శుభ కార్యం - Subhakaryam

0
శుభ కార్యం - Subhakaryam
శుభ కార్యాలు
పెళ్ళి:
ఆ రోజుల్లో పెళ్ళి సుమారు మూడు రోజులు జరిగేది. అన్నిరోజులు.... బాజ బజంత్రీలు, వంటలు భోజనాలు ఎన్నో వుండేవి.

పెళ్ళిల్లు ఇంటి వద్దనే జరిగేవి. పెళ్ళి మండపాలు అప్పట్లో లేవు. ఎక్కువగా అయిన వారి సంబంధాన్నే చేసుకునె వారు. అరుదుగా బయటి సంబంధం చూసే వారు. ఇరువైపుల వారు వధువును గాని వరున్ని గాని అనేక పరిక్షలకు గురి చేసి ప్రత్యక్షంగాని, పరోక్షంగాని చాల వివరాలు రాబట్టే వారు. స్నానం చేయించే నెపంతో చాకలి వారు అంగాంగ పరిక్ష జరిపేవారు రహస్యంగ. ఇక శోభనం రోజున తెల్లవారి చాకలి వచ్చి పక్కబట్టలను శల్య పరిక్ష చేసి ఆ రాత్రి వారి కలియక సక్రమంగా జరిగిందా లేదా అని నిర్ణయించే వారు. ఆరోజు సరైన ఫలితం రాకుంటే ఆ మరుదినం ...... ఇంకా కొన్ని రోజులు చాకలి నిశితంగా పరిశీలించి వివరాలను పెద్ద వారికి చెప్పేవారు. అంతే గాక సంబంధిత ముసలి వారు కూడా ఈ పరీక్ష వ్యవహారంలో ప్రధానంగా పాల్గొనే వారు. ఆ రోజుల్లో కులాంతర వివాహాలు పూర్తిగా లేవు. కాని అయిన వారి అమ్మాయిని తీసుకెళ్లి గుళ్లొ పెళ్ళి చేసుకొని వచ్చేవారు. ప్రస్తుతం పెళ్ళిల్లు పెళ్ళి మండపాలలో మాత్రమే జరుగు తాయి. తమ ఇళ్లముందు అంతగా జరుగుట లేదు.

పెళ్ళి చేసుకుని పరావూరునుండి ఈ వూరికి వచ్చిన పెళ్ళి కూతురు ఆ వూరిలో ఇంటింటికి కొన్ని పలహారాలు, పండ్లు, పశుపు కుంకుమ మొదలగువాటిని పంచాలి. పిల్ల పుడితే పురుడు పోయడానికి చాకలితో వూరి వారందరిని పిలవాలి. వారందరు వచ్చి నీళ్లు పోస్తారు. పల్లెల్లో కులాల వారిగా కొన్ని పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అవి ఇప్పటికి జరుగు తున్నాయి. ఒక కులంలో ఒక వర్గం వారికి ఒక కుల దేవత వుంటుంది. ఏడాది కొక సారి ఆ దేవతకు జాతర జరుపు తారు. అలా అన్ని కులాల వారికి, వర్గాల వారికి వారి కుల దేవత జాతర జరుగు తుంది. ఇది ఆవర్గానికి మాత్రమే సంబంధించింది. ఉదాహరణకు.... కమ్మ కులస్తులలో..... గొర్రెపాటి వారికి కుల దేవత దామల చెరువు సమీపంలో వున్న మొరవ పల్లిలో కొలువై వున్న వున్న ధనుకొండ గంగమ్మకు జాతర జరుపుతారు.

ఆ రెండు మూడు రోజుల పాటు, విందు, వినోదాలు, భజనలు, కోలాటాలు, ఇలా చాల కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజున జంతు బలులు కూడా వుంటాయి. అదే విధంగా... కమ్మ కులస్తులలో యల్లంకి అనె ఇంటి పేరు గల వారికి ఎర్ర చెరువు పల్లెలో కొలువై వున్న గురప్ప దేవుడు వారి కుల దైవం. ఇక్కడ కూడా ఏడాదికి ఒకసారి ఘనంగా జాతర జరుపు తారు. ఇతర కులస్తులలో కూడా ఇటు వంటి కులదైవానికి పూజలు, జాతరలు జరుగు తుంటాయి. ఇవి గాక గృహ ప్రవేశము, వంటి కార్యక్రమాలు చాల అరుదుగా జరిగేవి. గతంలో చిన్న పిల్లల పురుడు కూడా అందరికి చిన్న శుభ కార్యమె. అలాగె పెద్ద ఆడపిల్లలు సమర్తాడితె .... అది కూడా ఒక చిన్న శుభ్య కార్యమె. ఆ అమ్మాయిని ఒక ప్రత్యేక గదిలో కొన్నాళ్లు వుంచి మంచి ఆహారానిస్తారు. చివరి రోజున స్నానం చేయించి చిన్న పాటి సంబరం జరుపుకుంటారు. స్నానం చేసిన రోజున ఆ అమ్మాయి ఒంటి మీదున్న బట్టలు చాకలికి వదిలేయాలి. ఇది ఆచారము. దాని నుండి పుట్టినదే.. ఈ సామెత: " సరదాకు సమర్తాడితె చాకల్ది చీర పట్టు కెళ్లిందట ".

నాగుల చవితి:
నాడు పల్లెల్లోని స్త్రీలు తల స్నానం చేసి పూజా ద్రవ్వాలు తీసుకొని పాముల పుట్ట ఎక్కడున్నదో వెతుక్కుంటు వెళ్లి అక్కడ పూజ చేసి పుట్టలో పాలు పోస్తారు. కొంత మంది కోడి గుడ్డులను కూడా పుట్టలో వేస్తారు. కొంతమంది పుట్టకు నూలు దారం చుట్టి పూజ చేస్తారు.

పల్లెల్లో పుట్టలు ఎక్కువగానె కనబడతాయి. కాని పట్నాలలో పుట్టలు ఎక్కువ కనబడవు. ఈ అచారం పట్నాలలో కూడా ఉంది. కాని వారికి పుట్టలు దొరకడం కష్టం. ఈ పూజను నాగ దేవతకు చేసిన పూజగా భావిస్తారు. దీని వలన పాము కాటుకు గురి కారని, మరియు చిన్న పిల్లలకు చెవిలో చీము కారడం తగ్గుతుందని నమ్ముతారు. అక్కడక్కడా రావి చెట్టు కింద నాగ శిలలు వుండేవి. వాటికి కూడా పూజలుచేసె వారు. ప్రస్తుతం పట్టణాలలో కూడా ఇటు వంటి పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా నాగ శిలలకు ఆడ వారు మాత్రమే పూజలు చేసే వారు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top