ఇండోనేషియాలో భారతీయ సంస్కృతి - Indonesia, Ramayanam

0
ఇండోనేషియాలో భారతీయ సంస్కృతి - Indonesia, Ramayanam

ఇస్లాం మా మతం కానీ రామాయణం మా సంస్కృతి
కసారి పాకిస్తానీ నియంత జనరల్ జియావుల్ హక్ ఇండోనేషియా వెళ్ళాడు. అది ఒక ముస్లిందేశమని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు సైన్యశిక్షణానంతరం ఉండే passing out parade కి జియావుల్ హక్ ని ముఖ్య అతిథి గా ఆహ్వానించారు.
హనుమంతుని నాటకము - ఇండోనేషియా
హనుమంతుని నాటక ప్రదర్శన - ఇండోనేషియా 
ప్రతీ అధికారి హనుమంతుని విగ్రహం ముందు పెరేడ్ చేస్తున్నాడు. ఆ విగ్రహం ముందే శపథం స్వీకరిస్తున్నాడు. ఇది చూసిన జియావుల్ కి ఒళ్ళు మండిపోయింది. అక్కడి సైన్యాధికారిని ఇదేమిటని అడిగాడు. అతను ఎంతో గర్వంతో - "తాము మతాన్ని మార్చుకున్నామేగానీ , మా సంస్కృతిని , పూర్వీకులను మార్చుకోలేదు గదా!" అని సమాధానమిచ్చాడు.

వాళ్ళు పరిరక్షిస్తున్న సంస్కృతి భారతీయుల నుండి వారసత్వంగా గ్రహించినదే కదా! వాళ్ళే అంత శ్రద్ధ తీసుకుంటున్నపుడు భారతీయులమైన మనం, మన సంస్కృతీపరిరక్షణలో ఇంకెంత శ్రద్ధ వహించాలి? సెక్యులరిజం అనే గోలలో పడిపోయి , మతనిరపేక్షదేశం నుండి సంస్కృతీనిరపేక్ష దేశంగా ఎలా , ఎందుకు వెళ్ళిపోతున్నాము? మన సంస్కృతిని మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఎలాగో చూద్దాము .

ఉదాహరణకు:-
1950వ దశకం లో ఇండోనేషియా లో అంతర్రాష్ట్రీయ_రామాయణ మహోత్సవం జరిగింది.  అందులో భాగంగా జరిగే ఒక నృత్యనాటిక లో పాల్గొనుటకు కళాకారులను పంపమని ఆదేశం ప్రపంచదేశాలకు ఆహ్వానం పంపింది. కొన్ని ముస్లిందేశాలు కూడా కళాకారులను పంపాయి. కానీ అప్పటి ప్రధాని నెహ్ర - "మనది సెక్యులర్ దేశమనీ , అందువలన కళాకారులను పంపటం కుదరదు" అని తెలిపాడు. అంటే మనదేశ_సంస్కృతీ పరిరక్షణ కన్నా అతగాడికి సెక్యులరిజం ఎక్కువైపోయింది. అయితే , ఆశ్చర్యంగా ఇందిరాగాందా ఇంకొకపని చేసింది. మొరాకో రాజధానిలో జరిగే అంతర్రాష్ట్రీయ ముస్లిం సమ్మేళనానికి అప్పటి కేంద్రమంత్రి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ను పంపింది. అసలు విషయమేమంటే - మనకు అసలు ఆహ్వానం అందనే లేదు. పైగా ఏమని సమర్థించుకుందో తెలుసా? చాలా ముస్లిందేశాలకన్నా మనదేశంలో ముస్లింల జనాభా ఎక్కువట , కాబట్టి పంపక తప్పలేదట. మీరంతా తెలివైనవారు కాబట్టి నేను విషయాన్ని వివరించనవసరం లేదు.

2016 సంవత్సరం ఇండోనేషియా దేశం యొక్క విద్య మరియు సంస్కృతీ శాఖామంత్రి అనీస్_బాస్వేదన్ మనదేశం వచ్చారు. ఏమన్నారో చూడండి - "మా దేశం రామాయణ ప్రదర్శన లకు పెట్టిందిపేరు. మా కళాకారులు సంవత్సరంలో రెండుసార్లు మీదేశంలోని వివిధ నగరాలలో పర్యటించి రామాయణ ప్రదర్శనలు చేయడానికి అనుమతించండి. మీ కళాకారులు కూడా మా దేశానికి రండి. ఇరుదేశాలు కలిసి ప్రదర్శనలు చేద్దాము. ఇరుదేశాల విద్యార్థులకు కూడా శిక్షణ ఇద్దాము. మా విద్యావిధానంలో రామాయణం ని చేర్చాము." ఈ విషయం మీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించిందా?లేదా? చెప్పండి.

ఇండోనేషియా మొదటి రాష్ట్రపతి సుకర్ణో సమయంలో , పాకిస్థాన్ కు చెందిన డెలిగేషన్ ఒకటి అక్కడ పర్యటించింది. అపుడు వాళ్ళు రామలీల ప్రదర్శించడాన్ని చూసి షాక్ తిన్నారట. ఒక ముస్లిం దేశంలో రామలీలా? అని అడిగారట. దానికి సుకర్ణో సమాధానమేమిటో తెలుసా? ఆయన ఇలా అన్నారట - " ఇస్లాం మా మతం అంతే , కానీ రామాయణం మా సంస్కృతి."

అటువంటి దేశాధ్యక్షుడికి , తమ సంస్కృతీ పరిరక్షణలో  భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్న ఇండోనేషియా ముస్లింలకు శతకోటిప్రణామాలు. 🙏

సంకలనం: కోటేశ్వర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top