నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

2, జులై 2020, గురువారం

ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశపెట్టిన ప్రధాని మోడీ - Prime Minister Modi has introduced the largest welfare scheme in the world, the Garib Kalyan Yojana


ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశపెట్టిన ప్రధాని మోడీ - Prime Minister Modi has introduced the largest welfare scheme in the world, the Garib Kalyan Yojana

గరీబ్ కళ్యాణ్ యోజన

  • ➣ 1.50 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన
  • ➣ పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి
  • ➣ ఈ సంఖ్య అమెరికా జనాభా కంటే రెండున్నర రెట్లు ఎక్కువ
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల పేద ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది.

మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకు మరో ఐదు నెలల పాటు ఉచిత రేషన్ అందించనున్నట్టు ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల దేశంలో 80 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి ఇప్పటికే 60 కోట్లు ఖర్చు చేసినట్టు మరో 90 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మొత్తంగా 150 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా దేశ ప్రజలను ఆదుకునే శక్తి ప్రభుత్వానికి ఉందని మోడీ స్పష్టం చేశారు. గ్రామంలో ఉపాధి కల్పించే చర్యలు కూడా చేపట్టినట్టు దీనికోసం రూ.ఐదు వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఒకే నేషన్ ఒకే రేషన్ కార్డ్ విధానాన్ని అమలు చేయడానికి యోచన చేస్తునట్టు మోడీ తెలిపారు.

ఈ ఏడాది రెట్టింపు ధాన్యం ఉత్పత్తి:
ఈ ఏడాది గత ఏడాది కంటే రెట్టింపు ధాన్య ఉత్పత్తి జరిగిందని, నిల్వలు రెట్టింపు అవడంవల్ల ఈ రేషన్ పధకాన్ని అమలుచేయగలమని ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు.

80 కోట్ల మందికి లబ్ధి:
ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన పథకం ప్రకారం నవంబర్ వరకు ఉచిత బియ్యం లేదా గోధుమలతో పాటు శనిగలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రకారం దేశంలో 80 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఈ సంఖ్య అమెరికా జనాభా కంటే రెండున్నర రెట్లు ఎక్కువ, యూరోపియన్ యూనియన్ కంటే రెండింతలు ఎక్కువ, యూకే జనాభా కన్నా 12 రెట్లు ఎక్కువ.

కరోనా ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయి.

ఒక వైపు కరోనా ని నిర్మూలించడానికి ఎన్నో రకాల చర్యలు చేపడుతున్న ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూనే మరోవైపు  పేద ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తూ వారి కడుపు నింపుతోంది.

__విశ్వ సంవాద కేంద్రము
« PREV
NEXT »