితా చాలా పెద్దది! సాధారణంగా ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యని ఈ సాధారణ పదార్థాలే కొందరి పాలిట మాత్రం తీవ్ర సమస్యలు తెచ్చిపెడతాయి. ముక్కు, కళ్లు, చెవులు, గొంతు, వూపిరితిత్తులు, చర్మం.. ఇలా రకరకాల శరీర భాగాల్లో విలయం సృష్టిస్తుంటాయి. ముక్కుకు సంబంధించి చాలా ఎక్కువగా కనబడే సమస్య ఈ అలర్జీ. దీన్నే 'అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. ఆ సరిపడని పదార్థాలేవో ముక్కుకు సోకినప్పుడు.. ముక్కులోని సున్నితమైన పొరలు తీవ్రంగా స్పందిస్తాయి. దీంతో 'అలర్జీ' బెడద ఆరంభమవుతుంది.

కొందరిలో ఎప్పుడూ..!
అలర్జీ అన్నది కొన్ని కొన్ని సీజన్లలో ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసి, గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉండే కాలంలో, అలాగే చల్లదనం పెరిగే శీతకాలంలో.. ఇలా కొన్నికొన్ని సీజన్లలో ముక్కు అలర్జీలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీన్నే 'సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. గాలి ద్వారా వచ్చే పుప్పొడి పెద్ద అలర్జీ కారకం. అందుకే పాశ్చాత్య దేశాల్లో మన వాతావరణ హెచ్చరికల్లాగే గాలిలో ఈ పుప్పొడి శాతం (పోలెన్‌ కౌంట్‌) ఎంత ఉందన్నది కూడా చెబుతుంటారు. అయితే కొందరిలో ఇలా కాలాలతో, సీజన్లతో ఏ సంబంధం లేకుండా ఏడాది పొడవూనా అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి. దీన్నే 'పెరీనియల్‌ అలర్జిక్‌ రైనటిస్‌' అంటారు. కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ అలర్జీ తత్వం రావచ్చు. ముఖ్యంగా చర్మం మీద అలర్జీలు, తుమ్ములు, ఉబ్బసం వంటివి కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. చిన్న పిల్లల్లో అంటే ఐదారేళ్ల వయసు వరకూ సాధారణంగా ముక్కు అలర్జీలు కనబడవుగానీ.. వూపిరితిత్తుల్లో అలర్జీ కారణంగా ఉబ్బసం (అలర్జిక్‌ ఆస్థమా) అన్నది చిన్నవయసులో కూడా కనబడుతుంటుంది. మొత్తానికి 'అలర్జీ' అన్నది ఎవరికైనా, వేటి కారణంగానైనా రావచ్చు. కాబట్టి ఎవరికివారు తమకు దేనివల్ల అలర్జీ వస్తోంది, ఆ సరిపడనిదేమిటి? అన్నది గుర్తించటం మంచిది.
అలర్జీ నుంచి ఆస్థమా!
ముక్కులో తలత్తే అలర్జీ లక్షణాల వంటివే వూపిరితిత్తుల్లోకి కూడా పాకితే.. అలర్జిక్‌ బ్రాంకైటిస్‌, ఆస్థమా వంటి బాధలూ తలెత్తుతాయి. వీరిలో శ్వాస ఆడనట్లుండటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలు కనబడతాయి. 60-70 శాతం మందిలో ముక్కులోనూ, ఛాతీలోనూ కూడా ఈ అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి.

దూరమే విరుగుడు
ప్రధానంగా అలర్జీ కారకాలు తగిలే అవకాశం లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసేసుకోవటం, కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసెయ్యటం, పుప్పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండే ఉదయం సమయాల్లో ఆరుబయటకు వెళ్లకుండా ఉండటం.. చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్‌ వంటివి కట్టుకోవటం.. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.

సమస్యల దొంతర అలర్జీ ఆరంభం
సరిపడనివేవో తగిలి ముక్కులోని పొరల్లో ఈ అలర్జీ మొదలైతే.. 'హిస్టమైన్‌' విడుదల అవుతుంది. దీనివల్ల ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్త్లె.. ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. అప్పుడు ఆగకుండా తుమ్ములు, ఆ వెంటనే ముక్కు వెంట నీరు ధారలా కారటం మొదలవుతుంది. తర్వాత మెల్లగా ముక్కు బిగిసిపోతుంది. ఇది 'అలర్జిక్‌ రైనైటిస్‌'. ఇది బాగా చికాకుపెట్టే సమస్య. ఈ దశలోనే దీనికి చికిత్స తీసుకుంటే మంచిది. ఇది ముదిరి.. దీర్ఘకాలిక సమస్యగా తయారైతే 'సైనుసైటిస్‌' వంటి దుష్ప్రభావాలు చాలా తలెత్తుతాయి.

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

గర్భిణులు మద్యం సేవనం: ఓ పనికిమాలిన అనారోగ్యకర పాశ్చ్యాత్త అలవాటు - Pregnant alcohol service: a fierce unhealthy pastime habit

/Pregnant-alcohol-garbhinula-madyam-alavatu


పాశ్చ్యాత్త దేశాలలో మధ్యపానకు చేసే అలవాటు ఎక్కువ . మద్యపానం దుష్ఫలితాల్లో మరోటి వచ్చి చేరింది. గర్భం ధరించిన సమయంలో తల్లులకు ఈ అలవాటు ఉంటే.. వారికి పుట్టిన మగ పిల్లల్లో పెద్దయ్యాక సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని డెన్మార్క్‌లోని ఆర్‌హస్‌ విశ్వవిద్యాలం అసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇది సంతాన లోపాన్ని కలిగించకపోయినా పిల్లల్ని కనటంలో తీవ్రమైన ఇబ్బందులు మాత్రం తెచ్చిపెడుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

మిగతా వారితో పోలిస్తే.. గర్భంలో ఉండగా తీవ్రమైన మద్యం ప్రభావానికి గురైన వారిలో పెద్దయ్యాక వీర్యకణాల సంఖ్య మూడింతలు తగ్గుతుండటం గమనార్హం.

''గర్భిణులు మద్యం తాగితే వారి గర్భంలోని శిశువు వృషణాల్లో వీర్యాన్ని ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడే కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే పెద్దయ్యాక వీర్యకణాల నాణ్యతను దెబ్బ తినటానికి కారణమవుతుండొచ్చు'' అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డా|| సెసిలా రామ్‌లావ్‌-హన్‌సెన్‌ తెలిపారు.

ఇలాంటి అధ్యయనం జరగటం ఇదే తొలిసారని, ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తండ్రుల మద్యపానం అలవాటుతో దీనికి సంబంధం ఉన్నట్టు బయటపడలేదు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సలహాలు - Health Advices for Pregnant Womenగర్భం అనేది సృష్టి రహస్యం. ఇది మహిళలకు దేవుడిచ్చిన ఓ అపురూపమైన కానుక. కొన్ని సూచనలు పాటిస్తే ప్రసవం సులభతరమౌతుంది . గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి .

గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ(నెల) తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రం రోజుకు ఒక వారం కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.EDD = LMP +9 months ,7 days.

గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు(placenta) నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన కోరియానిక్ గొనడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలొని కార్పస్ లుటియమ్ నుండి ప్రొజెస్టిరోన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.

ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది. దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును. శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసినది.
స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగంలో, పురుషుని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం (Pregnancy) అంటారు. 
గర్భం ధరించిన స్త్రీని గర్భవతి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.(9 lunar month * 30 days = 270 days).

ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను 'పిండం'(Embryo) అంటారు. 'శిశువు'(Foetus) అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్(3*3 months) కాలాలుగా విభజిస్తారు. మొదటి ట్రైమిస్టర్ కాలంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.
Advises-to-Pregnent-women.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
 • ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు , పండ్లు , ఆకుకూరలు , పప్పు , మాంసము , చేపలు వగైరా తీసుకోవాలి .
 • మొదటి ఆరునెలలు .... నెలకొకసారి , ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు , తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము .
 • సొంతముగా మందులు వాడడము , ఎక్షురేలు తీయించుకోవడము చేయకండి.
 • ఎత్తుమడమల చెప్పులు వాడకంది ,
 • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
 • మొదటి మూడునెలలు , చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటరు నడపడము , చేయరాదు .
 • రాత్రులు 8-10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి .
 • స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
 • ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌ లు తీసుకోవాలి .
 • రక్తస్రావము , ఉమ్మనీరు పోవడము , శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు , కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .
గర్భవతులకు - పోషకాహారం-- గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -

భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఓకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.

నష్టాలు -
1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది.
2. శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది.
3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భవతికి కావలసిన ఆహారం -
 • గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది.
 • గర్బవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్దాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది.
 • గర్భవతులు , బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అ వసరం.
 • గర్భ స్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పుసమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువు తో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి -
 1. గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి.
 2. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. .
 3. ముడిధాన్యాలు, మొలకెత్తినధాన్యాలు,పులిసిన ఆహారం(పెరుగు ) అదనంగా తీసుకొవాలి.
 4. పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి.
 5. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .
 6. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.
 7. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
 8. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువుపనులు చెయ్యరాదు, అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా.
 9. పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు.
 10. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు.
 11. అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
 12. భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి .
 13. గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి?
 • గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేలలూ ప్రసంతముగా వుండాలి.
 • ప్రతిపనిలోను నీజాయితిగా వుండాలి.
 • అనునిత్యము దేవనామస్మరణ చేయవలెను.
 • దర్మప్రవుత్తి కల్గివుండాలి.
 • సత్యమునే పలకవలెను.
 • మీకుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి .
 • నీతి కధలను చదువుతు వుండాలి.
 • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
గర్భిణులు నిద్రలో కొన్ని సమస్యలు-జాగ్రత్తలు :
గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
 • గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
 • పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. .
 • కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు ..
 • పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
 • పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
 • నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

గర్భిణి లలో మధ్యపానము , Alcohol in pregnency .

ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మానసికం గా తీసుకోవలసిన జాగ్రత్తలు : 
 • ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం, కట్టడం వంటివి కూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణము దుమ్ము, ధూళి వంటి వాటివలన కాలుష్యమౌతుంది కనుక కచ్చితముగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శిశువు పుట్టిన తర్వాతే కట్టడాల నిర్మాణాలు, ఫ్లాట్స్ కొనడం వంటివి చేయాలని వాస్తునిపుణులు సలహా ఇస్తున్నారు.
 • అలాగే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడటం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.
 • గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లలో గృహస్థలం యొక్క దక్షిణము వైపున ఖాళీస్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరము వైపున ఇల్లు ఉండకుండా చూడాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలనే మాత్రమే గాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారము దక్షిణము న విశాలప్రదేశమున్నట్లైతె రాత్రులు యమకింకరులు తిరుగుతారని నమ్మకము .
 • మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. క్రొత్త వతావరణము కడుపులో బిడ్డ మానసిక స్థితి పై ప్రభావము ఉంటుంది . దీంతో పాటు సముద్ర ప్రయాణము, భర్త దూరముగా వలస వెళ్ళుట , గర్భవతి శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు అని అంటారు .
 • ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు. అంటువ్యాధు వచ్చే ప్రమాదము మరియు బిడ్డ మానసిక పెరుగుదల పై ప్రభావము చూపుతాయి .
 • అలాగే గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ సమయము లో గర్భిణీ లకు ప్రశాంతత కరువవుతుందనే వాదన ఉంది .
గర్భిణి స్త్రీలలో మానసిక ఒత్తిడి ప్రభావము, Mental stress effects on Pregnancy

గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కడుపులోని బిడ్డ పైనా పడుతుందా? దీనిపై వైద్యరంగం ఎప్పటి నుంచో రకరకాల అధ్యయనాలు చేస్తోంది. తాజాగా వెల్లడైన అంశమేమంటే- గర్భం దాల్చిన తర్వాత తొలి మూడు మాసాల్లో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైతే ఆమెకు పుట్టే బిడ్డకు రక్తహీనత, ముఖ్యంగా ఇనుము లోపం బారినపడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇనుము బిడ్డ శారీరక అవయవాల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు వికాసానికి చాలా కీలకం. తల్లుల్లో ఇనుము లోపం, మధుమేహం, గర్భం దాల్చిన తర్వాత పొగ తాగటం వంటివి పిల్లల్లో ఇనుము లోపాన్ని పెంచుతాయి. అలాగే నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల్లో కూడా ఇనుము లోపించే అవకాశాలు ఎక్కువ. వీటన్నింటికి తోడు- గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనా కూడా పిల్లల్లో ఇనుము లోపం తలెత్తవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో గర్భిణులంతా 'చక్కటి పోషకాహారం, మానసిక ప్రశాంతత'.. ఈ రెండు అంశాల మీదా ప్రత్యేక శ్రద్ధ పెట్టటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచనకోటి మాధవ్ బాలు చౌదరి

మొటిమలు, మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్య - చింతించకండి, నివారణ ఉందిగా !! - Pimples problems and diseases

Pimples problems and diseases


టీనేజ్‌ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించును . పింపుల్స్‌ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.

మృదుత్వంతో మెరిసిపోవాల్సిన మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు. చాలామందిని వేధించే ఈ మొటిమలు ఎందుకు వస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యలు గురించి వివరంగా తెలుసుకుందాం.

కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయుల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో బాధించే వీటి రాకకు కారణాలనేకం.

హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు:
 • చర్మంలో నూనె గ్రంథుల పనితీరు,
 •  బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు.
 • పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి.
 • పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఓవరీస్‌) సమస్య,
 • కొన్నిరకాల ఉత్ప్రేరకాలు,
 • గర్భనిరోధక మాత్రలు,
 • క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.
ఏర్పడే విధానము:
మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (

ముఖముపైన ఉండే నూనె గ్రంధులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్షమజీవుల (ex. proprioni bacterium acnes) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.

మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు
 • మానసిక వత్తిడి ఎక్కువైనపుడు
 • ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు
 • వంశపారంపర్యము (కొంతవరకు)
 • ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం
పర్సనల్  జాగ్రత్తలు:
 • ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి
 • జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.
 • ప్రతిరోజూ వ్యాయామము చేయాలి
 • మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు.
 • గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు.
నివారణ
 1. పింపుల్స్‌ను గిల్లకూడదు
 2. మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.
 3. తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.
 4. నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు
 5. మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.
 6. స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
 7. గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
 8. మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లు వైద్యసలహా లేకుండా రాయకూడదు.
 9. సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
 10. రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
 11. పింపుల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.
వైద్యం
శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు.

పెద్ద మొటిమలు వున్నవాళ్ళు -

క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ , కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment)
Femcinol -A skin ointment ... apply daily two times.

డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి.
మచ్చలు పోవడానికి "అలొవెరా " తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.

ప్రత్యామ్నాయాలున్నాయి...
మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్‌, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్‌ యాసిడ్‌, మాండలిక్‌ యాసిడ్‌, గ్త్లెకోలిక్‌ యాసిడ్‌ ఉన్న పీల్స్‌ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్‌ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.

లేజర్‌ చికిత్సలున్నాయ్‌...
మోముపై గుంటలకు లేజర్‌, డెర్మారోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గుంటల్ని పూర్తిగా నివారించాలంటే.. ముందు మొటిమల్ని పూర్తిగా నివారించడం తప్పనిసరి. అప్పుడే గుంటల్ని పూర్తిగా తగ్గింవచ్చు. వీటికోసం అందుబాటులో ఉన్న రెండుమూడు రకాల లేజర్‌ చికిత్సల్లో ఫ్రాక్షనల్‌ సీఓ2, అర్బియం గ్లాస్‌, ఎన్డీయాగ్‌, ఐపీఎల్‌.. వంటివి కొన్ని. ఈ చికిత్సను నెలకోసారి మూడు, నాలుగు విడతల్లో చేస్తారు. డెర్మారోలర్‌ అయితే.. ఐదు విడతల్లో నెలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు.

ఈ రెండూ వద్దనుకుంటే.. ఫిల్లర్లు ప్రయత్నించవచ్చు. ఇవి తాత్కాలికం, సెమీ పర్మనెంట్‌, శాశ్వత పద్ధతుల్లో ఉంటాయి. తాత్కాలిక ఫిల్లరయితే.. ఆ ఫలితం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది. సెమీ పర్మనెంట్‌ చేయించుకుంటే.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాకా పనిచేస్తుంది. శాశ్వత ఫిల్లర్‌తో ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు గుంటలు కనిపించవు. ఈ చికిత్సను మాత్రం ఒకేసారి చేస్తారు.

ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గృహ-చిట్కాలు:
 • ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి.
 • మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని సేవించండి లేదా చర్మం మీదకూడా పూయవచ్చు. గర్భిణులు ఆలోవెరా గుజ్జును సేవించకూడదు.
 • దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.
 • రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
 • ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
 • కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
 • కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
 • మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
మొటిమలు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు :
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
 • ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
 • రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.
 • మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్‌) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
 • రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
 • కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.
హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

4, మార్చి 2018, ఆదివారం

పొట్ట లో కొవ్వు పెరుగుదల, అనర్దాలు మరియు నివారణా మార్గాలు - Fat growth, preservation and prevention paths in the stomach

బొజ్జ : వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది. శరీరాకృతినే మార్చేసి మరింత వయసు ముదిరినట్టు చేస్తుంది మరి. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది తెలుసా? ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగని బాధ పడుతూ కూచోకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం.

సైనికులు , పోలీసులు ప్రతి రోజూ కవాతు చేస్తారు . సైనికుల్లో ఎవరికైనా పొట్ట ,బొజ్జ రావడము చూడము కాని కొంతమంది లేకా పోలీసులందరికీ బొజ్జ కనబడుతూ ఉంటుంది. కారణము వారి శిక్షణ , ఆహార నియమావళి , క్రమబద్ధమైన వ్యాయామము .

పొట్ట లో కొవ్వు ఎందుకొస్తుంది?
వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్‌ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమే.

పొట్ట కొలుచుకుంటే సరి
ఎత్తు బరువుల నిష్పత్తిని (బీఎంఐ) బట్టి అధిక బరువును గుర్తించొచ్చు గానీ దీంతో శరీరంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోలేం. నడుం చుట్టుకొలత ద్వారా పొట్ట భాగంలో కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయాన్ని పసిగట్టొచ్చు. దీన్ని ఎలా చూడాలో తెలుసా?
 • * ముందు బొడ్డు భాగంలో కడుపు చుట్టూ టేపుని చుట్టండి.
 • * శ్వాస మామూలుగా తీసుకోండి. కడుపుని లోపలికి పీల్చొద్దు.
 • * చర్మం నొక్కుకుపోయేలా టేపుని మరీ బిగుతుగా కూడా బిగించరాదు.
 • * నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే అదుపులోనే ఉన్నట్టు.
 • * 35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందనే అర్థం.
తగ్గించుకునేదెలా?

కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు.

1. వ్యాయామం: బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. దీంతో బరువుతో పాటే పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. బరువులు ఎత్తే వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఎంతసేపు, ఏయే రకాల వ్యాయామాలు చేయాలన్నది వారి శారీరక శ్రమ, పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికేది అవసరమో వైద్యుల సలహా మేరకు నిర్ణయించుకోవాలి.

2. ఆహారం: ఆహార పదార్థాలు కొనేటప్పుడు సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. మామూలు పిండి పదార్థాలు గల పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్‌, శుద్ధిచేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.

పొట్తను (కొవ్వును) తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలు :
 • గుడ్డులోని తెల్లసొన ,
 • అన్ని రకాల పండ్లు ,
 • పచ్చిగా తినగలిగే కాయకూరలు ,
 • ఆవిరిమీద ఉడికే కాయకూరలు ,
 • యాపిల్ పండ్లు ,
 • కాల్సియం ఎక్కువగా ఉండే పాలు , పెరుగు , మజ్జిక , రాగులు.
3. పొట్ట కండరాలను దృఢ పర్చటం: మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో బొజ్జ తగ్గకపోతుంటే.. పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపులోపలి కండరాలను పటిష్ఠం చేయటంపై దృష్టి సారించాలి.

4. హర్మోన్‌ చికిత్స: అరుదుగా కొందరికి మెనోపాజ్‌ అనంతరం హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) తీసుకోవటం కూడా ఉపయోగపడుతుంది.

అనర్థాలు--బొజ్జ మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. అవి:
 • గుండె జబ్బులు
 • రొమ్ము క్యాన్సర్‌
 • మధుమేహం
 • జీవక్రియల అస్తవ్యస్తం
 • పిత్తాశయ సమస్యలు
 • అధిక రక్తపోటు
 • పెద్దపేగు క్యాన్సర్‌
పొట్ట వద్ద పేరుకునే కొన్ని కొవ్వు కణాలు ఇన్స్‌లిన్‌ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లనూ ఉత్పత్తి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది మున్ముందు మధుమేహానికి దారి తీయొచ్చు. మరికొన్ని కణాలు మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది.

బొజ్జ తగ్గించుకునే కొన్ని చిట్కాలు : 
అల్పా హారము తప్పనిసరి :  ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి . ఉదయము ఎమీ తినకపోవడమంటే ఎవరికి వారు శిక్ష విధించుకోవడమే. ఉదయము నిండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది . . . ఆ అల్పాహారమే . అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి .

ఉప్పు తగ్గించాలి : ఎవరైతే  తక్కువ ఉప్పు తింటారొ వారు లవెక్కరు . ఉప్పుకు శరీరములో నీటిని , కొవ్వును నిలవా చేసే గుణము ఉన్నది . ఫలితము వా బరువు పెరుగుతారు .చలాకీతనము తగ్గుతుంది. అందుకే రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా ఉంటే పొట్ట తగ్గుతుంది.

మూడు పూట్లా తినండి : బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరము . లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి . ఆ తినే ఆహారము విషయము లో జాగ్రత్తపడాలి . శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన ఆహారము తీసుకోవాలి.

నడక అవసరము : నదక సహజ వ్యాయామము . ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా నడాల్సిందే . 1.5 కిలోమీటర్లు పావుగంట కాలము లో వేగము గా నడిచేవిధముగా సాధనచేయాలి . రోజుకు సుమారు 3 కి.మీ నడిస్తే మంచిది.

ఎత్తుపల్లాల్లో పరుగు : కాళ్ళకు బలాన్నిస్తుంది పరుగు . కొవ్వును బాగా కరిగిస్తుంది. ఎత్తు పల్లాలో కొండలమీదికి నడక , పరుగు , ఎక్కి దిగ గలిగితే పాదము నేలమీద తాకే సమయము బాగా తగ్గుతుంది. ఫ్యాట్ కరిగేందుకు దోహదపడుతుంది . గుండెజబ్బులున్నవారు కొండలెక్కడము మంచిది కాదు .

వేపుళ్ళు వద్దు : రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు .. కాని ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు మంచివి కావు . ఉడికించిన కూరలు తింటేనే శరీరరూపము మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కూర లన్నింటినీ సగం మేర ఉడికించి తర్వాత కొంద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి.

సాయంకాల సమయ ఆహారము : సాయంకాలము లో ఏదో ఒకటి తినాలి . ఆకలి తో ఉండకూడదు . ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు తినాలి. నూనెలో ముంచి తేలిన చిప్స్ , నూడిల్స్ , కురుకురేల వంటివి అస్సలు తినకూడదు .

నీరు బాగా త్రాగాలి : నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి . నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి అవసము . తగినంత ఉంటే ఆలోచనలు స్పస్టముగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడము లో అటు ఇటు అవ్వదు .

శ్వాసతీరు  మార్చుకోవడము : సైనికులకు శ్వాస వ్యాయామము ప్రత్యేకము గా చేయిస్తారు. శ్వాసక్రియను చాతీకి పరిమితం చేయక  కిందనున్న పొట్టను పైకిలాగుతూ శ్వాసను పీల్చి వదలడము చెయ్యాలి. ఇది పరుగెడుతున్నప్పుడు చేయాలి . ఉదరబాగముతో కలిపిన శ్వాసక్రియవల్ల శరీర రూపములో మార్పువస్తుంది . పొట్ట లోపలికి పోతుంది.

బరువుతో పరుగు : పరుగు చ్క్కని వ్యాయామము . అయితే పొట్ట బాగ తగ్గాలంటే వీపుకు ఏధనా బరువును కట్టుకొని పరుగెట్టడము మంచిది. సైనికులు తమ అవసరాలకు సంబంధించిన సామానులతో కూడిన సంచి వీపుకు తగిలించుకొని పరిగెడు తుంటారు దీనివలన కొవ్వు కరిగిపోతుంది. కొత్తగాకొవ్వు చేరనివ్వదు .

పరుగు తీరు : మేము ప్రతిరోజూ పరిగెడుతున్నాము . . . కాని శరీరములో మార్పు కనిపించడము లేదంటారు. పరిగెత్తేటపుడు త్లల ఎత్తి ఉంచాలి . ముందుకు చూస్తూఉండాలి . వీపును వెనక్కి నెట్టినట్లుగా , మోచేతులు శరీరానికి పక్కగా ఉంచి పరుగెత్తాలి .దీనివల్న పరుగు వేగము అందుకుంటుంది ... కొవ్వు కరిగే అవకాశాలు ఎచ్చువ అవుతాయి.

తగినంత నిద్ర : నిద్ర వలన రెండురకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసటనుండి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. కొవ్వు అదనము పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది.

వ్యాయామములో మార్పు : ఒకే తరహా కసరత్తు నెలల తరబటి చేయకుండా రకరకాల పద్దతులలో వ్యాయామము మార్చి చేస్తూ ఉండాలి .దీనివలన కొత్త ఉత్సాయము , కొత్త లాబాలు శరీరానికి చేర్చిన వారవుతారు.

రిలాక్ష్ అవ్వాలి : నిరంతము టెన్సన్‌ మంచిది కాదు . ఒత్తిడిలో ఉన్నవారు ఆహారము అధికము గా తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. గాబరా గాబర గా ఏదో ఒకటి తింటూ ఎల్లప్పుడు పని ఒత్తిడిలో ఉండకూడదు . వీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ నే తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. . . ఇవి కొవ్వును అధికం చేస్తాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

10, జనవరి 2018, బుధవారం

జుట్టు చిట్లిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు - Juttu Raalakunda undenduku jagrattalu - Hair care

జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణమే. జుట్టుని టవల్‌తో ఎక్కువగా రుద్ద కూడదు, తడి జుట్టుని దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగించాలి.

అలాగే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, విటమిన్ A, C, సెలీనియం వంటివి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ చిన్న చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

26, నవంబర్ 2017, ఆదివారం

వేడి..చెమట..దురద..పోగొట్టే చిట్కాలు - Hot..cleam..good tips

వేడి..చెమట..దురద..పోగొట్టే చిట్కాలు - Hot..cleam..good tips


1. ఓట్‌ మీల్‌: ఓట్‌ మీల్‌ ప్రిక్లీ హీట్‌ కి అద్భుతమైన ఇంటి చికిత్స. ఒక స్నానాల తొట్టెలో కొంచెం ఓట్‌ మీల్‌ వేసి బాగా కలపండి. 15 నిముషాలు ఆ తొట్టెలో ఉంటే అది మీ మనసుకి తేలికని, చర్మానికి స్వాంతనని కలిగిస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి.

2. ఐస్‌: ఐస్‌ వేడి, ఆర్ద్ర వాతావరణం వల్ల సంభవించే ప్రిక్లీ హీట్‌ని తగ్గించే మరో గొప్ప మార్గం. ఐస్‌ గడ్డలతో దద్దుర్లపై రుద్దడం వల్ల మంట, వేడి అనుభూతి తగ్గుతుంది.

3. ఫుల్లర్స్‌ ఎర్త్‌: ఫుల్లర్స్‌ ఎర్త్‌ లేదా ముల్తానా మట్టి ప్రిక్లీ హీట్‌ కి మరో అద్భుతమైన ఇంటి చికిత్స. ఈ పాక్‌ ని తయారుచేయడానికి 4-5 టేబుల్‌ స్పూన్ల ఫుల్లర్స్‌ ఎర్త్‌ ని కలిపి, 2-3 టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌, మామూలు వాటర్‌ తో పేస్ట్‌ లాగా చేయండి. భరించలేని వేడి ఉన్న ప్రదేశాలలో దీనిని రాయండి, ఆరడానికి 2-3 గంటలు పడుతుంది. తరువాత, చల్లని నీటితో కడగండి.

4. వేప ఆకులు: వేప ఆకులను తీసుకుని, వాటిని నలిపి నీటితో చక్కటి పేస్ట్‌ తయారుచేయండి. ప్రభావిత ప్రాంతాలపై ఆ పేస్ట్‌ ని పూయండి, పూర్తిగా ఆరేవరకు చర్మం పై వదిలేయండి. వేప బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు గల జెర్మ్సని చంపడానికి ఉపయోగపడు తుంది, అలాగే ఇతర చర్మ వ్యాధుల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


ప్రసవం తర్వాత తల్లి శక్తివంతమైన ఆహారం ! - Super Food After Baby Delivery

Food-after-delevery-prasavam-tarvata-aaharam

కొత్తగా తల్లి అయిన వారికి సూపర్‌ ఫూడ్స్‌..!
అద్భుతమైన గర్భాధారణ కాలం తర్వాత, మీరు ఇప్పుడు ఒక బిడ్డకు తల్లై ఉంటారు. మీ శిశువు కోసం అన్ని రకాల శ్రద్దతీసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ప్రసవం తర్వాత హాస్పటల్‌ నుంచి ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండే మీ లైఫ్‌ స్టైల్‌ మీ మారిపోతుంది. మీ శరీరం మైండ్‌ మీద ఒత్తిడి పడుతుంది. గర్భాధారణ సమయంలో జరిగిన హార్మోనుల్లో మార్పులు మైండ్‌ సెట్‌ను తిరిగి నార్మల్‌ కండిషన్‌కు తీసుకురావాలి. అందకు కొంత సమయం పడుతుంది. మీ అంతకు మీరు స్వతహాగా కేర్‌ తీసుకోవడానికి బేబీని జాగ్రత్తగా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలతో పాటు డైట్‌ ఫాలో అవ్వడం చాలా అవసరం.
ప్రసవం తర్వాత కొత్త తల్లి పోస్ట్‌ నేటల్‌ డైట్‌ను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. 
మీరు తీసుకొనే ఆహారం మీదే మీ బేబి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకొనే పౌష్టికాహారంతోనే బిడ్డకు సరిపడా ఫీడింగ్‌ చేయవచ్చు. శిశువుకు బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేసే సమయంలో సరైన న్యూట్రిషియన్‌ ఫుడ్‌ తీసుకోవడం చాలా అవసరం. పౌష్టికాహార లోపం వల్ల ఆ ప్రభావం శిశువు మీద చూపెడుతుంది. మీరు తీసుకొనే ఆహారం పరిమాణంలో కంటే పోషకవిలువల నాణ్యత చూడాలి. సాధారణ ఆహారం లేదా హై క్యాలరీ ఫుడ్‌ తీసుకోవడం వల్ల అది మీకు కానీ, మీ శిశువు కానీ ఎటువంటి ప్రయోజనం కలిగించదు. మరి ప్రసవం తర్వాత కొత్తతల్లి తీసుకోవాల్సిన పోస్ట్‌ నేటల్‌ డైట్‌ సూపర్‌ ఫుడ్స్‌ క్రింది స్లైడ్‌ లో చూడండి. ఇవి అటు కొత్తగా తల్లైన వారికి మరియు వారి శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది.

పోస్ట్‌ నేటల్‌ డైట్‌ సూపర్‌ ఫుడ్స్‌:
 • పెరుగు: ప్రసవం తర్వాత మీరు తీసుకొనే ఆహారంలో పెరుగును చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది మీకు కావల్సినంత క్యాల్షియంను, ప్రోటీనులను అంధించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 • ఉసిరి కాయ (గూస్‌ బెర్రీ): ఉసిరికాయలో ఐరన్‌ మరియు విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయను పోస్ట్‌ నేటల్‌ డైట్‌ లో చేర్చి తీసుకోవడం చాలా అవసరం. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ సమయంలో కొత్త తల్లి కోల్పోయే ఐరన్‌ కంటెంట్‌ ను తిరిగి క్రమం చేయడానికి ఐరన్‌ రిచ్‌ గా ఉండే ఈ ఉసిరికాయ బాగా సహాయపడుతుంది.
 • నీళ్లు: ప్రతి రోజూ తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నీరు ఎక్కువగా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుతుంది. అంతే కాదు ప్రసవం తర్వాత ఏర్పడే మలబద్దక సమస్యను నివారిస్తుంది. ఇంకా ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భాధారణ సమయంలో తీసుకొన్న వివిధ రకాల మందులు మాత్రల వల్ల దెబ్బతిన్న చర్మాన్ని(పొడిబారిన చర్మాన్ని)తిరిగి యదాస్థితికి తీసుకు రావడానికి నీళ్లు మాయిశ్చరైజర్‌ గా పనిచేస్తుంది.
 • అరటి: ప్రసవం తర్వాత మీ శరీరానికి కావల్సినంత శక్తిని, బలాన్ని అంధించడంలో అరటి పండు అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే అరటి పండులో హై ఐరన్‌ కంటెంట్‌ తో పాటు పొటాషయం పుష్కలంగా ఉంటుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

31, అక్టోబర్ 2017, మంగళవారం

ఎనీమియా - రక్త హీనత

Anemia-raktahinata

రక్త హీనత అంటే ఏమిటి?
మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో (16 mg%) ఉంటుంది.
ఉదాహరణకు:
 • మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, 
 • ఆడవారిలో 12 గ్రాములు, 
 • 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, 
 • గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, 
 • బాలింతలలో 12 గ్రాములు, 
 • 6 నుండి 12 సం.ల లోపు పిల్లలో్ల 12 గ్రాములు ఉండాలి. 
ఒక వేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనతకు (అనీమియా) గురైన వ్యక్తి శరీ రంలో ఎర్ర రక్త కణాలు (రెడ్‌బ్లడ్‌సెల్స్‌- ఆర్‌ బిసి- లేదా ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. రక్త పరీక్షలో ఆర్‌బిసి కౌంట్‌ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్రరక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది. ఆర్‌బిసి లో ఆక్సిజన్‌ను తీసుకునివెళ్లే కణాలను హీమో గ్లోబిన్‌ అంటారు.
ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్‌ ఒక డెసి లీటర్‌కు 12 గ్రాములుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది. ఆర్‌బిసి కౌంట్‌ ఒక మైక్రోలీటర్‌కు 4.4నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది. ఆర్‌బిసిలోని హీమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళుతుంది. ఆక్సిజన్‌ రవాణా వ్యవస్థగా ఎర్ర కణాలు ఉపకరిస్తాయి. ఆక్సిజన్‌ శరీరానికి ఇంధనంగా ఉపయోగపడుతుంది.
రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ అందదు. రోగి ఎంతో అలసట పొందడం, చివరకు శ్వాస తీసు కోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా నశించిపోయినట్లు భావిస్తారు . ఆర్‌బిసి లలో ఉన్న హీమోగ్లోబిన్‌ కణాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వ్యర్థ పదార్థాన్ని సేకరించి, ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఊపిరితిత్తులు ఈ వ్యర్థపదార్థాన్ని విసర్జిస్తాయి.

శరీరంలో ఉండే ఎరిత్రోప్రోటీన్‌ అనే హార్మోన్‌ బోన్‌ మారోను ఉత్తేజపరిచి, ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించేలా చేస్తుంది. శరీరంలో ఉండే దాదాపు మొత్తం ఎరిత్రోప్రోటీన్‌ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. అక్కడినుంచి ఎరిత్రోప్రోటీన్‌ బోన్‌మారోకు చేరుతుంది. ఇక్కడే ఎర్ర రక్తకణాలు తయారవుతాయి. ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు మూత్రపిండాలు అవసరమైన స్థాయిలో ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేయలేవు. ఎరిత్రోప్రోటీన్‌ లేకుండా, బోన్‌మారో తగి నంత సంఖ్యలో ఎర్ర రక్తకణాలను తయారు చేయలేవు. ఫలితంగా శరీరావసరాలకు సరిపో యేంత ఆక్సిజన్‌ అందదు.మూత్రపిండాలు విషపదార్థాలను, ద్రవాలను శరీరంనుంచి తొలగిస్తాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిలో ఈ పని డయాలిసిస్‌ ద్వారా కొంత జరుగుతుంది.కాని, ఎరిత్రోప్రోటీన్‌ను తయారు చేయడం మాత్రం మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు సంభవం కాదు.

కారణాలు : స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత – రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.

1. పౌష్టికాహార లోపం – ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.

2. రక్తం నష్టపోవడం – స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో పొట్టపురుగులు ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.

3. రక్తం తయారీలో అవరోధం – జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు...దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.
 
లక్షణాలు:
బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం.
1) నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం,
2) అలసట,
3) చికాకు,
4) ఆకలి లేకపోవడం,
5) మైకం, కళ్ళు తిరగడం,
6) అరచేతుల్లో చెమట,
7) చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం
8) పాదాలలో నీరు చేరడం,
9) చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం.

రక్త హీనత ఎవరిలో ఎక్కువగా కనబడుతుంద?

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 15-45 సం.వయస్సు గల స్త్రీలు, 11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారిలో కూడా రక్తహీనత చోటుచేసుకోవడం అసాధారణం కాదు.

రక్త హీనత వల్ల కలిగే దుష్పరిణామాలు
బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గుదల, రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం, చదువులో వెనుకపడడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మైదలైనవి.

రక్త హీనతను నివారించడం ఎలా?

చికిత్సా విధానం : చిన్న పిల్లలకి పొట్టపురుగుల మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.

రక్త హీనతను నివారించడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. రక్త హీనతకు తేలికగా గురికాగల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఉపకేంద్రం ద్వారా ఇనుమున్న ఎర్రగోలీలు (ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు) ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఈ గోలీలను గర్భిణీ స్త్రీలయితే 6వ నెల మొదటి నుండి 100 రోజుల పాటు, బాలింతలు చనుబాలు యిస్తున్నంత కాలం లేదా 100 రోజుల పాటు, 11 సం. వయస్సులోపున్న రక్త హీనతగల పిల్లలు సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు క్రమం తప్పకుండా రోజుకొక్కగోలీ చొప్పున తీసుకోవడం వల్ల వారి శరీరానికి పూర్తి రక్తపుష్టి చేకూరుతుంది.

ఈ మాత్రలు తీసుకొనేవారి మలం నల్లబడడం, వికారం కల్గడం సహజం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.
ఆకుకూరలు రక్త హీనత నివారణకు సులభమైన ఉపాయం --- ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేగాక ఖరీదైన ఎండినపండ్లు, అంటే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర్, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా యినుము పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు, రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్త హీనత రాకుండా చూసుకోవచ్చు.
రక్త హీనత నివారణకు నూతన పద్ధతి : దేశ ప్రజలలో అధికశాతం రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు మనం మామూలుగా తీసుకొనే ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ వారు కనుగొన్నారు. మామూలు ఉప్పు బదులుగా క్రొత్తగా తయారుచేసిన ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్త హీనతను నివారించవచ్చును. ఈ ఇనుము కలిపిన ఉప్పు ప్రస్తుతం కొన్ని పట్టణ ప్రాంతాల్లో లభ్యం అవుతోంది.

రక్త హీనతను అశ్రద్ధ చేయకండి. అది నీరసానికి బలహీనతకు మాత్రమే దారితీయదు. ప్రాణాహానిని కూడా కల్గించవచ్చు. రక్తహీనతను దరిచేరనీయకండి. ఇనుము పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి. రక్తహీనత ఉన్నవారు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వందరోజులు తీసుకోండి. మీ గ్రామ ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని, ప్రభుత్వ ఆసుపత్రిలోగాని సంప్రదించి దీనిని నివారించే పద్ధతుల వివరాలను విపులంగా తెలుసుకొని పాటించండి.
Anemia-raktahinata
మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...
--ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత.
విటమిన్ బి12 తప్పనిసరి..!
తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది...

అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.

మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.

రక్తహీనత బారినపడొద్దు-ముందే జాగ్రత్త పడటం :
మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీలు, పిల్లలు ఎంతోమంది. దీని బారినపడ్డవారి రక్తంలో ఎర్రకణాలు తగ్గిపోతాయి. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ సరిగా అందదు. రక్తహీనత తీవ్రతను బట్టి.. నిస్సత్తువ, పనులు చేస్తున్నప్పుడు శ్వాస కష్టంగా ఉండటం, మగతగా అనిపించటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి తగ్గటం, గుండె సరిగా కొట్టుకోకపోవటం వంటివీ ఉండొచ్చు. కాబట్టి రక్తహీనత బారిన పడకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ఉత్తమం. అందుకు ఆహరంలో తగు మార్పులు చేసుకుంటే సరి.
 • ఇనుముతో నిండిన యాపిళ్లు, అరటిపండ్లు, ఆకుకూరల వంటివి ఎక్కువగా తినాలి. మాంసం, ముడిధాన్యాలు కూడా మంచివే.
 • సి విటమిన్‌ ఇనుమును ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి సి విటమిన్‌ గల పదార్థాలు, పానీయాలు కూడా అధికంగా తీసుకోవాలి.
 • భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగటం మానెయ్యాలి. ఇవి ఇనుమును గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి. ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ బి12తో నిండిన పాలకూర వంటి ఆకుకూరలు, కాలేయం, ముడిధాన్యాలు తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాల్లోనూ ఇనుము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో విధిగా చేర్చుకోవాలి.

మన ఆరోగ్యాన్ని మనమే కాపాడు కోవాలి. ఎవరో వస్తారు ఏవోచేస్తారు ... అన్నింటికీ దేవుడే ఉన్నాడులే అని అనుకోకూడదు. డా.శేషగిరిరావు (శ్రీకాకుళం)


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి