నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, January 22, 2020

గడప పవిత్రత - Gadapa Pavitrataగడప పవిత్రత - Gadapa Pavitrata
పూర్వ కాలం గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చెప్పే సందర్భాల్లో ఇన్ని గడపలు వున్నాయని లెక్క తేల్చేవాళ్ళు. అలాగే ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకి 'బొట్టు' పెట్టేసి వెళ్తూంటారు.

దీనిని బట్టి గడపకి ఎంతటి ప్రాధాన్యత వుందో అర్ధం చేసుకోవచ్చు. గడపని శుభ్రంగా ఉంచడం, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెడుతూ వుండటం ప్రాచీన కాలం నుంచి వస్తోంది. అలాంటి గడపపై కూర్చున్నా, నుంచున్నా, గడపపై తలపెట్టి పడుకున్నా పెద్దలు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూంటారు. మరోసారి అలా చేయకూడదని మందలిస్తుంటారు.

గడపకి అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి గల కారణమేమిటో ఈ కాలం పిల్లల్లో చాలా మందికి తెలియదు. అందు వల్లనే కొంతమంది గడప మీద కూర్చుని ఇతరులతో కబుర్లు చెబుతూంటారు. కొంతమంది గడపను దాటకుండా దానిపై కాలు పెట్టి వెళుతూంటారు. ఒక్కోసారి దానిపై నుంచుంటారు కూడా. ఇక మరి కొంతమంది గడపపై తల పెట్టుకుని ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటారు. అవసరమైతే అలాగే పడుకుంటారు.

ఈ పద్దతి ఎంతమాత్రం మంచిది కాదని శాస్త్రం చెబుతూంది. గడప శ్రీమన్నారాయుణుడి స్థానం. నరసింహస్వామిగా ఆయన అక్కడ కూర్చునే హిరణ్యకశిపుడిని వధించడం జరిగింది. ఇక నారాయుణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మిదేవి కూడా కొలువై వుంటుంది. అందువలన గడప లక్ష్మిదేవి స్థానంగా కూడా చెప్పపడుతోంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ వుంటారు. అందువల్లనే గడపపై కూర్చోవటం, నుంచోవటం, తలపెట్టి పడుకోవడం వంటివి చేయకుండా దానిని పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది.

రచన: పురోహితులు - దేవి మురళీ - Mobile: +91-97175 69840
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com