దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
   ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీ బయ్యా వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, పవిత్ర దేవీ దేవతల విగ్రహాలపై దాడులు నిత్య కృత్యం అయిపోయాయని, అయినా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్నదని విమర్శించారు. జరిగిన ఘటనలలో ఏ ఒక్కరినీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, హిందువుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చులకన భావానికి నిదర్శనమని పేర్కొన్నారు.

    అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఒకటున్నదా? హోం మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నదా? హిందువులకు, హిందూ దేవాలయాలకు, దేవీ దేవతలకు రక్షణ ఉన్నదా? వందల సంఖ్యలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటే ఉపేక్ష వహిస్తున్న ఈ ప్రభుత్వం ఇది తన వైఫల్యంగా అంగీకరిస్తుందా? ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఏ ఒక్క ఘటననైనా సీఎం గాని, హోం మంత్రి గాని ఎందుకు స్పందించడం లేదు? ఇన్ని ఘటనలు జరిగితే ఒక్క ఘటనా స్థలాన్ని కూడా వారిద్దరిలో ఒక్కరైనా ఎందుకు సందర్శించటం లేదు? మరో వైపు మంత్రుల బాధ్యతారహిత వ్యాఖ్యలు… హిందువులను అవమానించడం కాదా? అని వారు ప్రశ్నించారు.


ఇప్పటికైనా రాష్ట్రంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్నఈ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top