కమలాఫలంతో ఆరోగ్యం - Kamalapndu Arogyam

0
కమలాఫలంతో ఆరోగ్యం - Kamalapndu Arogyam
శక్తినిచ్చే కమలాఫలం
రుచిని బట్టి పండ్లు రెండు రకాలు ఒకటి పుల్లని పండ్లు, రెండు తియ్యని పండ్లు. పుల్లని పండ్లలో చాలా పుల్లగా ఉండే పండ్లు కూడా ఉంటాయి. ఉసిరి కాయ, బత్తాయి, కమల, నారింజ, జలదారు, ఆపిల్‌, రాచ ఉసిరి, నేరేడు, రేగు మొదలైనవి పుల్లని పండ్లు. నిమ్మ, దబ్బ, నారింజ, చింత, అనాస, పచ్చి ద్రాక్ష మొదలైనవి అతి పుల్లని పండ్లు. మిగిలినవన్నీ తియ్యటి పండ్లుగానే పరిగణించబడతాయి. పులుపు అనగానే ఆమ్ల గుణం గుర్తుకు వస్తుంది. అందువలన పుల్లని పండ్లలో కేవలము ఆమ్లములే కాకుండా, తగినంతగా సేంద్రి యమగు క్షార లవణములు కూడా ఉంటాయి. పుల్లని పండ్లను జీర్ణము చేసుకొను క్రమములో దేహము వాటిని అంగార సంబంధమైన ఆమ్ల ములుగాను, జలముగాను విడ గొడుతుంది. అంగార సంబంధమైన ఆమ్లములు మలం ద్వారా బహిష్క రించబడతాయి. జలమును, క్షార సంబంధమైన లవణాలను శరీరం స్వీకరించి రక్తములో కలుపుకుంటుంది.

ఈ విధంగా దేహంలో క్షార సంపద వృద్ధి పొంది, ఆమ్ల, క్షార నిష్పత్తి సమంగా ఉంచ బడుతుంది. అయితే నోటిపూత, జీర్ణాశయ పూత ఉన్నరు మాత్రం పుల్లని పండ్లను తినరాదు. హిందీలో సంత్రా అని పిలిచే కమలా ఫలం ఈ మధ్యకాలంలో విరివిగా లభిస్తున్నది. గతంలో నాగపూర్‌ ప్రాంతానికే పరి మితమైన కమలాపండు నాగపూర్‌ కమలాగా పేరుపడింది. ఇప్పుడు దేశమంతటా విస్తారంగా పండించ బడుతూ, అన్ని కాలాలోను లభిస్తున్నది. నారింజలోని మంచి గుణాలను, బత్తాయిలోని మంచి గుణాలను రెండింటిని తనలో కలుపుకున్న అద్భుతమైన ఫలం కమలాఫలం. అది ఎలాగంటే నారింజ పండు లాగా దేహములోని రోగ మాలిన్యాలను బహిష్కరించి దేహాన్ని శుద్ది చేస్తుంది. బత్తాయిలాగా శరీరానికి తగిన పోష ణను, శక్తిని ఇస్తుంది. అయినప్పటికి, పుల్ల నారింజ ఏ వ్యాధులకు నిషిద్ధమో అట్టి వ్యాధులు గలవారు కమలాపండును పరిమితంగా తీసుకోవచ్చు. తియ్య నారింజ ఏ వ్యాధుల నివారణకు ఉపయోగించవచ్చో, ఆ వ్యాధులను నయం చేయటంలో నారింజ కన్నా కమలా అద్భుతంగా పనిచేస్తుంది.

100 గ్రాముల కమలా పండులో పోషక విలువలు
  • పిండి పదార్థాలు 10.6 గ్రాములు, 
  • క్రొవ్వు పదార్థాలు 0.3 గ్రాములు, 
  • మాంసకృత్తులు 0.9 గ్రాములు, 
  • కాల్షియం 50 మిల్లీగ్రాములు, 
  • భాస్వరం 20 మిల్లీగ్రాములు, 
  • ఇనుము 0.1 మిల్లీగ్రాములు, 
  • శక్తి 49 కేలరీలు
వైద్య సంబంధ ఉపయోగాలు 
కమలా పండును క్రమం తప్పకుండా తీసుకొంటే బ్రాంకైటిస్‌, ఉబ్బసము వంటి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులను, జీర్ణాశయ సంబంధ వ్యాధులను, మూత్రకోశ సంబంధ సమస్యలను, క్యాన్సర్‌ను నివారించవచ్చు. కమలా ఫలం హృదయానికి టానిక్‌ వంటిది. గుండెకు బలాన్ని ఇస్తుంది. గుండె జబ్బులను నివారించవచ్చు. టైఫాయిడ్‌, న్యుమోనియా, పసికర్ల వ్యాధులను ఉపశమింపచేయటంలో అద్భుతంగా పని చేస్తుంది

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top