నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, May 28, 2017

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో , సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము . ఇది ఒక సనాతన , కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము . ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి . ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ... అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి , చేయించాలి .

ప్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు , బంధుమిత్ర అనుబంధాలు , ఆప్యాయతలు మెండుగా ఉండేవి . పండుగులకు , పబ్బాలకు , ఉత్సవాలకు , గ్రామ వేడుకలకు , ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు . అది ఎంతో మంచి సంప్రదాయము . నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక , టైం లేదని వాపోతుంటారు . మన సంస్కృతిలోని పురాణ కథలు , వ్రతాలు , నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు , చరిత్రలు మన తరువాత తరమువారికి అందించే భాద్యత మన అందరిపైనా ఉన్నది .

తోడబుట్టిన స్త్రీ సంతానాన్ని " భగిని" అంటారు . ఆమె హస్తము తో చేసిన (చేతితో వండిన)భోజనాన్ని చేయడాన్ని భగినీహస్త భోజనము అంటారు . కార్తీక మాసము ప్రవేశించిన 2 వ రోజున ఈ బోజనాలు చేయాలన్నది శాస్త్రము . ఇక్కడ రెండు వేరు వేరు కాలలో చెప్పబడిన కదనాలు ఉన్నాయి. ఒక కాలము లో బలిచక్రవర్తిని , ఇంకోకాలము లో యమధర్మరాజుని వారి వారి చెల్లి , లేదా అక్క (ఇక్కడ అన్నా-చెల్లెలు , అక్కా-తమ్ముడు ... అంటే తమ సోదరుల్ని (సమానమైన ఉదరము అంటే ఒకే తల్లి గర్భము నుండి పుట్టిన వాళ్ళని ) తమ ఇంటికి కనీసము ఏడాదికి ఒకసారైనా వచ్చి తమ చేతి భోజనము తిని వెళ్ళవలసిందిగా కోరారట .  కార్తీక శుద్ద విదియ నాడు వస్తామని ఆ ఇద్దరూ ఒకప్పుడు మాటినిచ్చి అలాగే జీవితాంతము చేశారని పురాణం లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు తమ సోదరి (ల) ఇంటికి వెళ్ళి భోజనము చేసి కానుకలు , వస్త్రాలు పెట్టి -- అక్క ఇంటికెళ్తే ఆమె ఆశీర్వాదాన్ని పొందాలని , చెల్లిలయితే ఆమె ను ఆశీర్వదించి రావాలని ... ఓ నియమము చేసింది శాస్త్రము . ... అదే " భగినీ హస్తభోజనము "

దీపావళి పండుగ తరువాత వచ్చే విదియ యమద్వితీయ , లేక భ్రాతృద్వితీయ . ఆ రోజు ప్రతి పురుషుడు తమ చెల్లెలు ఇంటనో ... చెల్లెలు లేనట్లైతే చెల్లెలు వరస ఇంటనో , అక్క ఇంటనో భోజనము చేయాలి . ఈ పండుగ నియమ నిభందనాలలో ఇదొకటి . సూర్య భగవానుని సంతానమైన యమున (కూతురు) యమధర్మరాజు కవలపిల్లలు ... చెల్లెలు తన ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా పని భారముతో యముడు వెళ్ళడం కుదరలేదు . . . చివరకు ఒకరోజు అనగా దీపావళి తరువాత విదియ నాడు వెళ్ళి చెల్లెలి ఆతిద్యం స్వీకరించి భోజనం చేసి ... వస్త్రాభరణాలు , కట్న , కానుకలు ఇచ్చాడంటారు . అలా ప్రతిసంవత్సరమూ చేస్తూఉంటాడని నమ్మకము . కార్తీక శుద్ధవిదియనాడు భ్రాతృపూజ అని ఈ ఆచారానిని అంటారు .

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu
జీవితాన్నీ , ఈ జన్మనీ పొందింది అక్కడెక్కడో శరీర -ఇంద్రియ -ప్రాణాలని ఫణము గా పెట్టి  ఉద్యోగము చేస్తూ గడిపేయడానికేనా?.. కాదు . ఒక అన్నా లేదా తమ్ముడూ ఓ సోదరి ఇంటికి వెళ్తే ఆమె ఇంటి పరిస్థితి ఎలాఉందో , మేనళ్ళుడూ ,మేనకోడలూ ఎలా ఉన్నారో, తమ సోదరి పట్ల బావగారు లేదా బావమరిది  ప్రవర్తన ఎలా ఉందో , ఇలా అన్నివిషయాలు ప్రత్యక్షము గా తెలుస్తోంది. మరి అన్న లేదా తమ్ముడే ఎందుకు వెళ్ళాలి అంటే తమని కన్న అమ్మకుడా ఓ సోదరుడుకి సోదరే కాబట్టి .. ఆయన రావలసిన రోజున అమ్మ తన కూతురు సంసారము చూడానికి వెళ్తే ఎలా?  .

ఇంట్లో ఉండే పెద్దన్న తండ్రి తరువాత తండ్రంతటివాడు .అలాగే ఇంట్లో ఉండే తోబుట్టువు అమ్మ తరువాత అమ్మంతటిది . అంటే దీనర్ధము భగినీ హస్తభోజనానికి తల్లిదండ్రులు గతించిన వాళ్ళే వెళ్ళాలని కాదు . అంతేకాదు ఇలా సోదరినుండి తన సంసార పరిస్థితిని గమనించిన సోదరుడు ఆ సంసార పరిస్థితి మొత్తాన్ని తమ తండ్రికి చెప్పలన్నదే దీనిలోని నేపధ్యము . కుటుంబాలు విడిపోకుండా ఉండేందుకు ఇదో సాంప్రదాకమైన పద్దతి.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com