హైందవులు భోజనము చేయు విధానము - Bhojanam Chese paddati, Vidanam

సనాతన హైందవ భోజనము చేయు విధానము - Bhojanam Chese paddati, Vidanam
భోజన విధానము
భోజనమునకు ఉపక్రమించే ముందు ముఖమూ, కాళ్ళూ, చేతులూ కడుక్కుని, శుభ్రంగా, శాంతంగా భోజనానికి ఉపక్రమించాలని  మన శాస్త్రాలు నిర్దేశించాయి. శాస్త్రాలు  చెప్పిన భోజన నియమాల ప్రకారం....

సనాతన హైందవ భోజనము చేయు విధానము - Bhojanam Chese paddati, Vidanam
అతిథులకు, అభ్యాగతులకు ఆహారమిచ్చి సంతృప్తి పరచాలి. సన్న్యాసులకూ, సాదువులకూ ఆహారమివ్వాలి. పసిపిల్లలకు, వృద్ధులకు, అనాథ లకు, దీనులకు భోజనం పెట్టాలి. ఆకలే అర్హత. ఆకలి గొని వచ్చిన వారెవరికైనా ఆకలిని తీర్చి, కడపట భుజించడమే గృహస్తు ధర్మం.

అన్నం భుజించడానికి ముందే అన్నం నుంచి కొంత భాగాన్ని తీసి, వేరుగా పెట్టాలి. దానిని ఆవుకో, పక్షికో పెట్టాలి. అలాగే కుక్కలకు కూడా అన్నం పెట్టాలి. మొదటగా ప్రాణులకు పెట్టి భుజించాలి.

సనాతన నియమములు:
 • ⧫ అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్ళన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని బ్రహ్మ పురాణం పేర్కొంది. 
 • ⧫ ఆవు నెయ్యితో తడప కుండా ఆహారాన్ని తినకూడదు. 
 • ⧫ ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరి చూపులూ పడేట్లుగా భుజించ కూడదు. తలుపులు వేసుకోవాలి లేదా పరదాలు వేసుకోవాలి. దృష్టి దోషం ఎంతటి వారిని అయినా కుంగదీస్తుంది.
 • ⧫ ఏ అచ్చాదనా లేకుండా నేలపై కూర్చుని భుజించరాదు. 
 • ⧫ ఏక వస్త్రంతో భోజనము చేయరాదు.
 • ⧫ ఏ పదార్థమైనా సరే పళ్ళతో కొరికి, బయటకు తీసి తిరిగి తినరాదు. 
 • ⧫ కలసి భోజనం చేయాల్సిన సందర్భాలలో ఇతరులు తనకోసం నిరీక్షించేలా చేయకూడదు.
 • ⧫ కలసి భోజనం చేస్తున్నపుడు ముందస్తుగానే ముగించి, ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు.
 • ⧫ తలమీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని, తల పాగా చుట్టుకుని భుజించ కూడదు. 
 • ⧫ తోలు మీద కుర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతిలో ధరించి కానీ భుజించ కూడదు. 
 • ⧫ నిలుచుకొని భోజనము చేయరాదు. 
 • ⧫ పగిలి పోయిన పళ్ళాల్లో భుజించ కూడదు. 
 • ⧫ బజార్లలో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు. వాటిపై ఆకలిగొన్న మనుషులు, పశువులు మొదలైన వాటి దృష్టి పడి ఉండవచ్చు. 
 • ⧫ భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు. 
 • ⧫ భుజించేటప్పుడు మాట్లాడ కూడదు. 
 • ⧫ మంచము మీద కూర్చుని భుజించరాదు. 
 • ⧫ మౌనంగా, సుఖంగా భుజించాలని శాస్త్రం చెబుతోంది. ప్రశాంత చిత్తంతో భుజించాలి. భుజించేటప్పుడు కామ క్రోధాదులు, హింసా వైరాల వంటి వాటికి మనసులో చోటుండ కూడదు. 
 • ⧫ విక్రయాన్నం తినకూడదని శంకలిఖిత స్మృతి శాసించింది. నేడు  హోటళ్ళలో తినేవన్నీ విక్రయాన్నాల కిందకే వస్తాయి. ఒకసారి వండిన దాన్ని, కొంతసేపటి తర్వాత తిరిగి వేడి చేసి, వడ్డించడం లాంటివి ఈ హోటళ్ళలో పరిపాటి.  
 • ⧫ ఈ  భోజన నియమాలు పాటించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయి. 
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top